April 3, 2013

జగన్ తప్పు చేయకపోతే 9 నెలలుగా బెయిల్ ఎందుకు రాదో?

చార్జీలు తగ్గిస్తా!
నిత్యావసర ధరలూ దించుతూ
'తూర్పు' పాదయాత్రలో చంద్రబాబు

కాకినాడ : తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్ చార్జీలను తగ్గిస్తామ ని ఆ పార్టీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. కొండెక్కిన నిత్యావసర ధరలను కూడా కిందకు దించుతామని భరోసా ఇచ్చారు. వైఎస్ రాజశేఖరరెడ్డి దోచుకున్న లక్ష కోట్ల రూపాయలు ఉండి ఉంటే.. ఇప్పుడీ చార్జీల భారం తప్పేదని వ్యాఖ్యానించారు. తూర్పుగోదావరి జిల్లా సా మర్లకోట మండలం అచ్చంపేట జంక్షన్ వద్ద మంగళవా రం ఆయన పాదయాత్ర నిర్వహించారు.

తిమ్మాపురం, పండూరు జంక్షన్, డీ వెంకటాపురం, తండ్రవాడ, పవరా జంక్షన్..చిత్రాడ, పిఠాపురం రూరల్ పోలీస్‌స్టేషన్ వరకు నడక సాగించారు. దారిలో కలిసిన మత్స్యకారులు, కూ లీలు, చిరు వ్యాపారులు, చేతి వృత్తుల వారి కష్టాలు ఆరాతీస్తూ ముందుకు సాగారు. "ఒక పేదవాడు నాలుగు మామిడిపళ్లు దొంగతనం చేస్తేనే సమాజం నిందిస్తుంది. అలాంటిది లక్ష కోట్లు దోచుకున్న వైఎస్, ఆయన కుమారుడిని మీరు క్షమిస్తారా? వారికి ఏ శిక్ష వేస్తే మీకు న్యా యం జరుగుతుంది?'' అని చిత్రాడ వద్ద ప్రసంగంలో వ్యాఖ్యానించారు.

శ్రీలక్ష్మి మంచి అధికారిణి అని, ఆమె తన హయాంలో బాగా పనిచేసిందని చంద్రబాబు గుర్తుచేశారు. వైఎస్ ధన దాహానికి ఆమె జైలు పాలు కావాల్సి వచ్చిందన్నారు. ప్రజల ఆస్తులకు ట్రస్టీలుగా ఉండాల్సిన వారే దొంగలుగా మారుతున్నారని సీఎం కిరణ్‌పై ధ్వజమెత్తారు. "రాష్ట్రంలో తొమ్మిదేళ్ల పాటు రాక్షస పాలన సాగింది. ఇప్పటివరకు నలభై వేల కోట్ల మేర వివిధ రూ పాల్లో విద్యుత్ సర్‌చార్జీ విధించారు'' అని ధ్వజమెత్తారు. అంతకుముందు.. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం అచ్చంపేటలో పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. వచే ్చ ఎన్నికల్లో గెలిచే సత్తా ఉన్న వారికే సీట్లు కేటాయిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. సామాజిక సమీకరణలను పరిగణనలోకి తీసుకుని మంచివారికీ, సమర్థులకీ అవకాశం కల్పిస్తామన్నారు.