April 3, 2013

బాబు యాత్ర జోరు

జిల్లాలో చంద్రబాబు నిర్వహించిన  రోజురోజుకీ పెరుగుతున్న జనాదరణను చూసి అటు కాంగ్రెస్, ఇటు వైసీపీ నేతలు ఆలోచనలో పడుతున్నట్టు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు చంద్రబాబు జిల్లాలో చేపట్టిన 'మీకోసం' యాత్ర కంటే ఇప్పటి పాదయాత్రకు వచ్చిన స్పందనను ప్రత్యర్థి పార్టీ నేతలు పోల్చుకుంటున్నారు. 'చిరంజీవి వచ్చినా జనం ఇలాగే వచ్చేవారు. జగన్ వచ్చినా ఇంతకన్నా ఎక్కువ హడావుడే వుండేది..' అని కొంతమంది నేతలు సర్దిచెప్పుకుంటున్నా.. మరికొంతమంది నేతలు.. బాబు పాదయాత్ర స్పందనపై లోతుగా విశ్లేషణ చేసుకుంటున్నారు.

గతంలో చిరంజీవిలాంటి నేతలు వచ్చినపుడు చూసి వెళ్లిపోయే జనం ఇపుడు చంద్రబాబు పాదయాత్ర వెంట కొంతదూరం నడవడం, రాత్రి 11 గంటల తర్వాత కూడా అధిక సంఖ్యలో పాదయాత్రలో పాల్గొనడం వంటి పరిణామాలపైనా ప్రత్యర్థి పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.

బాబు యాత్రకు మహిళల్లో అనూహ్య స్పందన విద్యుత్ కోతలు ప్రత్యక్షంగా అనుభవించేది మహిళలే. పిల్లలు, మగవారు ఇళ్లలో వుండేది తక్కువ సమయం. వీరితో పోలిస్తే గృహిణులే విద్యుత్ కోతలతో ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చంద్రబాబు పాదయాత్ర సభల్లోనూ ఎక్కువగా విద్యుత్ సమస్యపైనే మాట్లాడుతున్నారు. డ్వాక్రా సంఘాలను కాంగ్రెస్ నిర్వీర్యం చేసిందని, గ్యాస్‌కు పరిమితి విధించడం వంటివాటిపైనా బాబు తన ప్రసంగాలలో ప్రస్తావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ మహిళలు చంద్రబాబు యాత్రకు బ్రహ్మరథం పడుతూ వీధుల్లోకి వస్తున్నారు.

పెదపూడి 'దేశం'లో పెరుగుతున్న ఐక్యత పెదపూడి మండల టీడీపీ నేతలు ఏక
మవుతున్నారు. ఇతర పార్టీల్లో వున్న నేతల్ని సైతం తమ పార్టీలోకి ఆహ్వానించి బలం పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ముప్పయ్యేళ్లపాటు పదవులు అనుభవించి పార్టీకి దూరమైన బొడ్డు భాస్కరరామారావుకు వ్యతిరేకంగా అక్కడ ఆయన సామాజిక వర్గంలో కీలక నేతలు ఇప్పటికే సమావేశమై ఐక్యంగా వుండాలని నిర్ణయించుకున్నారు. ఇతర సామాజిక వర్గాల వారిని కూడా కలుపుకుని టీడీపీ బలం మరింత పెంచుకునే ప్రయత్నాలకు ఇప్పటి నుంచీ శ్రీకారం చుడుతున్నామని అక్కడి నేతలు చంద్రబాబును కలిసి వివరించారు. చంద్రబాబు కూడా ఆయా నేతలతో ప్రత్యేకంగా మాట్లాడారు. పెదపూడి సభలో స్థానికంగా పార్టీ బలోపేతానికి కృషిచేస్తున్న అనేకమంది నేతల పేర్లు చెప్పి మరీ అభినందించారు.