April 9, 2013

విద్యుత్ చార్జీలు తగ్గించే వరకూ ఆందోళన

నరసన్నపేట:విద్యుత్‌చార్జీలు తగ్గిం చే వరకూ టీడీపీ నిరసనగా పోరా టం చేస్తుందని ఆ పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి కింజరాపు రామ్మోహన్‌నాయుడు స్పష్టంచేశారు. సోమవారం నరసన్నపేట ప్రజాసదన్‌లో విలేఖరులతో మాట్లాడుతూ వి ద్యుత్‌చార్జీల విషయంలో ప్రజలకు అండగా టీడీపీ ధర్నాలు,సంతకాలు సేకరణ చేసి గవర్నర్‌కు నివేదిస్తుందన్నారు.

ప్రజలపై ఆరు వేల కోట్లు భా రం మోపి కంటితూడుపుగా 200 యూనిట్లు లోపల వినియోగించేవారిపై భారం తగ్గించినట్లు చెప్పి కేవలం రూ.800కోట్లు మాత్రం తగ్గించారని ఆరోపించారు.ప్రతి కార్యకర్త ఇంటింటికి వెళ్లి సంతకాలు సేకరించాలన్నారు.మంగళవారం నిర్వహించే బంద్‌కు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జామి కామేశ్వరరావు,బలగ నాగేశ్వరరావు,పొట్నూరు జగన్,గొద్దు చిట్టిబాబు,చింతు పాపారావు,బెవర రాము,చలపాక మల్లేషు,లక్కోజి క్రిష్ణ,బైరి భాస్కరరావు,పీస కృష్ణ పాల్గొన్నారు.