April 3, 2013

కరేజ్ పోర్టు అభివృద్ధి

కాకినాడ 'యాంకరేజ్ పోర్టును అభివృద్ధి చేస్తాం. ఎగుమతులు, దిగుమతులు పెంచి ఇక్కడ ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తాం.''

'కాకినాడలో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించేందుకు రింగ్ రోడ్డు నిర్మిస్తాం.''

'ఇక్కడ నుంచి వైజాగ్ వరకు తీరం వెంబడి ప్రత్యేక రోడ్డు, అన్నవరం నుంచి కాకినాడ నాలగుఉ వరుసల రహదారి వేస్తాం..''

'కాకినాడలో డంపింగ్ యార్డు, క్త్రెస్తవ శ్మశానవాటికలకు స్థలాలు, ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తాం..''

'కాకినాడను ఐటీ పరంగా బాగా అభివృద్ధి చేస్తాం. ఇక్కడ ఐటీ పార్కు నిర్మిస్తాం.. ఆటోమోబైల్, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం..''


ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... టీడీపీ అధికారంలోకి వచ్చాక కాకినాడ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిపెడతానని హామీ ఇచ్చారు. త మ పార్టీ ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉందన్నారు. మాదిగలతో పాటు.. మాలలకూ న్యాయం చేస్తామన్నారు. కాకినాడ ఎంపీగా ఎన్నుకున్న వ్యక్తి ఏడాదికొకసారి కూడా కన్పించరని, అలాంటి ఎంపీ, అవినీతిపరుడైన ఎమ్మెల్యేలను చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు.

వైఎస్ నమ్మకద్రోహి

వైఎస్ ప్రజల్ని నమ్మించి అధికారంలోకి వచ్చి మోసగించిన నమ్మక ద్రోహి అని చంద్రబాబు తీవ్రంగా ఆరోపించా రు. ఊరుకో రౌడీ, మండలానికో దొం గ, జిల్లాకో దోపిడీదారుడ్ని తయారు చేసి రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించాడని విమర్శించారు.

వైఎస్ హయాంలో దోచుకున్నది కాపాడుకునేందుకే జగన్ పార్టీ పెట్టాడన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నపుడు రౌడీలు, దోపిడీదారులు రాష్ట్రం వదిలిపారిపోయారని చంద్రబాబు గుర్తుచేశారు.

అందరం పోరాడితేనే

అవినీతి అంతం


వైఎస్, కాంగ్రెస్ దొంగల అవినీతిపై అందరం కలసిపోరాడాలని చంద్రబా బు కోరారు. పేదల కోసం తాను పాదయాత్ర చేస్తున్నానని, కొంతమంది ఇం ట్లో కూర్చునే మీకు మద్దతు ఇస్తున్నాం అని చెప్తున్నారని.. అలా కాకుండా అందరూ తనలా పోరాడి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్‌లను ఓడించాలని విజ్ఞప్తి చేశారు. 'వాళ్ల అవినీతిపై మెసేజ్‌లు, పది మందికీ చెప్పడం ద్వారా కూడా ఉద్యమంలో పాల్గొనవచ్చన్నారు.

ఆకట్టుకున్న పేరాశ రాజు కథ:

పాదయాత్ర సందర్భంగా చంద్రబా బు కథలు, సామెతలు చెప్పి జనాన్ని ఆకట్టుకుంటున్నారు. సోమవారం జరిగిన పాదయాత్రలో సర్పవరం జంక్షన్‌లో తన ప్రసంగంలో వైఎస్ అవినీతిపై విమర్శలు చేస్తున్న సందర్భంగా చంద్రబాబు ఓ కథ చెప్పారు.

'ఒక రాజ్యంలో రాజు అందరినీ పీడించి తన కుమార్తెకు భారీగా బం గారం పోగు చేసేవాడు. ఎంత బం గారం ఉన్నా ఆ రాజుకు ఆశ తీరక... భగవంతుడి అనుగ్రహం కోసం యజ్ఞం చేస్తాడు. భగవంతుడు ప్రత్యక్షమై.. రాజుని ఏం కావాలి నీకు? అని అడుగుతాడు. నేను ఏది తాకితే అది బంగారం అయ్యే వరం కావాలి.. అని రాజు దేవుణ్ని కోరతాడు. రాజూ ఆలోచించుకో. నీ కోరిక సమంజసంగా లే దు. ఆ తర్వాత నువ్వే ఇబ్బందిపడతా వ్. అని దేవుడు అంటాడు. లేదు స్వా మీ.. నేను అన్నీ ఆలోచించుకునే నిన్ను ఈ కోరిక కోరాను? అంటాడు రాజు. 'నీ ఖర్మ' అని దేవుడు ఆ రాజుపై జాలిగా చూసి వరం ఇస్తాడు.

రాజు ఏది తాకితే అది బంగారం అవుతుంది. రాజు ఆనందానికి అవధు లు ఉండవ్. అన్నం తాకినా బంగారమవుతుంది. కూతురు వచ్చి తండ్రిని కౌగిలించుకుంటుంది. వెంటనే బంగా రు విగ్రహంగా మారిపోతుంది? ఏ కూతురి కోసం అయితే తాను ఈ కో రిక కోరానో.. ఆ కూతురే లేకపోతే ఇవ న్నీ నేనేం చేసుకోవాలి? తర్వాత నేను తినే తిండీ, నీరు కూడా బంగారమైపోతుంటే.. నేనెలా బతకగలను? అని రాజు కుమిలిపోతాడు? ఇదీ చంద్రబా బు చెప్పిన కథ. ఈ కథలో రాజు లాగే వైఎస్ తన కొడుక్కి భారీగా దోచిపెట్టాడని చమత్కరించారు.