March 8, 2013

నేనే వస్తా...పూర్వ వైభవం తెస్తా!

మండవల్లి : తనకు పదవుల్లో కూర్చోవలన్నా కోర్కెలేవి లేవని, సేవచేయాలన్న దృక్పథంతోనే మీ ముందుకు వచ్చానని. తాను అధికారంలోకి వస్తే మీ బాధలు తీరుస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు కొల్లేటి ప్రజలకు భరోసా ఇచ్చారు. చంద్రబాబు చేపట్టిన పాదయాత్ర శుక్రవారం మండవల్లి మండలం చావలిపాడు, లోకుమూడి గ్రామాల మీదుగా కైకలూరు మండలంలోకి సాగింది. ప్రపంచ మహిళా దినోత్సవంలో పాల్గొన్న వేలాది మహిళలు చంద్రబాబుతో పాటు పాదయాత్రంలో పాల్గొనడంతో కత్తిపూడి-పామర్రు జాతీయ రహదారిపై మహిళలతో పొటెత్తింది. చావలిపాడు, లోకుమూడిల్లో ప్రజలు పూలతో, హారుతులతో అపూర్వ స్వాగతం పలికారు. వృద్దులను, వికలాంగులను, చిరువ్యాపారులను, వ్యవసాయ కూలీలను, చేతివృత్తివారిని చంద్రబాబు పలకరిస్తూ ముందుకుసాగారు. మిమ్మల్ని ముఖ్యమంత్రిగా మళ్ళీ చేస్తాం. మా కష్టాలు మీరే తీర్చాలి అంటూ పలువురు చంద్రబాబుతో అన్నారు.

కాంగ్రెస్ చేస్తున్న దారుణాలను చూడలేక, అవినీ రాజకీయాలను ప్రజలకు వివరించేందుకు మీముందుకు వచ్చానన్నారు. సేవదృక్పదమైన ప్రభుత్వాన్ని ఎంపికచేసుకోవాలని,అవినీతి పరులను తమిరికొట్టలని చంద్రబాబు కోరారు. మీ పిల్లలు చక్కటి చదువులు సాగాలన్న, ఉద్యోగాలు రావాలన్న టీడీపీ వల్లే సాధ్యమని స్పష్టం చేశారు. చిన్నారులకు బాబు ముద్దులు కైకలూరు రూరల్ : అడుగడుగునా బాబుకు మహిళలు మంగళహారతులు పట్టారు. దారిలో శ్యామలాంబ దేవాలయాన్ని దర్శించుకునేందుకు వేద పండితులు స్వాగతం పలికారు. దారిలో పసిపిల్లలను, చిన్నపిల్లలను ఎత్తుకుని ముద్దాడారు. బామ్ము చేసిన లడ్డూను రుచిచూశారు.

దర్జీని పలకరించి మిషన్ కుట్టారు. వ్యవసాయ కూలీలను పలకరించి వారి కష్టసుఖాలనుతెలుసుకున్నారు. షెడ్డు వద్దకు వెళ్ళి మోటార్ సైకిల్‌ను రిపేర్ చేశారు. మార్గం మధ్యలో అభిమానులు గజమాలతో చంద్రబాబును సత్కరించారు. మరోచోట కూరగాయల దండను వేశారు. భారీ సైజులో ఉన్న డప్పును కొడుతూ వినోదాన్ని పంచారు. దారిలోని మాగంటి బాబు ఇంటి వద్ద తేనీరు తాగారు. కైకలూరు నుంచి ఆటపాక, గోనేపాడు, శింగాపురం, వదర్లపాడు బ్రాంచ్, భుజబలపట్నం, పల్లెవాడ మీదుగా ఆలపాడు బసకు చేరుకున్నారు.