April 9, 2013

కాంగ్రెస్ వైఖరితోనే విద్యుత్ సమస్యలు

చిన్నకోడూరు: రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న విద్యుత్ సంక్షోభానికి కాంగ్రెస్ ప్రభుత్వాల వైఖరే కారణమని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మండిపడ్డారు. సోమవారం చిన్నకోడూరు మండలం చంద్లాపూర్, విఠలాపూర్ గ్రామాల్లో పల్లెపల్లెకు టీడీపీ కార్యక్రమంలో భాగంగా ఆయా గ్రామాల్లో పార్టీ జెండాలను ఆ విష్కరించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విద్యుత్ సమస్య తీవ్రరూపం దాల్చినా పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్య లు చేపట్టలేదన్నారు.

ప్రజలపై విద్యుత్ రూపంలో రూ.32 వేల కోట్ల భారం మోపిందన్నారు. అది చాలదన్నట్టు స ర్‌చార్జీల పేరిట రూ.6.5 వేల కోట్ల భా రాన్ని ప్రజల నెత్తిమీద మోపిందన్నా రు. ఈ విషయమై ప్రతిపక్షాలు గగ్గోలు పెడితే వేల కోట్ల భారాన్ని వందల కో ట్ల రూపాయలకు తగ్గించడం ప్రజలను మోసం చేయడమేనన్నారు. రైతులకు 7 గంటల పాటు నిరంతరాయంగా వి ద్యుత్ సరఫరా చేస్తానన్న ప్రభుత్వం 3 గంటలు కూడా ఇవ్వడం లేదన్నారు. నేడు పరిశ్రమల్లో పనిచేస్తున్న లక్షలాది మంది కార్మికుల జీవితాలు రోడ్డున ప డ్డాయన్నారు.

చిన్నచిన్న పరిశ్రమలు మూత పడ్డాయన్నారు. ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్రాన్ని పాలిం చే నైతిక హక్కు లేదన్నారు. విద్యుత్ కోతలతో పరీక్షల సమయంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారన్నారు. వెంటనే ప్రభుత్వం విద్యుత్ స మస్య పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నేటి బంద్ కు టీడీపీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందన్నారు. బంద్‌ను పార్టీ కార్యకర్త లు విజయవంతం చేయాలన్నారు. చి రంజీవి చంద్రబాబుపై చేసిన వ్యాఖ్య లు అర్ధరహితమన్నారు. చిరంజీవి పదవీకాంక్షతో ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఎ మ్మెల్యే, ఎంపీల టిక్కెట్లు అమ్ముకొన్న ఘనత ఆయనకే దక్కిందన్నారు.

తీరా డబ్బులు చేతికి వచ్చాక పీఆర్‌పీని కాంగ్రెస్‌లో విలీనం చేసి కేంద్ర మంత్రి పదవి పొందారని విమర్శించారు. ఇపు డు కాంగ్రెస్ అధిష్టానం మెప్పు కోసం చంద్రబాబును విమర్శించడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో రాష్ట్రం చాలా అభివృద్ధి చెందిందన్నారు. చంద్రబాబు చేస్తున్న పాదయాత్రకు ప్రజలు నీరాజనాలు పడుతున్నారన్నారు. ఇది చూసి ఓర్వలేకనే అవాకులు చెవాకులు పేలుతున్నారన్నారు. చిరంజీవి నోరు అదుపులో పెట్టుకుని ప్రవర్తించాలన్నారు. ఎన్టీఆర్ అందరివాడే కాని కాంగ్రెస్, వైసీపీ పార్టీలకు చెందిన వాడు మాత్రం కాదన్నారు. ఎ న్టీఆర్ పేదలకోసం ఎన్నో పథకాలు ప్ర వేశపెట్టి ఆదుకున్నారన్నారు. కొందరు స్వార్థ పరులైన కాంగ్రెస్ నాయకులు ఎన్టీఆర్‌ను తమవాడేనని చెప్పుకుని ప బ్బం గడుపుతున్నారన్నారు. వేరే పార్టీలకు చెందిన నాయకులు కొందరు ఎ న్టీఆర్ పేరు చెబితేగాని గెలువలేని పరిస్థితి ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో సిద్దిపేట నియోజకవర్గ టీడీపీ సమన్వయ కర్తలు కోమండ్ల రామచంద్రారెడ్డి, గుండు భూపేశ్, తె లుగు రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కా ర్యదర్శి నర్ర జయపాల్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మొసర్ల మధుసూదన్‌రెడ్డి, తెలుగు యువత మండల అధ్యక్షుడు తిరుమల మారుతి, నాయకులు ఆరె రాజెల్లం, చెలికాని మల్లేశం, శ్రీనివాస్, రవికాంత్, చంద్రం, భారత్, కొ ట్టాల రాంరెడ్డి, దేవిరెడ్డి, శంకర్, స త్యం, గుడుమల్ల సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.