April 12, 2013

ఈ ఒక్క పండగే కాదు.. ఈ ఏడాది తెలుగు వారి ప్రధాన పండగలు అన్నిటినీ ప్రజల మధ్యే చేసుకున్నాను

ఉగాది పండగను గురువారం ప్రజల మధ్యే చేసుకున్నాను. ఈ ఒక్క పండగే కాదు.. ఈ ఏడాది తెలుగు వారి ప్రధాన పండగలు అన్నిటినీ ప్రజల మధ్యే చేసుకున్నాను. దసరా, దీపావళి, సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్.. ఇలా ప్రతి పండగను పేదలతోనే పంచుకున్నాను. ఏడాదంతా కష్టపడే శ్రమజీవులు కనీసం ఒక్క రోజైనా సంతోషంగా గడపాలన్న ఉద్దేశంతోనే మన పెద్దలు పండగలను పెట్టారు. కానీ, ఇప్పుడు ఒక్క రోజు పండగ చేసుకునే పరిస్థితిలో కూడా ఆ కష్టజీవులు లేరు. పెరిగిన ధరలు.. పెరగని ఆదాయాలు.. చితికిపోయిన కుటుంబాలు.. ఇదీ ప్రజల పరిస్థితి! ఉగాది పచ్చడిలో తీపి ఉంటుంది.

కానీ, ప్రజలు తమ రోజువారీ జీవితాల్లో తీపి తప్ప మిగిలిన రుచులన్నిటినీ చవిచూస్తున్నారు. నిత్యావసరాల పేరు చెప్పగానే చేదు.. కూరగాయల పేరు వినగానే వగరు వారికి గుర్తుకొస్తోంది. బియ్యం ధర వినగానే పులుపు పలకమారుతోంది. ఇక, పండగకి కొత్త బట్టలు కొనుక్కోవడం, సరదాగా ఓ సినిమాకో షి

ఈ రోజు నా యాత్రంతా తాండవ నది పరీవాహక ప్రాంతంలో సాగింది. నదీ పరీవాహక ప్రాంతంలో ఉండి కూడా ఈ గ్రామాలను మంచినీటి కరువు వెంటాడుతోంది. నదిపై ఒక్క లిఫ్ట్ ఏర్పాటు చేస్తే, చుట్టుపక్కల గ్రామాలు అన్నిటిలో జల కళ సంతరించుకుంటుంది. ప్రభుత్వం వద్ద ఈ ప్రతిపాదన పెండింగ్‌లో ఉంది. కానీ, దానికి మోక్షం ఎప్పుడన్నది అర్థం కావడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలోని శెట్టిబలిజ సోదరులు కొంతమంది ఈరోజు నన్ను కలిశారు. సామాజిక న్యాయాన్ని తూచా తప్పకుండా అమలు చేసే పార్టీ తెలుగుదేశమేనని, ఆ నమ్మకం తమకు ఉందని, పార్టీలో తమకు సముచిత స్థానం ఇవ్వాలని కోరారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయను.
కారుకో వెళ్లడం వంటివన్నీ ఉప్పగా మారిపోయాయి. దీంతో, పేదల బతుకంతా కారం కారంగానే మారిపోయింది. కనీసం ఈ ఉగాది నుంచి అయినా వారి జీవితాల్లో కొత్త చివుళ్లు తొడగాలని ఆశిస్తున్నా.