April 25, 2013

సైకిల్ సవారీ


ఏలూరు:తమ పార్టీ అధినేత చంద్రబాబు పాదయాత్ర ముగింపును పురస్కరించుకుని ఆయనకు సంఘీభావంగా ఈ నెల 27వ తేదీన విశాఖలో జరగనున్న బహిరంగ సభకు జిల్లా నుంచి భారీగా తరలివెళ్ళేందుకు కార్యకర్తలు, నాయకులు ఏర్పాట్లలో ఉన్నారు. మండలాల వారీగా ఇప్పటికే ఎవరెవరు, ఏ సంఖ్యలో కార్యకర్తలను వెంట పెట్టుకుని విశాఖపట్టణం వెళుతున్నారో రాష్ట్ర పార్టీ కూడా ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది.

అత్యంత ప్రతిష్టాత్మకంగా, రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా, 64 ఏళ్ళ వయస్సులో తమ అధినేత చంద్రబాబు పాదయాత్ర చేసి రికార్డు సృష్టించడం సహజంగానే పార్టీ కార్యకర్తలో కూడా పూర్తి ఉత్సాహాన్ని నింపింది. గడిచిన రెండేళ్ళుగా పార్టీలో ఉన్న స్తబ్దత స్థానంలో ఇప్పుడు ఉత్సాహం కనిపిస్తున్నది. చడీచప్పుడు లేకుం డా ఉన్న నియోజకవర్గాల్లో కూడా మ ండల,గ్రామ స్థాయి నేతలే నేరుగా వి శాఖకు వెళ్ళేందుకు సిద్ధమవుతున్నారు. తమతోపాటు కార్యకర్తలను కూడా పెద్ద సంఖ్యలోనే తోడ్కొని వెళ్ళేందుకు సమావేశాలు నిర్వహించారు.

ఈ సమావేశాల్లో ఇక్కడి నుంచి బయలుదేరి వె ళ్ళి క్షేమంగా తిరిగి వచ్చేందుకు వీ లు గా అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నా రు.పార్టీ అధినేత చంద్రబాబు అత్య ంత ధైర్యంగా వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి పార్టీకి ప్రాణం పోసిన నేప«థ్యంలో కార్యకర్తలు,నాయకులు జి ల్లా నుంచి లక్ష మంది తక్కువ కాకుం డా విశాఖకు రావాల్సిందిగా పార్టీ పెద్దలు పదేపదే కోరుతున్నారు. ఈ మే రకు ముఖ్యనేతలందరికి తగిన మార్గదర్శకాల జారీ చేశారు. విశాఖలో జరిగే భారీ బహిరంగ సభకు జిల్లా నుంచి రికార్డు స్థాయిలో తరలివెళ్ళేలా పార్టీ జి ల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి, సీనియర్ నేత, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాగంటి బాబు,ఎమ్మెల్యేలు ప్రభాకర్, రామారావు,శివరామరాజు,శేషారా వు , ఇన్‌ఛార్జిలు ముత్తారెడ్డి, అంబికాకృ ష్ణ,డాక్టర్ బాబ్జి, డాక్టర్ చినమిల్లి సత్యనారాయణ, రాధాకృష్ణారెడ్డి, వైటి రా జా,మొడియం శ్రీను, ముళ్ళపూడి బాపిరాజు,గన్ని వీరాంజనేయులు, గా దిరాజు బాబు, ఎమ్మెల్సీ అంగర రా మ్మోహనరావుతో సహా మిగతా నేతలంతా ఇప్పటికే తమ నియోజకవర్గాల్లో విశాఖ బహిరంగ సభను విజయవంతంగా జరిగేలా కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. ఈ స మావేశాలకు హాజరైన కార్యకర్తలు వి శాఖకు వెళ్ళేందుకు ఉత్సాహం చూ పడం స
హజంగా పార్టీలోనే కొత్త పం డగ వాతావరణం సృష్టించింది.చంద్రబాబుపాల్గొనే బహిరంగ సభకు 3 గంటలు ముందుగానే ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖకు చేరుకునేలా నియోజకవర్గ నేతలు నేరుగా పర్యవేక్షకులకు బాధ్యతలు అప్పగించారు.పరిస్థితిని బ ట్టి ఒకరికొకరు సమాచారం ఇచ్చిపుచ్చుకునేలా కూడా తగినన్ని ఫోన్ నెం బర్లను సిద్ధం చేసుకున్నారు. చంద్రబా బు పాదయాత్ర ముగింపు అద్భుత ం గా సాగాలని సీతారామలక్ష్ష్మి, మా గం టి బాబులు ఇప్పటికే ఆకాక్షించా రు. పార్టీ సమావేశాల్లోనూ వీరు ఈ మే ర కు నాయకులకు స్పష్టమైన సంకేతా లు ఇచ్చారు.ఛలో..విశాఖ పేరిట జరుగుతున్న ఏర్పాట్లు కార్యకర్తల్లోను కొత్త ఉత్సాహాన్ని నింపాయి. వచ్చే ఎన్నికలకు ఈ సభే నాందికాబోతుందని భా విస్తున్న ఆశావహులు కూడా విశాఖ తరలి వెళ్ళేందుకు సిద్ధమవుతున్నారు.