April 3, 2013

విద్యుత్ ఛార్జీలు తగ్గించాల్సిందే : టీడీపీ


పలమనేరు రూరల్ : పెంచిన విద్యుత్‌ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ పలమనేరు విద్యుత్ కార్యాలయం వద్ద టీడీపీ కార్యకర్తలు పెద్దఎత్తున ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పలమనేరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి పట్నం సుబ్బయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సామాన్యులు, రైతుల జీవితాలతో చెలగాటమాడుతోం దన్నారు.రైతులకు 7గంటల ఉచిత విద్యుత్‌ను అందిస్తామని హామీ ఇచ్చి 2గంటలు కూడా ఇవ్వకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయన్నారు. దీనికి తోడు విద్యుత్‌చార్జీలు అమాంతం పెంచివేస్తుండడంతో బడుగు జీవులు విద్యు త్ ఛార్జీలు కట్టలేని పరిస్థితి నెలకొందన్నారు. విద్యుత్ సరఫరా సరిగా లేకపోవడంతో పరీక్షల సమయంలో వి ద్యార్థులు ఇబ్బందిపడుతున్నారని, చిన్నతరహా పరిశ్రమలు మూసివేతకు గురవుతున్నాయన్నారు.

విద్యుత్ కోతతో కార్మికుల జీవితాలు రోడ్డున పడుతున్నాయన్నారు. దాదాపు అరగంటకు పైగా ధర్నా, రాస్తారోకో చేయడంతో భారీ ఎత్తున ట్రాఫిక్ స్తంభించిపోయింది. పోలీసుల జోక్యంతో రాస్తారోకోను విరమింపజేశారు. అనంతరం టీడీపీ నాయకులు విద్యుత్ అధికారులకు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగు దేశం నాయకులు ఆర్వీఎస్‌బోస్, ఆర్వీఎస్ బాలాజీ, డాక్టర్ కదిరప్ప, శ్రీనివాసులు రెడ్డి, శ్రీనివాసులు నాయుడు, ఆర్బీసి కుట్టి, అములు, సుబ్రమణ్యం నాయుడు , జగదీష్ నాయుడు తదితరులుపాల్గొన్నారు.

బంగారుపాళ్యంలో నిరాహార దీక్ష

బంగారుపాళ్యం : టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని విద్యుత్ సమస్య పరిష్కారం కోసం కాకినాడలోని నిరాహారదీక్షకుపూనుకోవడంతో ఆయనకు మద్దతుగా మండలంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు సింగిల్ విండో చైర్మన్ హేమచంద్రనాయుడు ఆధ్వర్యంలో బస్టాండు ప్రాంతంలో నిరాహారదీక్ష కార్యక్రమం నిర్వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో సింగిల్ విండో మాజీ చైర్మన్ నాగరాజు నాయుడు డైరెక్టర్లు మునిరత్నం రమేష్, నాయకులు లోకనాధం నాయుడు, సూరి, ధామస్, ప్రధాన కార్యదర్శి కోదండయాదవ్, హరినాయుడు, మునిరత్నంలతోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.