March 8, 2013

మహిళా దినోత్సవ సదస్సులో జగన్ అక్రమాస్తుల చిట్టాపై ప్ల కార్డు

మండవల్లి : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మండవల్లి మండలం చావలిపాడులో శుక్రవారం జరిగిన రాష్ట్రస్ధాయి మహిళా దినోత్సవ వేడుకల సభలో మహిళల హక్కుల సాధన, మహిళలకు జరుగుతన్న అన్యాయాలపై ప్ల కార్డులు ఏర్పాటుచేశారు. అందులో భాగంగా వైసీపీ అధ్యక్షుడు జగన్ అక్రమాస్తులపై ఏర్పాటుచేసిన ప్ల కార్డు విశేషంగా ఆకర్షించింది. తొలుత టీడీపీ తెలుగు మహిళ సభ కావటం, అందులోనూ సభకు పార్టీ అధినేత చంద్రబాబు పాల్గొనే సభాప్రాంగణంలో జగన్ ఫొటోతో ఫ్లెక్సీ ప్రత్యక్షమవటం చర్చనీంశంగా మారింది. సభా ప్రాంగణంలో ప్రవేశించిన ప్రతిఒక్కరూ జగన్ ప్లకార్డు ఫ్లెక్సీ వద్ద క్షణం నిలబడి ఆసక్తిగా పరిశీలించారు. ఈ ప్ల కార్డులో ఏముందంటే జగన్ అక్రమాస్తుల వివరాలు అంటూ ఇల్లు, పరిశ్రమల, విలాసవంతమైన భవనాలతో కూడిన చిత్రాలను ప్రదర్శించారు. వీటిని అమ్మితేనే మహిళ లక్షాధికారులయ్యేది అంటూ పేర్కొన్నారు. అలాగే ఈసభా ప్రాంగణంలో తలదించుకుంటున్నాం.. తల్లీ అనే ప్ల కార్డును కూడా ఏర్పాటు చేశారు. ఢిల్లీ సంఘటనపై ఉదహరిస్తూ ప్రభుత్వ వైఫల్యాన్ని తప్పు పట్టుతూ ప్లకార్డు ఏర్పాటుచేశారు.