April 25, 2013

దేశం' వసుధైక కుటంబం

 విశాఖపట్నం : పార్టీ వేరు...రాజకీయం వేరు...కుటుంబం వేరు...అన్న పద్ధతికి స్వస్తి పలికేందుకు చంద్రబాబు కొత్తప్రయోగం చేస్తున్నారు. ఏడు నెలలుగా ఆయన కుటుంబానికి, ఇంటికి దూరంగా ఉంటున్నప్పటికీ అప్పుడప్పుడు క్యాంపు వద్దకు వచ్చే కుటుంబ సభ్యులతో ముచ్చటిస్తున్నారు. ఇదే రకమైన బాంధవ్యాలు, మమకారాన్ని కార్యకర్తలు, నాయకులు కూడా కొనసాగించాలని ఆయన కోరుకుంటున్నారు. ఫ్యామిలీ సెంటిమెంట్‌పై ఆయన తరచూ మాట్లాడుతుండడమే ఇందుకు ఉదాహరణ. ముఖ్యంగా కార్యకర్తల సమావేశాల్లో పార్టీని వేరుగా చూడకుండా మనమంతా ఒక కుటుంబం అంటూ పదే పదే ఉద్బోధిస్తున్నారు. అందుకు తగినట్లుగానే కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు.

తెలుగుదేశంపార్టీలో పని చేసే అధినాయకుడి నుంచి కార్యకర్త వరకూ ఒకే కుటుంబం అంటూ కొత్త నిర్వచనం ఇచ్చారు. పార్టీలో ఎవరికి ఏ ఆపద వచ్చినా అందరూ వెన్నెంటే ఉండాలని చెబుతున్న చంద్రబాబు సుదీర్ఘ పాదయాత్రలో ప్రతి చోటా అక్కడి ముఖ్యనాయకుల కుటుంబాలను ప్రత్యేకంగా కలుసుకుంటున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే, ఇన్‌చార్జి, ఇతర ముఖ్య నాయకుల కుటుంబాలను క్యాంపువద్దకు పిలుపించుకొని వారితో కొద్దిసేపు ముచ్చటిస్తున్నారు. వారి యోగక్షేమాలు తెలుసుకుంటు

వారితోకలిసి ఫొటోలు దిగుతున్నారు. జిల్లాలో తొలుత నర్సీపట్నంలో చింతకాయల అయ్యన్నపాత్రుడు కుటుంబసభ్యులను శృంగవరం క్యాంపులో కలుసుకున్నారు. వారితో అరగంటకుపైగా మాట్లాడి ఉల్లాసంగా కనిపించారు. అనకాపల్లి నియోజకవర్గం వచ్చేసరికి మంగళవారం కశింకోటలో దాడి వీరభద్రరావు కుటుంబసభ్యులతో కలిసి ముచ్చటించారు. ఇంకా పలువురు ముఖ్యనాయకుల కుటుంబసభ్యులను బాబు క్యాంపు వద్ద కలిశారు. సమావేశాల్లో కూడా చంద్రబాబు మాట్లాడుతూ కుటుంబాన్ని, పార్టీని వేరుగా చూడకూడదన్న అభిప్రాయాన్ని పదేపదే వెల్లడిస్తున్నారు. కుటుంబ బాంధవ్యాలు మనదగ్గరే ఎక్కువంటూ ఆయన చెప్పడం పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.

పలువురు తమ మనసులో భావాలను, బాధను అధినేతతో పంచుకుంటున్నారు. కొందరికైతే ఆయన కొద్దో గొప్పో నగదు రూపేనా సాయపడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన భారతీయ వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థపై కార్యకర్తలకు వివరణిస్తూ భారతీయ కుటుంబ వ్యవస్థ ప్రపంచానికి ఆదర్శమంటూ విశ్లేషించారు. అటువంటి సాంప్రదాయం తెలుగుదేశంపార్టీలో కొనసాగుతుందని చెప్పడం చంద్రబాబులో 'ఫ్యామిలీ సెంట్‌మెంట్ ' స్పష్టమవుతున్నది.
న్నారు. వారు ఏ ఏ వృత్తుల్లో వున్నారు...వారి చదువులు, ఉద్యోగాలు, అలవాట్లు...ఇంటి వద్ద ఏ విధంగా ఒకరికొకరు సాయపడతారు...అన్నది తెలుసుకొని వారిని అభినందిస్తున్నారు.