January 8, 2013

రాష్ట్రంలో రాంబదుల పాలన



 
రాష్ట్రంలో రాంబదుల పాలన కొనసాగుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. నర్సింహులపేట మండల కేంద్రానికి సోమవారం పాదయాత్ర చేరుకుంటు న్న సమయంలో డప్పు చప్పుళ్లు, నృ త్యాలు, మంగళహారతులు, బోనాలతో పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజ లు ఘన స్వాగతం పలికారు. కూడలి లో ఏర్పాటు చేసిన సమావేశంలో తొలుత రైతులు, యువకులు, మహిళలకు చంద్రబాబు మైకు ఇచ్చి సమస్యల ను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ రాబందులు అధికారం చేపట్టినప్పటి నుంచి ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలో అవినీతి, కుంభకోణాలు పెరిగిపోయాయని అన్నారు.

కొంతమంది దోచుకోవ డం, దాచుకోవడం పనిగా పెట్టుకున్నారన్నారు. ప్రభుత్వ పథకాలైన ఈజీఎ స్, ఇందిరమ్మ గృహాలు, ఇన్‌పుట్‌సబ్సిడీలో కాంగ్రెస్ నాయకులు రాబందు ల్లా, అడవి పందుల్లా,రాక్షసులుగా మా రి ప్రజల ఎంగిలి మెతుకుల డబ్బులను దోచుకుతిన్నారన్నారు. వైఎస్ అధికా రం చేపట్టినప్పటి నుంచి ఆయనతోపా టు బంధు వర్గానికి దోచిపెట్టాడన్నారు.

తొమ్మిదేళ్ల టీడీపీ పాలనలో క్రమశిక్షణతో ఆర్థిక వ్యవస్థను చక్కపెట్టి అనేక సంస్కరణ కార్యక్రమాలు కొనసాగిస్తే వాటిని పూర్తిగా నీరుగార్చారన్నారు. నే డు రాష్ట్రంలో కాంగ్రెస్, వైసీపీ, టీఆర్ఎ స్ నాయకులకు ప్రజల సమస్యలు పట్ట డం లేదన్నారు. కేవలం ఆర్థిక ప్రయోజనాలే ముఖ్యంగా పని చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని దొచుకున్న డబ్బుతో వై సీపీ నేత జగన్ ఎమ్మెల్యేలను సంతలో ని పశువుల్లాగా డబ్బులు కుమ్మరించి కోనే దుస్థితికి నెలకుందన్నారు. రాష్ట్రం లో ఇంతటి అసమర్థ సీఎంను ఎప్పు డు చూడలేదన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక నిరుద్యోగ యువతీ, యు వకులకు ఉద్యోగం, ఉపాధి లేదా విద్యార్హతను బట్టి భృతి చెల్లించడం జరుగుతుందన్నారు. యువతకు ఉపాధికల్పించి అన్నగా అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. గిరిజనుల సంక్షేమాని కి ప్రత్యేక బడ్జెట్ కేటాయించడంతోపా టు మైదాన ప్రాంతాల్లో ఐటీడీఏలు వా రి పిల్లల వివాహానికి రూ. 50వేలు, గృ హాల నిర్మాణానికి రూ.1.50లక్షలు, 500 గిరిజన జనాభా కలిగిన తండాల ను గ్రామపంచాయతీలుగా గుర్తిస్తామన్నారు. నగదు బదిలీ పథకం రూపకల్పన చేసింది తానేని తెలిపారు. దానిని నేడు కాంగ్రెస్ దుర్వినియోగం చేయడానికి యత్నిస్తోందన్నారు. ప్రజలకు రేషన్ సరుకుల ద్వారా బియ్యం పంపి ణీ చేయడం మరిచి నగదు జమ చేయ డం ద్వారా పురుషుల ఖాతాల్లోకి వెళ్లితే వారు బారు షాపులకు వెళ్లి ఖర్చు చేసే ప్రమాదం ఉందన్నారు. టీఆర్ఎస్అధినేత కేసీఆర్ కుంభకర్ణుడని ఎద్దేవా చేశారు. ప్రజల సమస్యలను ఏ రోజు పట్టించుకున్న పాపనా పోలేదని పేర్కొన్నారు. తెలంగాణ అంశంపై ఈ ప్రాం త ప్రజల మనోభావాలను గుర్తించి అఖిల పక్ష సమావేశంలో టీడీపీ తెలంగాణకు సానుకూలంగా నిర్ణయం వెల్లడించడంతో అన్ని పార్టీలు స్వాగతించాయన్నారు. తాను తెలంగాణకు వ్యతిరేకం కాదని స్పష్టం చేయడంతో ప్రజ లు హర్షధ్వానాలు చేశారు.

ఈ సభలో టీ టీడీపీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు, డోర్నకల్ ఎమ్మెల్యే సత్యవతిరాథోడ్, ఎంపీ గుం డు సుధారాణి, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, సీతక్క, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షు డు ఎడబోయిన బస్వారెడ్డి, ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జాటోతు నెహ్రూ నాయక్, టీడీపీ మండల అధ్యక్షుడు కొమ్మినేని రవీందర్, జిల్లా ఉపాధ్యక్షుడు బండ భిక్షంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.