April 3, 2013

కాంగ్రెస్ హయంలో రాష్ట్రం కారుచీకట్లో

కాకినాడ రూరల్: కాంగ్రెస్ ప్రభుత్వహయాంలో రాష్ట్రం కారు చీకట్లోకి పోయిందని, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఎద్దేవా చేశారు. వస్తున్నా మీకోసం పాదయాత్ర  తిమ్మాపురం, పండూరు జంక్షన్‌లమీదుగా సాగి సామర్లకోట మండ లం నవర అనంతరం పిఠాపురంలో ప్ర వేశించింది. ఈ సందర్భంగా చంద్రబాబుకు తిమ్మాపురం, పండూరు జంక్షన్‌లో నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పిల్లి సత్తిబాబు, అనంతలక్ష్మి, వీవైదాస్‌తోపాటు మండలపార్టీ అధ్యక్షుడు ఆర్.సీతయ్యదొర ఆధ్వర్యంలో నాయకులు ఘనస్వాగతం పలికారు.

ఈ సందర్భం గా చంద్రబాబు మాట్లాడుతూ కాంగ్రెస్‌పార్టీలో గ్రామానికి ఒక దొంగను తయారుచేసి దోచుకోవడమే ప్రజాప్రతినిధు లు పనిగా పెట్టుకున్నారని ఆరోపించా రు. రూరల్‌లో తాగునీటి ఎద్దడి నివారణకు అప్పట్లో పండూరులో రక్షిత మంచినీటి పధకం రూపొందించామని, పూర్తిస్థాయిలో రూపొందించకపోవడంతో పథకం అమల్లోకి రాక ప్ర జల తాగునీటి సమస్యలు అలాగే ఉన్నాయన్నారు. ఇటువంటి ప్రాంతా ల్లో ఎన్టీఆర్ సుజల పధకం ద్వారా రక్షిత మంచినీరు అందించనున్నట్టు తెలిపారు. భవన నిర్మాణ కార్మికులు ప్రమాదంలో చనిపోతే రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా అందిస్తామన్నారు.

ప్రసు ్తతం రాష్ట్రంలో తుగ్లక్‌పాలన కొనసాగుతుందన్నారు. టీడీపీ హాయాంలోనే 35లక్షల గ్యాస్‌కనెక్షన్లు అందించామన్నారు. రాష్ట్రంలో ఎరువుల ధరలు 300 శాతం పెరిగితే ధాన్యం ధర 30 శాతం
మాత్రమే పెరిగిందన్నారు. వి ద్యుత్‌కోతలు పెరగడంతోపాటు చార్జీల మోతలు పెరిగాయన్నారు. ఈ పరిస్థితులనుంచి గట్టెక్కాలంటే టీడీపీతోనే సాధ్యమని ఆయన స్పష్టంచేశారు.ఈ పాదయాత్రలో నేతలు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, మెట్లసత్యనారాయణ, వాసంశెట్టి సత్య, మాకినీడి శేషుకుమారి, కలగా శివరాణి, కౌజు నెహ్రూ, సరిదే నాగహరినాధ్, దామన రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.