April 25, 2013

గెలుపే ముఖ్యం

అనకాపల్లి

అప్పటివరకూ మీ పనులు, వ్యాపకాలను మీ కుటుంబంలో మరొకరికి అప్పజెప్పండంటూ కర్తవ్యబోధ చేశారు. కార్యకర్తలు అనేక ఇబ్బందులు పడ్డారని, కొందరు ఆస్తులు పోగొట్టుకున్నారు మరికొందరు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు అయినా నీతి నిజాయితీలతో బతికారని అదే తెలుగుదేశంపార్టీ క్రమశిక్షణ అని చెప్పారు. రాష్ట్రంలో పరిపాలన అస్తవ్యస్తంగా మారడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

నాయకులు ధృడసంకల్పంతో ఉండాలి తెలుగుదేశంపార్టీ కార్యకర్తల్లో ఎటువంటి తప్పిదం లేదని నాయకులే ఇబ్బంది పెడుతున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. నాయకుడైన వాడు ధృడసంకల్పంతో కార్యకర్తలను క్రమశిక్షణతో నడపాల్సి వుందన్నారు. స్వాతంత్రం వచ్చాక అనేకపార్టీలు పుట్టుకొచ్చి తెరమరుగయ్యాయన్నారు. తెలుగుదేశంపార్టీ మా త్రం 17 సంవత్సరాలు పాలన చేసి, తొమ్మిది సంవత్సరాలు ప్రతిపక్షంలో వున్నప్పటికీ ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కొంటున్నదన్నారు.

జిల్లాలో పటిష్టమైన కుటుంబ వ్యవస్థ విశాఖ జిల్లాలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పటిష్ఠంగా ఉందన్నారు.

ఇక్కడి వారు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు వచ్చినా రెండు, మూడురోజుల్లో సర్దుకొని యథావిధిగా కలిసిపోతారన్నారు. అమెరికా వంటి దేశాల్లో వివాహ వ్యవస్థకు విలువలేదని చెప్పారు. దాడి వీరభద్రరావు కుటుంబంలో 25 మంది ఒకే ఇంట్లో ఉండడం అభినందనీయమన్నారు. టీడీపీ కార్యకర్తలు కూడా ఒకే కుటుంబంగా ఏకతాటిపై నడుచుకోవాలని పిలుపునిచ్చారు.

బెల్టుషాపులతో ఇబ్బందులు మద్యం కారణంగా ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయని ముఖ్యంగా బెల్టుషాపుల వల్ల ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారని బెల్టుషాపులను తొలగిస్తేనే కుటుంబంలో ఇబ్బందులు తొలగిపోతాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

పాదయాత్రకు స్పందన బాగుంది అనకాపల్లి నియోజకవర్గంలో వస్తున్నా మీకోసం పాదయాత్రకు స్పందన బాగుందని, పార్టీ జిల్లా అధ్యక్షుడు రత్నాకర్ ఆధ్వర్యంలో సమర్థవంతంగా నిర్వహించగలిగానని చంద్రబాబు అన్నారు. 19వతేదీన అనకాపల్లి నియోజకవర్గంలో పాదయాత్ర ప్రారంభమై 24వతేదీ వరకూ నిర్విఘ్నంగా కొనసాగిందని అందుకు రత్నాకర్ నాయకత్వ పటిమను కొనియాడారు.

కార్యకర్తలతో మాటామంతి కార్యకర్తలతో కూలంకషంగా మాట్లాడడం వల్ల పార్టీలో వున్న లోటుపాట్లు, సమస్యలు వెలుగులోకి వస్తాయన్నారు. కార్యకర్తల మాటలనుబట్టీ అక్కడ పార్టీ పరిస్థితిని అంచనా వేసుకోవచ్చునని పేర్కొన్నారు. అనంతరం పలువురు కార్యకర్తలతో చంద్రబాబు మాట్లాడి వారి నుంచి సమాచారాన్ని సేకరించారు.
: ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉందని, అప్పటివరకూ నాయకులు, కార్యకర్తలకు సెలవు లేదని, గెలుపే లక్ష్యంగా పనిచేయాలని తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. అనకాపల్లి నియోజకవర్గ కార్యకర్తల సమావేశం బుధవారం శంకరం వద్ద మీ కోసం పాదయాత్ర క్యాంప్ వద్ద జరిగింది. టీడీపీ రూరల్ అధ్యక్షుడు రత్నాకర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ ఏడాది వరకూ ప్రతి నాయకుడు, కార్యకర్త 24 గంటలు పని చేయాల్సిందేనని స్పష్టం చేశారు.