April 12, 2013

రాజకీయ ఉగాది

రాజమండ్రి: విజయనామ ఉగాదికి ఓ ప్రాధాన్యత ఏర్పడింది. వచ్చేదంతా ఎన్నికల సీజనే కావడంతో ఇది ఓ రాజకీయ ఉగాదిగా ప్రాధాన్యత సంతరించుకుంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఈసారి జిల్లా లో ఉగాది వేడుకలు నిర్వహించి పం చాంగ శ్రవణం చేయించుకున్నారు. ఇక పార్టీ నేతలు వేర్వేరుగా తమ జాతకాలు చూపించుకున్నారు. జ్యోతిష్య పండితులు తయారు చేసిన పంచాంగాలు చదువుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చారు. పంచాయతీ, ఎంపీటీసీలు, మండల పరిషత్, జెడ్పీటీసీలు, జడ్పీ, మున్సిపాల్టీల ఎన్నికలు ఈఏడాది ప్రా రంభం కావచ్చనే సంకేతాలు అందుతున్న సంగతి తెలిసిందే. దీంతోపాటు వచ్చేడి ఏడాది అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు కూడా జరగనున్నాయి.

కొందరైతే ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం కూడా మొదలెట్టారు. దీంతో ఆయా పదవులు ఆశిస్తున్న రాజకీయనేతలంతా తమ నక్షత్ర, జాతకబలాలు చూసు
కుని రకరకాల అంచనాలు వేసుకుంటున్నారు. అవమానాలు, గౌరవాలు, ఆదాయా లు, వ్యయాల అంచనాలు తెలుసుకోవడంతో పాటు తమ భవష్యత్ కోసం తహతహలాడుతున్నారు.సుమారుగా ఆదివారం నుండి ఇదే పరిస్థితి. అందరిలోనూ ఒకవిధమైన ఆనందం.. జా తక బలంలో తమకు రాజకీయయో గం వుందని, అందువల్ల వచ్చే ఎన్నికలలో ఏదో పదవి లభిస్తుందనే మనోబలంతో చాలామంది నేతలు జ్యోతిష్య పండితులను ఆశ్రయిస్తున్నారు. ము ఖ్యంగా విజయనామ ఉగాది ఖచ్చితంగా తమ జీవితాలలో విజయాలు తెస్తుందని భావిస్తున్నారు. ఎమ్మెల్యే పదవులు ఆశించేవాళ్లూ, ఇతర రాజకీయపార్టీలు ఆశించే వాళ్లు కూడా ఇదే ఆనందంతో ఉన్నారు. అంతేకాక ప్రత్యుర్థుల జాతకాలు తెసుసుకోవడానికి కూడా ఎక్కువ సమయమే కేటాయిస్తున్నారు. మొత్తానికి నేతలంతా ఈ ఉగాదిని రాజకీయ ఉగాది చేసేశారు.