April 9, 2013

కరెంటు కోతలపై ఎమ్మెల్యే కేశవ్ ఆగ్రహం


కూడేరు: కరెంటు కోతలతో ఎండిపోతున్న పంటలు, రైతులు పడుతున్న ఇబ్బందులను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు ఉరవకొండ ఎమ్మె ల్యే పయ్యావుల కేశవ్ పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. సోమవారం రాత్రి కూడేరుకు చెందిన రైతు శ్రీధర్ తోటలో ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీధర్ చౌదరి, ప్రచార కార్యదర్శి బీవీ వెంకటరాముడు,, సింగిల్ విండో అధ్యక్షుడు గుడిపూటి సురేష్, రైతులు పల్లె నిద్ర లో పాల్గొన్నారు. కరెంటు కోతలతో తాము పడుతున్న కష్టాలను రైతులు శ్రీధర్, బాట వెంకటేశులు, ఎమ్మెల్యేకు వివరించారు. కరెంటు ఎప్పుడోస్తుందో ఎప్పుడు పోతుందో అర్థంకాని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తంచేశారు. కరెంటు సక్రమంగా లేక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన చెందా రు. జనరేటర్‌తో నీరు పెట్టుకుంటున్నామనీ, ఇందుకు రోజుకు రూ.రెండు వేలు ఖర్చు వస్తుందన్నారు.

అనంతరం ఎమ్మెల్యే కేశవ్ విలేకర్లతో మా ట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాలకు 3 గంటల కరెంటు వదలడం లేదన్నారు. కరెంటు రాక పంటలు తొలి దశలోనే ఎండిపోతుంటే ముఖ్యమంత్రి, మంత్రులు పంటలు ఎండలేదని చెబుతున్నారనీ, క్షేత్రస్థాయిలో పర్యటిస్తే సమస్యలు తెలుస్తాయన్నారు. సీఎం, మంత్రులు రావాలని సవాల్ విసిరారు. పంటల కాపాడుకోవడానికి రైతులు నానా అవస్థలు పడుతుంటే ఎక్కడ పంటలు ఎండిపోలేదని మంత్రి పోన్నాల లక్ష్మయ్య చెప్పడం దారుణమని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆవేదన వ్యక్తం చేశారు. కరెంటు సక్రమంగా ఇవ్వలేని ఈ ప్రభుత్వం తక్షణం దిగిపోవాల్సిందేనన్నారు. రైతుల సమస్యలు తెలుసుకోవడానికి స్వయంగా పల్లె నిద్రలో రైతులతో మాట్లాడుతూ.. కష్టాల గూర్చి తెలుసుకొని ముఖ్యమంత్రి మంత్రుల భరతం పడుతానన్నారు. రాత్రికి తోటలోనే బసచేసి కరెంటు ఎప్పుడొస్తుంది? ఎప్పుడు పోతుందని స్వయంగా తెలుసుకునేందుకు వచ్చానన్నారు. తోటలో కరెంటు లేని సమయంలో పంటకు నీరు పెట్టడానికి జనరేటర్, మోటర్ పంపులు వినియోగిస్తున్నారన్నారు.

ఎండిన పంటను చూసి చలించిన ఎమ్మెల్యే కేశవ్... వేరుశనగ, వరి పంటలు విద్యుత్ కోతతో ఎండిపోయిన ప్రదేశాలను చూసిన ఎమ్మెల్యే చలించిపోయారు. ప్రభుత్వం విద్యుత్ సక్రమంగా సరఫరా చేయక రైతులను అప్పుల ఊబిలోకి నెట్టిందని విమర్శించారు. క్షేత్రస్థాయిలో రైతులతో విద్యుత్ గూర్చి తోటల్లో పరిశీలిస్తే ఎండిన పంటలు, జనరేటర్లు కనిపిస్తున్నాయన్నారు. కార్యక్రమంలో వారితోపాటు కూచె నాగరాజు, మురళి, విజయభాస్కర్ గౌడ్, కన్వీనర్ దేవేంద్ర, శివయ్య, ఎస్పీ వెంకటనాయుడు, అంకె ఎర్రిస్వామి, సింగిల్ విండో సభ్యులు బాషా, బొమ్మయ్య, ఈశ్వరయ్య, ఆదెన్న, ఓబులేసు, కుసాల నాగరాజు, పరంధామ, నారాయణ, అక్కులప్ప, ఇప్పేరు శివ, శివశంకర్ నాయుడు, మలోబులు, జయప్రకాష్, రాఘవ, వెంకటనాయుడు, ఎర్రిస్వామి పాల్గొన్నారు.