April 19, 2013

రాజకీయాలు నాన్న చూసుకుంటారు

తిరుపతి/రేణిగుంట : రాజకీయాలు నాన్న చూసుకుంటారంటూ చంద్రబాబు తనయుడు
నారా లోకేష్ వ్యాఖ్యానించారు. పీలేరులో హెరిటేజ్ డెయిరీ తరపున పాడి రైతుల సంక్షేమ పథకాలను ప్రారంభించడానికి గురువారం ఆయన వచ్చారు. ఈ సందర్భంగా ఉదయం విమానాశ్రయం వద్ద, సాయంత్రం తిరుపతిలోని హోటల్ వద్ద లోకేష్‌ను పలువురు టీడీపీ నేతలు కలిశారు. ఈ సందర్భంగా పలువురు పార్టీ వ్యవహరాల గురించి మాట్లాడేందుకు ప్రయత్నించినా లోకేష్ ఆ అవకాశం ఇవ్వలేదు. 'నేను డెయిరీ పనిగా వచ్చాను. ఇప్పుడు రాజకీయాలు వద్దు. నాన్న (చంద్రబాబు) పాదయాత్ర కూడా ముగుస్తోంది కదా.

ఇక ఆయన ఫ్రీగా ఉంటారు. ఆయనే చూసుకుంటారు' అని నాయకులకు సర్దిచెప్పారు. ఆయన్ను కలిసిన వారిలో చిత్తూరు ఎంపీ శివప్రసాద్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు జంగాలపల్లె శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు శ్రీధర్‌వర్మ, పార్టీ నాయకులు నరసింహయాదవ్, సూరా సుధాకర్‌రెడ్డి, నీలం బాలాజీ, తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు పుష్పలత, నగర పార్టీ అధ్యక్షుడు దంపూరి భాస్కర్, టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు రవి, టీఎస్ఎన్వీ జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్షులు ఉప్పలపాటి శ్రీనివాసచౌదరి, కోడూరు బాలసుబ్ర హ్మణ్యం తదితరు లు ఉన్నారు. కాగా, ఉదయం 8.40 గం టలకు రేణిగుంట చేరుకున్న లోకేష్.. పీలేరు పర్యటన ముగించుకుని సాయంత్రం మళ్లీ హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణ మయ్యారు.