April 9, 2013

ప్రజల కోసం పాటుపడతా

( విజయవాడ) 'ప్రజా సేవ చేయాలన్నదే నా అభిలాష.. అందుకే క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చా.. నన్ను ఆశీర్వదించండి. తెలుగుదేశం పార్టీకి అత్యంత క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు ఉన్నారు. వారితో కలిసి.. నాన్నగారి ఆశయాల సాధన కోసం, ప్రజల సంక్షేమం కోసం పాటు పడతా.. రాష్ట్రాభివృద్ధికి అవరోధంగా ఉన్న నిరుద్యోగ సమస్యను అధిగమించి, దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు నా 'విజన్'ను అమలు చేస్తా.. అని నందమూరి బాలకృష్ణ అన్నారు. ఆదివారం మండుటెండలో, ఓపెన్ టాప్ జీపుపైనే రోజంతా జిల్లాలో రోడ్ షో నిర్వహించిన బాలయ్యను చూసేందుకు జనం ఎగబడ్డారు. మహిళలు బ్రహ్మరథం పట్టారు. ఓవరాల్‌గా బాలయ్య రోడ్ షో అదుర్స్ అనిపించింది.

జిల్లాలో తెలుగుదేశం పార్టీకి బాలకృష్ణ బూస్ట్ నిచ్చారు. ఎన్టీఆర్‌ను కీర్తిస్తూ, చంద్రబాబును స్థుతిస్తూ.. నాటి నందమూరి తారక 'రామ'రాజ్య పాలనను.. నేటి కాంగ్రెస్ పార్టీ పాలనతో బేరీజు వేస్తూ ప్రసంగాలు చేశారు. తిరువూరు నియోజకవర్గంలో ఆదివారం 85 కిలోమీటర్లకు పైగా రోడ్డు షో నిర్వహించిన బాలయ్య మొత్తం 10 చోట్ల ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరించారు. విజయవాడలోని తాజ్ గేట్‌వే హోటల్ నుంచి ఓపెన్ టాప్ జీపుపై ర్యాలీగా బయలుదేరిన బాలయ్య విస్సన్నపేటలో రోడ్డు షో నిర్వహించారు. మండుటెండలో.. చెమటలు కక్కుతున్నా.. ఆయాసం తోడైనా రోజంతా పర్యటన జరిపారు. బాలయ్య పర్యటనకు అభిమాన

గేట్‌వే హోటల్ నుంచి ఓపెన్ టాప్ జీపులో కేశినేని నాని, దేవినేని ఉమామహేశ్వరరావు తదితరులతో కలిసి బయలు దేరిన బాలయ్య నున్న, సూరంపల్లి, అడవి నెక్కలం, ఆగిరిపల్లి, నూజివీడు, విస్సన్నపేట తదితర ప్రాంతాల్లో రోడ్ షో నిర్వహించారు. విస్సన్నపేట మండలం కలగర గ్రామంలో మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి, మండే ఎండలో ఓపెన్ టాప్ జీపుపై నిలబడి ప్రసం గం చేయటం ప్రజలను ఆకట్టుకుంది.చంద్రబాబును పొగుడుతూ ...చంద్రబాబును గొప్ప పరిపాలనా దక్షుడని బాలకృష్ణ అభివర్ణించారు. బాబు పాలనలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేదలలో చక్కటి మార్పు ను తీసుకు వచ్చాయన్నారు. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా చంద్ర బాబు చేస్తున్న కృషిని కొనియాడారు.

కాంగ్రెస్‌పై చండ్ర నిప్పులు కాంగ్రెస్ పార్టీపై బాలయ్య చండ్ర నిప్పులు కురిపించారు. టీడీపీ పాలన ఎలా ఉందో ప్రజలకు వివరిస్తూ... కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అంధకారప్రదేశ్‌గా మారిపోయిందన్నారు. అవినీతి ప్రదేశ్, అధికధరల ప్రదేశ్‌గా మారిపోయిందని ధ్వజమెత్తారు. నూజివీడులో మామిడి పరిశోధనా కేంద్రానికి తాళాలు వేసి ఉండటాన్ని చూసి.. ప్రభుత్వ తీరును ఎండగట్టారు. మామిడి కొనుగోళ్ళ వ్యవహారంలో ఢిల్లీ సేట్‌ల గుప్పిట్లో ప్రభుత్వం నడుస్తున్న తీరును విమర్శించారు. లంచం కొట్టనిదే ఏ పనీ జరగదన్నారు. చెరువులలో నీళ్ళే కరువయ్యాయని చెప్పారు. ఇందిర జల ప్రభ కాస్తా.. వ్యర్థ ప్రభగా మారిపోయిందన్నారు. మైనారిటీల సంక్షేమం పడకేసిందన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన తప్పిదాల వల్లనే రాష్ట్ర ప్రజలు కరెంటు కోతలతో అల్లాడిపోతున్నారని ధ్వజమెత్తారు.

రాష్ట్రాభివృద్ధికి బాలయ్య విజన్ : రాష్ట్రాభివృద్ధికి బాలయ్య తన విజన్ ఏమిటో తెలిపారు. ప్రజాసేవే లక్ష్యంగా ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చానని చెబుతూనే.. రాష్ట్రాభివృద్ధికి తన విజన్ ఏమిటో చెప్పారు. యువత నిరుద్యోగంతో కొట్టు మిట్టాడుతుండటంవల్లనే ఈ గతి పట్టిందని, ఇలాం టి యువతకు చిన్న పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు పెట్టుకోవటానికి మైక్రో ఫైనాన్స్ రుణాలు, విద్యుత్ సబ్సిడీలు కల్పిస్తామని చెప్పారు. నిరుద్యోగులను కార్యోన్ముఖులను చేసేలా ఓ విప్లవం తీసుకు వచ్చి రాష్ట్రాన్ని దేశంలోనే సగర్వంగా నిలబెట్టేందుకు శక్తివంచనలేకుండా కృషిచేస్తానన్నారు.
సంద్రంతో పాటు, పల్లెల నుంచి జనం కదిలి వచ్చారు. బాలయ్య వచ్చాడంటూ మహిళలు ఆనందంతో.. బహిరంగ సభలకు పరుగు, పరుగున వచ్చారు. మొత్తంమీద జిల్లా పార్టీ నాయకుల్లో బాలకృష్ణ ఒక రోజు పర్యటన సరికొత్త ఉత్సాహాన్ని నింపింది.