May 25, 2013

అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధం : చంద్రబాబు


హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టేందుకు తాము సిద్ధమని టీడీపీ చీఫ్‌ చంద్రబాబు తెలిపారు. కమ్యూనిస్టులతో పొత్తుకు సిద్ధమని ఆయన పేర్కొన్నారు.ముందుగానే అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని ఆయన చెప్పారు. 2014 ఎన్నికల పొత్తులు, సీట్ల కేటాయింపులో స్పష్టత ఉందని ఆయన అన్నారు. తెలంగాణపై టీడీపీ లేఖ చూసే టీఆర్‌ఎస్‌ పొత్తు పెట్టుకుందన్నారు. తెలంగాణపై గతంలో ఇచ్చిన లేఖకు తాము కట్టుబడి ఉన్నామని బాబు తెలిపారు. టీఆర్‌ఎస్‌ విమర్శలను మా నేతలు రాజకీయ కోణంలో చూడాలన్నారు. హైదరాబాద్‌లో పోటీ చేయలేని టీఆర్‌ఎస్‌ వంద సీట్లు ఎలా గెలుస్తుందని బాబు ప్రశ్నించారు. పార్టీ నుంచి వెళ్లిన వారంతా డెడ్‌వుడ్‌ వంటి వారని ఆయన అన్నారు. ఎన్టీఆర్‌పై ఉన్న గౌరవంతో పార్లమెంట్‌లో విగ్రహావిష్కరణపై సర్దుకపోయామని ఆయన చెప్పారు. పశువులకు ఉన్న కృతజ్ఞత కూడా జంప్‌ జిలానీలకు లేదన్నారు. వాళ్ల ఇంట్లో కష్టాలు ఉంటే గోడ దూకేస్తారా అని ఆయన ప్రశ్నించారు. తోక పార్టీలు అవిశ్వాసం పెడితే, వాటి వెనుక తామెళ్లమని ఆయన స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత అమరవీరుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తామని ఆయన తెలిపారు.