April 9, 2013

కొనసాగుతున్న టీడీపీ సంతకాల సేకరణ

నల్లగొండ టౌన్ : పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఆధ్వర్యంలో చేపట్టిన సంతకాల సేకరణ పట్టణంలో కొనసాగుతూనే ఉంది. సోమవారం మిర్యాలగూడ రోడ్డులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ విద్యుత్ కోతలతో వ్యవసాయం, పారిశ్రామిక, చేనేత రంగాలు సంక్షోభానికి గురవుతున్నాయన్నారు.

ప్రభుత్వ నిర్లక్ష్యంతో విద్యుత్ ఉత్పత్తి చేయకపోవడం వల్ల అనేక గ్రామాల లో నీటి సదుపాయం ఉన్నప్పటికీ సరై న సమయానికి కరెంట్ రాక పంటలు ఎండిపోయి చేసిన అప్పులు తీర్చలేమన్నా బాధతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. ఇప్పటికైన ప్రభుత్వం 9గంటల నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయాలన్నారు.

కార్యక్రమంలో జిల్లా ప్రధానకార్యదర్శి బోయపల్లి కృష్ణారెడ్డి, బొర్ర సుధాకర్, ఎల్‌వీ యాదవ్, కంచనపల్లి రవీందర్‌రావు, ఈరటి బాలరాజు, కంచి మధుసూదన్, కౌకూరి వీరచారి, గుండు వెంకటేశ్వర్లు, ఎంఏ రషీద్, ఎండీ సయ్యద్, మేడి సురేందర్, పోలే జయకుమార్, తొలకొప్పుల గిరి, అయితరాజు మల్లేష్, పోలే వెంకట్, నల్లగొండ అశోక్, టి.సత్యం పాల్గొన్నారు.