April 3, 2013

కరెంటు కష్టాలపై ప్రభుత్వం దిగి రావాలి

మడకశిర టౌన్: సామాన్యులు, రైతులపై మో యలేని విద్యుత్ భారాన్ని మోపిందని, ప్రభు త్వం దిగివచ్చేంత వరకు రైతుల పక్షాన నిలబడి తెలుగు దేశం పార్టీ పోరాటం చేస్తుందని నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఈరన్న అన్నారు.మడకశిర విద్యుత్ ఏడీ కార్యాలయం ఎదుట విద్యుత్‌కోతలు, పెంచిన చార్జీలను నిరిసిస్తూ ధ ర్నా చేపట్టారు. ఏడీ కార్యాలయాన్ని ముట్టడిం చి కార్యాలయానికి తాళాలువేసి నిరసన తెలిపా రు. విద్యుత్‌కోతలను ఎత్తివేయాలని, పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలని, సర్‌చార్జీలను ప్రభుత్వమే భరించాలని, రైతులకు 9 గంటలు నాణ్యమైన విద్యుత్‌ను అందించాలని డిమాండు చేశారు.

ప్రభుత్వం దిగివచ్చేంత వ రకు పోరాటాలు ఆగవని, రైతులకు అండగా తె లుగు దేశం పార్టీ ఉంటుందన్నారు. కార్యక్రమం లో జిల్లా అధికార ప్రతినిధి శ్రీనివాసమూర్తి, జి ల్లా ఉపాధ్యక్షులు వీ.ఎం.నారాయణరెడ్డి, జిల్లానాయకులు రంగేగౌడు, యువత ఉపాధ్యక్షులు రామక్రిష్ణయాదవ్, సీనియర్ నాయకులు ఆదినారాయణ, శంకర్‌నారాయణరెడ్డి, కరుణాకర్‌రె డ్డి, జిల్లా కార్యదర్శి కేశవరెడ్డి, మండల కన్వీనర్ రామక్రిష్ణ, ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి ప్రకాష్, నాయకులు పుల్లయ్యచౌదరి, చిన్నచెన్నయ్య, రాజగోపాల్,కిష్టప్ప, బొజ్జప్ప, హైదర్, ఫయా జ్, కార్యకర్తలు పాల్గొన్నారు.

నల్లజెండా ఎగరేసిన సీపీఎం

మడకశిర టౌన్: విద్యుత్‌చార్జీల పెంపునకు నిరసనగా సోమవారం సీపీఎం నాయకులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నల్లజెండా ఎగురవేసి నిరసన తెలిపారు. డివిజన్ కార్యదర్శి మనోహర్, నాయకులు ముస్తాక్,రామాంజనేయులు, మీరాన్‌సాబ్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి పెంచిన వి ద్యుత్ చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని, అంత వరకు పోరాటాలు చేపడతామన్నా రు. ఈనెల 9న జరిగే బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు. అనంతరం తెలుగుదేశం ధర్నాకు సీపీఎం నాయకులు మద్దతు తెలిపారు.

అమరాపురం : విద్యుత్ చార్జీల పెంపు, అప్రకటిత విద్యుత్ కోతను నిరసిస్తూ సోమవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఐ జిల్లా క మిటీ సభ్యుడు శివకుమార్, మండల సీపీఐ కార్యదర్శి ప్రకాష్ నిరసన తెలిపారు. విద్యుత్‌చార్జీలు పెంచడం నిరుపేదల జీవితాలతో ఆడుకోవడమేనన్నారు. రైతులకు సక్రమంగా విద్యుత్ అందించకపోవడంతో పంటలు ఎండుముఖం పడుతున్నాయన్నారు.

విద్యుత్ అంతరాయం కారణంగా గ్రామాలలో తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యుత్ చార్జీలు పెంచడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. కార్యక్రమం లో వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు కి ష్టప్ప, ఏఐఎస్ఎఫ్ నాయకుడు శంకర్, కరియప్ప, మహిళలు పాల్గొన్నారు.