April 3, 2013

సర్కారుకిది శవయాత్రే!

ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే! జన్మభూమికి సేవ చేయడం ప్రతి కుమారుడి కర్తవ్యం! కానీ, వీళ్లేం చేస్తున్నారు? పుట్టింది ఇక్కడే.. కానీ పురిటిగడ్డను మరిచిపోతున్నారు. తల్లి కన్నా ఢిల్లీయే ఎక్కువ అన్నట్టు వ్యవహరిస్తున్నారు. కళ్లు తెరిచిన పల్లెలను, నడయాడిన ప్రాంతాలను, రాజకీయం చేసిన రాష్ట్రాన్ని వదిలేసి ఢిల్లీలో తిష్ట వేస్తున్నారు. ఎన్నుకున్న ప్రజల కోసం కాక, ఎవరి మెప్పు కోసమో పాలన చేస్తున్నారు. ఇక్కడి గాయానికి అక్కడి మందు రాస్తున్నారు. 'తగ్గలేదు' అంటే 'మీ కర్మం' అంటున్నారు.

ప్లాంటు ఇక్కడ పెడతారు.. కరెంటు బయట అమ్ముకుంటారు. మన సముద్ర గర్భాన్ని తవ్వి గ్యాస్ బయటకు తీస్తారు. వాసన రాకముందే రాష్ట్రం తరలించేస్తారు. ఈ ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు మాత్రం.. బొమ్మల్లా ఆడుతుంటారు. ఎంత ఘోరం? వీళ్లే సరిగా ఉంటే ఇంత చార్జీల భారం పడేదా? ఇంత కష్టకాలంలోనూ చూసిపోవడానికి రాని కొడుకు అయినా.. ప్రజాప్రతినిధి అయినా ఒక్కటే!

తూర్పుగోదావరిలో నడుస్తున్నప్పుడే రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచిన విషయం తెలిసింది. నిజానికి.. ఈ జిల్లా నుంచే దేశమంతటికీ 'గ్యాస్' పోతోంది. ఇక్కడి సముద్రంలోంచి తీసిన సహజ వాయువే పొరుగు రాష్ట్రాల

కానీ, దాని కడుపులో అపార చమురు నిక్షేపాలు ఉన్న విషయం మన ప్రభుత్వం కన్నా కార్పొరేట్ కంపెనీలకే ముందు తెలుస్తుంది. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు రాష్ట్రానికి చెందాల్సిన ఇంత విలువైన ఆస్తిని గుజరాత్‌కు తరలించేస్తారు. అదే ఈ సహజ వనరు మన నియంత్రణలో ఉంటే! ఈ జిల్లాలోని పల్లెలే కాదు..రాష్ట్రం కూడా చీకట్లో ఉండేవి కావు. ఊరి పొలిమేరల్లో గుడ్డి దీపాలు వెక్కిరించేవి కావు. కరెంటు సమస్యపై దీక్షా, నా పాదయాత్రా ఈ సర్కారుకు శవయాత్ర కావాల్సిందే!
ను ప్రగతి రథం ఎక్కిస్తోంది. కానీ, దాని గర్భస్థానంలో చూస్తే గాఢాంధకారం! ఈ జిల్లా పేరు చెబితే ఎవరికైనా కనుచూపు మేరలో పచ్చటి పొలాలు గుర్తొస్తాయి.