April 3, 2013

విద్యుత్‌పై టీడీపీ సమర భేరి

అనంతపురం అర్బన్: కరెంట్ చార్జీల పెంపు, కోతలపై తెలుగుదేశం పార్టీ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసింది. విద్యుత్ సంక్షోభంపై ప్రజా ఉద్యమానికి పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. ప్రభు త్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సంతకాల ఉద్యమానికి నడుంబిగించారు. అందులో భాగంగా రాప్తాడు ఎమ్మె ల్యే పరిటాల సునీత సంతకాల ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. జిల్లా కేం ద్రంలోని ఆమె స్వగృహంలో ఈ ఉ ద్యమానికి నాంది పలికారు. ఈ సందర్భంగా టీడీపీ విద్యు త్ సంక్షోభంపై ప్రత్యేకంగా బ్లాక్ పేపర్‌లో ముద్రించిన పుస్తకాల బ్రోచర్‌ను విడుదల చేశారు. ఆ తరువాత రాప్తా డు, అనంతపురంరూరల్, ఆత్మకూరు మండలాల టీడీపీ నాయకులతో స మావేశమై సంతకాల ఉద్యమంపై స మాలోచనలు జరిపారు.

అనంతరం ఆయా మండలాల నేతలకు ఉద్యమానికి సంబంధించిన కరపత్రాలు, సంతకాల సేకరణకు ముద్రించిన పేపర్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యుత్ చార్జీలు పెం పు చాలా దారుణమన్నారు. 2014 వ రకు విద్యుత్ చార్జీలు పెంచమని చెప్పి న పాలకులు ఇప్పటికి మూడు సార్లు పెంచి ప్రజల నెత్తిన భారం వేశారని మండిపడ్డారు. ఉచిత విద్యుత్‌ను 9 గంటల పాటు నిరంతరాయం గా అందిస్తామని గంట కూడా సక్రమంగా అందించడంలేదని ఆరోపించారు. ఎప్పుడు కరెంట్ ఉంటుందో.. పోతుందో తెలియక రైతులు అనేక కష్టాలు పడుతున్నారన్నారు. కోతల వల్ల బోర్లు కింద సాగు చేసిన పంట లు ఎండిపోతున్నాయన్నారు. కొంద రు రైతులు చేసిన అప్పులు కట్టలేక ఆత్మాభిమానం చంపుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని దీనివల్ల ఆ రైతుల కుటుంబాలవారు అనాథలుగా మారిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు పరిశ్రమల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. కరెంట్ కోతల వల్ల చిన్న చిన్న పరిశ్రమలు మూతపడి లక్షలాది మంది బతకలేని స్థితిలో ఉండిపోయారన్నారు. చేతగాని అసమర్థత ప్రభుత్వం వల్లే రాష్ట్రంలో ఈ పరిస్థితులు నెలకొన్నాయని మండిపడ్డారు. వ్యవసాయానికి 9 గంటలు నాణ్యమైన కరెంట్ ఇచ్చి ఎకరా పొలం ఎండకుండా చూసిన ఘనత చంద్రబాబునాయుడుదేనని కొనియాడారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానలను అవలంభిస్తుందన్నారు. ఇలాగే వదిలేస్తే రాష్ట్రం మరింత దిగజారిపోతుందన్నారు. అందుకే రాష్ట్ట్రాన్ని కాపాడుకోవడం కోసం తెలుగుదేశం పార్టీ ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టిందన్నారు. అన్ని వర్గాల ప్రజలు మా ఉద్యమానికి అండగా నిలిచి పాలకులు కళ్ళు తెరిపించాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేశారు. సంతకాల సేకరణ ఉద్యమంలో రాప్తాడు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలపాలని సూచించారు. విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ బుధవారం ఎన్ఎస్ గేట్ వద్ద హైవేపై భారీ ధర్నా నిర్వహిస్తామన్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు, రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని సునీత విజ్ఞప్తి చేశారు. సమావేశంలో టీడీపీ నేతలు రామ్మూర్తి నాయుడు, రామ్మోహన్ చౌదరి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు తిప్పేస్వామి, పరిటాల మహేంద్ర, అనంతపురం రూరల్, రాప్తాడు, ఆత్మకూరు మండలాల నాయకులు పామురాయి వెంకటేష్, మరూరు గోపాల్, హనుమంతప్పచౌదరి, వేణు, మనోరంజనిలతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.