April 25, 2013

బాబు'ను విమర్శించే స్థాయి కేసీఆర్‌కు లేదు

ఆదిలాబాద్ అర్బన్: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని విమర్శించే స్థా యి కేసీఆర్‌కు లేదని జిల్లా ఎంపీ రా థోడ్ రమేష్ అన్నారు. గురువారం పట్టణంలోని ఆర్అండ్‌బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో మాట్లాడారు. కేసీఆర్ చంద్రబాబునాయుడిని పదే పదే విమర్శించడం మానుకోవాలన్నారు. చంద్రబాబు నా యుడు అక్టోబర్ 2న చేపట్టిన పాదయాత్ర ఏడు నెలలు కావస్తోందని, వ స్తున్నా మీకోసంలో రాష్ట్ర ప్రజల సమస్యలను, స్థితిగతులను తెలుసుకోవడానికి చేపట్టారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో ప్రజలు పడుతున్న కష్టాల ను స్వయంగా తెలుసుకొని ప్రభుత్వ వి ధి విధానాలను ఎండగట్టడానికి తమ అధినేత పాదయాత్ర చేపట్టినట్లు పే ర్కొన్నారు.

ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా చంద్రబాబునాయుడు ఏడు నెలలు పాదయాత్ర పూర్తి చేశారని అ న్నారు. ఈనెల 27న చంద్రబాబు నా యుడి పర్యటన ముగింపు సందర్భం గా వైజాగ్‌లో జరిగే కార్యక్రమానికి జి ల్లాలోని పది నియోజక వర్గాల నుంచి ఐదు వేల మందిని జన సమీకరణ చేసి తరలిస్తున్నట్లు తెలిపారు. జిల్లా నుంచి ప్రజలను, కార్యకర్తలను తరలించడాని కి ఈనెల 26న ప్రత్యేక రైలులో మధ్యా హ్నం 12 గంటలకు తీసుకవెళ్తున్నట్లు తెలిపారు. ఈ శుభ పరిణామాన్ని పురస్కరించుకొని జిల్లా నుంచి పెద్ద సం ఖ్యలో తరలిస్తున్నామన్నారు.

టీఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్‌రావుకు తెలంగాణపై చిత్తశుద్ధి లేదని, కేవలం ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారన్నారు. తె లంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం జిల్లా నుంచి తనతో పాటు ఇతర ఎంపీలం క లిసి తెలంగాణ వాదాన్ని పార్లమెంటు లో వినిపించినప్పటికీ కేసీఆర్ మాత్రం పెదవి విప్పకపోవడం సిగ్గుచేటన్నారు. కేవలం రాజకీయ లబ్ది కోసం తెలంగా ణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని నాటకాలు ఆడుతున్నారన్నారు.

బయ్యారం గనులపై గతంలో టీడీపీ ఎత్తి చూపిందని, న్యాయస్థానం తీర్పు ఇచ్చిన అ నంతరం కేసీఆర్ మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ప్రజల్లో టీడీపీకి ఆదరణ పె రుగుతోందని, ప్రజల గుండెల్లో తెలుగుదేశం పార్టీ నిలిచే ఉందన్నారు. ప్ర త్యేక తెలంగాణ కోసం టీడీపీ కట్టుబడి ఉందని గుర్తు చేశారు. అవినీతి పరులకు టీడీపీ పార్టీ తగిన సమయంలో బుద్ధి చెబుతుందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభు త్వం పూర్తిగా నిర్లక్ష్యధోరణి అవలంభిస్తుందని, రాష్ట్రంలో సమస్యలతో రాజ్యమేలుతుందన్నారు.

టీడీపీ జిల్లా అధ్యక్షుడు గేడం నగేష్ మాట్లాడుతూ కాం గ్రెస్ ప్రభుత్వ హయంలో ప్రజా సమస్యలను గాలికి వదిలేసి తమ పదవుల ను కాపాడుకోవడానికే నాయకులు పరిమితమయ్యారన్నారు. రైతాంగ సమస్యలను పూర్తిగా విస్మరించడంతో రైతు లు ఇబ్బందుల్లో ఉన్నారన్నారు. రా ష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అనే విధంగా ఉందని విమర్శించారు. రైతు ప్రభుత్వమని చెప్పుకుంటున్న కాంగ్రె స్ ప్రభుత్వం రైతాంగ సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చేస్తామని సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి చెబుతున్నప్పటికీ గిరిజ న ప్రాంతాలను విస్మరించి కంటి తు డుపు చర్యగా చేస్తామని చెప్పడం సరికాదన్నారు.

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌లో ఎస్సీ, ఎస్టీ ఉపకులాల్లో ఉన్న వారందరికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో నియోజక వర్గ ఇన్‌చార్జి పాయల శం కర్, నాయకులు యునూస్ అక్బాని, బుచ్చి లింగం, జాదవ్ బలరాం నా యక్, ముథోల్ నియోజక వర్గ ఇన్‌చా ర్జి నగర్ నారాయణరెడ్డి, మాజీ ఎమ్మె ల్యే పాటి సుభద్ర ఉన్నారు.

టీడీపీ నాయకులతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ టీడీపీ నాయకులతో ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు బుధవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వైజాగ్‌లో నిర్వహిం చే ముగింపు కార్యక్రమానికి కార్యకర్త ల తరలింపు, సౌకర్యాలు, ఏర్పాట్లు ఎ లా ఉన్నాయని అడిగి తెలుసుకున్నా రు. ఈ కార్యక్రమంలో ఎంపీ రాథోడ్ రమేష్, పార్టీ జిల్లా అధ్యక్షులు గెడం నగేష్, పార్టీ నాయకులు ఉన్నారు.