April 9, 2013

బంద్‌ను జయప్రదం చేయండి

అనంతపురం అర్బన్: విద్యుత్ చా ర్జీల పెంపు, కోతలను నిరసిస్తూ మం గళవారం నిర్వహించ తలపెట్టిన జిల్లాబంద్‌ను జయప్రదం చేయాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, పెనుకొండ ఎమ్మెల్యే బీకే పార్థసారథి పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విద్యుత్‌రంగం తీవ్ర సంక్షోభానికి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిలే కారణమన్నారు. చంద్రబాబునాయుడు హయాంలో ప్రత్యేక సంస్కరణలు చేపట్టి అభివృద్ధి చేశారన్నారు. వాటిని కాంగ్రెస్ నాయకులు భూస్థాపితం చేశారని ఆరోపించారు. 2004లో రాష్ట్రంలో విద్యుత్ మిగులులో ఉండేదన్నారు. ఇపుడు ఆ పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాలు సెంట్రల్ డిస్కౌంట్లతో రూ.1.80పైసలకు కొంటుంటే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం రూ.12కు కొంటున్నాదన్నారు. ఆ భారాన్ని ప్రజలనెత్తిన వేసి, దోపిడీ చేస్తున్నారన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ విషయంలో పూర్తిగా విఫలమైందన్నా రు. వీటిని నిరసిస్తూ టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టిందన్నారు. వామపక్షాలు చేపట్టిన రాష్ట్రబంద్‌కు టీ డీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించిందన్నారు. టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు, అన్ని వర్గాల ప్రజలు పాల్గొని, బంద్ ను విజయవంతం చేసి, ప్రభుత్వం క ళ్లు తెరిపించాలని పిలుపునిచ్చారు. స మావేశంలో అనంతపురం నియోజకవర్గ ఇన్‌చార్జ్ మహాలక్ష్మిశ్రీనివాస్, నగ ర అధ్యక్షుడు కృష్ణకుమార్, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు కందిగోపుల మురళీప్రసాద్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి సరిపూటి రమణ పాల్గొన్నారు.