April 7, 2013

విజయం మనదే!

శంఖవరం/ప్రతిపాడు/తుని
: 'కలల సాధనకు కష్టపడాల్సిందే.. ఓట్లు అవే వస్తాయి, అని కూర్చుంటే కష్టాలు తప్పవు. పంచాయతీ, మున్సిపాలిటీ.. అన్ని ఎన్నికల్లోనూ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి.. అపుడే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అందలమెక్కగలం' అని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు ఉద్బోధించా రు. వస్తున్నా మీ కోసం పాదయాత్ర లో భాగంగా ఆయన తూర్పు గోదావ రి జిల్లా కత్తిపూడిలో ప్రత్తిపాడు, రంపచోడవరం అసెంబ్లీ నియోజక వర్గాల కార్యకర్తల సమావేశంలో మాట్లాడా రు.

ప్రతి కార్యకర్త ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పార్టీ ఓటు బ్యాంకుల్ని పక్కనబెట్టి తటస్థ ఓటర్లను రాబట్టగలగాలని చెప్పారు. అన్ని ని యోజకవర్గాల ఓటర్ల మనస్థత్వం ఎన్నికల్లో ఒకేలా ఉంటుంది. అయితే సమర్థవంతమైన కార్యకర్తలు, నాయకులున్న చోటే గెలువగలుగుతామన్నారు. 'నా పాదయా త్ర ఓచరిత్ర, ఎన్నికల్లోపు 294 నియోజక వర్గాల కార్యకర్తలతో సమావేశమై మరోచరిత్ర సృష్టించాలన్నది నా ఆశ' అని చంద్రబాబు చెప్పారు. మీరంతా తెలివైన వారని వేదిక మీద ఉన్నవారికి మంచి అవకాశాలు రావడంతోనే పైకొ చ్చారన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తున్నది పనికి మాలిన అవినీతి, అసమర్థ పాలనని దుయ్యబట్టారు.

గడచి న సహకార ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడినా తల్లి, పిల్ల కాం గ్రెస్‌లు దెబ్బతినడమే ఇందుకు ఉదాహరణ అన్నారు. ప్రతి కార్యకర్త తన నిత్య జీవితంలో భార్య, పిల్లలతో కొంతసేపైనా గడిపి ఎంతగా ఆనందిస్తారో కార్యకర్తలతో మాట్లాడ్డం తనకు అంతే సంతృప్తినిస్తుందన్నారు.

ఒకపుడు తాను హైదరాబాదులో ఉండి చెబితే తక్షణమే స్పందించేవార ని ఇపుడంతా ముదుర్లు అయ్యారని కార్యకర్తలనుద్దేశించి చంద్రబాబు అ న్నారు.

పార్టీలో సభ్యులకు కొదవ లేద ని .. అయితే వారంతా క్రియాశీలంగా వ్యవహరిస్తే విజయాలు అందుకోగలమన్నారు. ప్రత్తిపాడు, రంపచోడవరం లో మంచి కార్యకర్తలున్నారన్నారు. దేశంలో కార్యకర్తలతో పటిష్టంగా ఉన్న పార్టీల్లో టీడీపీకీ సాటివచ్చే పార్టీ మరో టి లేదన్నారు. పెద్దాపురంలో ఇటీవల ఓ నాయకుడు పార్టీని వీడి వెళితే కార్యకర్తలంతా పార్టీలోనే ఉండడాన్ని ఆయ న ప్రశంసించారు. కార్యకర్తల రుణాన్ని ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనన్నారు. తదుపరి ఆయన కార్యకర్తలను మా ట్లాడాలని కోరడంతో రాజవొమ్మంగికి చెందిన గొల్లపూడి పెద్దిరాజు మాట్లాడుతూ పార్టీలో సమన్వయం లోపించిందన్నారు.

తమకు దంతులూరి శివరామచంద్రరాజు తప్ప నియోజక వర్గ ఇన్‌చార్జులెవరూ సహకరించడం లేదని తెలిపారు. పార్టీ కార్యక్రమాలపై ఆయ న రూపొందించిన రికార్డును పరిశీలించిన చంద్రబాబు ఆయన్ను అభినందించారు. కత్తిపూడి సొసైటీ అధ్యక్షుడు గౌ తు నాగు మాట్లాడుతూ శంఖవరం మండలంలో జరిగిన ఉపాధి అవినీతి పౖ ప్రశ్నించినందుకు 36మందిపై నా న్‌బెయిల్‌బుల్ కేసులు పెట్టారని వాపోయారు. రెడ్డి బుల్లబ్బాయి మాట్లాడు తూ తమ గ్రామాలను ఏజెన్సీ ప్రాం తాలుగా ప్రకటించాలని కోరారు. తదుపరి ఆయన మరికొన్ని సమస్యలపై మాట్లాడగా మీ సోదరుడు ఆర్.నారాయణమూర్తిలాగా విప్లవ భావాలున్నాయంటూ చమత్కరించారు.

మరో మ హిళ తన భర్త తాగుడు వ్యసనంపై మాట్లాడగా తాను అధికారంలోకి రా గానే తొలిరోజు రెండో సంతకం బెల్ట్ షాపుల రద్దుపైనే పెడతానన్నారు. ఎమ్మెల్యే పర్వత చిట్టిబాబు, చిన్నం బాబూ రమేష్, నిమ్మకాయల చినరాజప్ప, వాసంశెట్టి సత్యం, శీతంశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

ప్రత్తిపాడు నియోజకవర్గంలోని సబ్‌ప్లాన్ గిరిజన ప్రాంతాన్ని ఏజెన్సీగా గుర్తించడానికి కృషి చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ని యోజకవర్గీయులు కోరారు. నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో మల్లంపేటకు చెందిన టీడీపీ సీనియర్ కార్యకర్త రెడ్డిబుల్లబ్బాయి సబ్‌ప్లాన్ గిరిజనులు ఏజెన్సీ గిరిజనులకు అందుతున్న సౌకర్యాలు అందక ఇబ్బందులు పడుతున్నారని వీరిని షెడ్యూల్డ్ ఏరియా గిరిజనులుగా గుర్తించి సౌకర్యల కల్పనకు కృషి చేయాలని కోరారు.

ప్రత్తిపాడు ని యోజకవర్గంలోని సుబ్బారెడ్డి సాగర్, చంద్రబాబు సాగర్, పోలవరం, పుష్క ర తదితర ప్రాజెక్టులు అభివృద్ధికి నోచక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కొమ్ముల కన్నబాబు, కొప్పన వెంకటేశ్వరరావు, గోళ్ల నాగేశ్వరరావు, రామిశెట్టి మురళీకృష్ణ చంద్రబాబుకు వినతి పత్రాలు అందజేశారు.

సమావేశంలో ఎమ్మెల్యే పర్వత చిట్టిబాబు, పర్వత రా జబాబు, పర్వత సురేష్, టీడీపీ నాయకులు బద్ది రామారావు, సూది బూ రయ్య, పైలా సత్యనారాయణ, పైలా బోసు, యామన సు రేష్, పైలా సాంబశివరావు, మిరియాల శ్రీను, పంచాది వీరబాబు, ఇళ్ల అప్పారావు, దేవకి రాంబాబు, దాట్లకృష్ణ, దాట్ల అప్పన్నబాబు, మదినే బాబ్జిలు పాల్గొన్నారు.