April 7, 2013

నా స్ఫూర్తి, ధైర్యమే నన్ను నడిపిస్తున్నాయి

తుని: నాలో స్ఫూర్తి.. ధైర్యమే న న్ను నడిపిస్తున్నాయి.. ప్రతి మనిషికి కొన్ని శక్తులుంటాయి. వాటిని గుర్తించి వినియోగించుకుంటే అందరూ పైకి వ స్తారు. తెలుగు జాతికి గౌరవం తెచ్చిన పెట్టిన ఎన్టీఆర్, జాతిపిత మహత్మాగాంధీ, ఇలా తమ శక్తులను గుర్తించి వినియోగించుకున్నందునే గొప్ప వారయ్యారు.. నేనూ అంతే..! మారుమూ ల పల్లెలో జన్మించాను ఎమ్మెల్యే కావాలనుకున్నాను... ఆపై మంత్రి... ముఖ్యమంత్రి... ఇలా కొన్ని ఆశయాలను ఏ ర్పరచుకుని పని చేశాను. అన్నింటినీ సాధించాను. అని దేశం అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం ఆయన వస్తున్నా.... మీకోసం పాదయాత్రలో భాగంగా గోపాలపట్నంలో రాత్రి బసవద్ద విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. ఈసందర్భంగా ఓ విద్యార్థి సార్... మీరు చాలా కష్టపడుతున్నారు.

పెద్దవయస్సులో దృఢసంకల్పంతో కొన్ని నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేస్తున్నారు. ఇది మీకే లా సాధ్యపడుతోందని ప్రశ్నించగా త న సంకల్ప బలం గురించి, తాను ఎ లా పైకొచ్చినదీ వివరించారు. అందరి కీ విద్య అవసరమని గుర్తించి పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేశామన్నారు. ఒకప్పుడు భారతదేశానికి పెద్ద గా గుర్తింపు లేని సమయంలోనే హైదరాబాద్‌లో ఐటీ పరిశ్రమలను అభివృ ద్ధి చేసి అందుబాటులోకి తెచ్చానన్నారు. నాటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్‌ను తీసుకువచ్చి రెండు నిమిషా ల్లో డ్రైవింగ్ లైసెన్సు ఇచ్చానన్నారు. ఇదే విషయాన్ని ఆయన తన గవర్నర్లందరికీ చెప్పడంతో అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ ప్రతిష్ట ఇనుమడించిందన్నారు.

మాతృభాష తెలుగు ను అభ్యసించాలని బతుకుదెరువుకు ఆంగ్లాన్నీ నేర్వాలని అలాగని మమ్మీ, డాడీ సంస్కృతికి అంకితమైపోరాదని అంకిత అనే విద్యార్థిని అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. విదేశాల్లో దాచిన నల్ల ధనాన్ని దేశానికి తీసుకువస్తే పేదరికం పోతుందని దీనికి తనవంతు కృషి చేస్తానని మరో విద్యార్థి ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. విద్యావ్యవస్థలో భారీ మార్పులు తెచ్చి అందరికీ చదువు, ఉపాధి కల్పిస్తామన్నారు.