January 8, 2013

గిరిజనంతో మమేకం



తెలుగు దేశం పార్టీ అధినే త నారా చంద్రబాబు నాయుడు పదో రోజు పాదయాత్ర అట్టహాసంగా, సందడిగా సాగిం ది. వేలాది మంది గిరిజనులు యాత్ర వెంట నడిచారు. డప్పుచప్పుళ్ళు, నృత్యాలతో కోలాహలంగా మారింది. మహిళలు తెలంగాణ బోనాలతో చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. దారి పొడవునా ప్రజలు బారులు తీరి నిల్చున్నా రు. తమ సమస్యలను బాబుకు విన్నవించుకునేందుకు ఉత్సాహంగా ముందుకు వచ్చారు. కొందరు వినతి పత్రాలను సమర్పించారు. చం ద్రబాబు కూడా అలుపెరగకుండా అందరిని కలుసుకునే ప్రయత్నం చేశారు. వారి బాధలను సావధానంగా విన్నారు. అంతిమంగా ఈ బా ధలన్నీ కాంగ్రెస్ అసమర్ధ పాలన వల్లనేనని తే ల్చి చెప్పారు. ఈ కష్టాలు పోవాలంటే రాష్ట్రంలో టీడీపీ మళ్ళీ అధికారంలోకి రావాల్సిందేనన్నారు.

తమ పార్టీ తిరిగి ప్రభత్వంలోకి వస్తే అన్ని సౌకర్యాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. వివిధ వర్గాల సామాజిక, ఆర్ధికాభ్యున్నతికి పాటుపడుతానని వాగ్దానం చేశారు. ప్రజలు తన కోసం ఎదురు చూస్తున్న ప్రతీ చోట ఆగారు. ఓపిగ్గా మాట్లాడారు. రెండు రోజులుగా బాబు పాదయాత్రకు వచ్చే జనాల సంఖ్య బాగా పెరిగింది. పాదయాత్ర సాగే మార్గంలోని దాదాపు అన్ని గ్రామాలు, ప్రధానంగా తండాల నుంచి లంబాడాలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతీ తం డా నుంచి టీడీపీ పతాకాలను ధరించి ర్యాలీలు గా బాబుకు ఎదురొచ్చి స్వాగతించారు. ఎమ్మె ల్యే సత్యవతి రాథోడ్ నియోజకవర్గం అయిన డోర్నకల్ పరిధిలోని అన్ని మండలాల నుంచి ప్రజలు తరలివచ్చారు.

రైతులతో...

కొమ్ములవంచ గ్రామంలో చంద్రబాబు పత్తిరైతులతో మాట్లాడారు. మైదం వీరయ్య, రామ న్న, కే యాకయ్యల పత్తి చేనులోకి వెళ్ళి వారితో ముచ్చటించారు. పత్తి సాగుపై పెట్టిన పెట్టుబడి గురించి ఆరా తీసారు. దిగుబడి ఏమేరకు వస్తోందని అడిగారు. గిట్టుబాటు ధరల లభిస్తోందా అని ప్రశ్నించారు. కరెంట్‌లేక పంట దిగుబడి తగ్గిపోయిందని, గిట్టు బాటుధర లభించడం లేదని, ఆర్ధికంగా నష్టపోయే పరిస్థి తి ఉందని వాపోయారు.

మహిళతో...

కొమ్ములవంచ గ్రామంలోని దుర్గమ్మగుడి జంక్షన్‌లో గిరిజన మహిళలు బతుకమ్మలు, మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. తమ సమస్యలను బాబుకు నివేదించారు. కూలీ పనులు దొరక్క పస్తులుంటున్నామని చెప్పారు. నిత్యావసర వస్తువలు ధరలు విపరీతంగా పెరగడం వల్ల బతుకు భారమై పోయిందని ఆవేదన గా చెప్పారు. సావధానంగా విన్న బాబు తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యల న్నీ పరిష్కరిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యడం వల్లనే ఈ దుస్థితి ఏర్పడిందని చెప్పారు.

గీతకార్మికులతో..

మార్గ మధ్యలో జి. వీర భద్రం, మేడి లక్ష్మన్, పురుషోత్తం తదితర గీత కార్మికులు బాబును కలిసి వృత్తి పరంగా తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను బాబు దృష్టికి తీసుకువచ్చారు. చెట్ల పెంపకానికి స్ధలాలు కేటాయించాలని, గీత వృత్తికి భద్రత కల్పించాలని, పింఛన్లు ఇవ్వాలని విజ్ఞప్తిచేశారు. చంద్రబాబు స్పందిస్తూ గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో గీత కార్మికుల సం క్షేమానికి తీసుకున్న చర్యలను బాబు గుర్తు చేశా రు. తాటి చెట్ల నుంచి నీరతో శీతల పానీయాల ను తయారు చేయించామని, తాటి బెల్లం తయారీకి యూనిట్లను ఏర్పాటు చేయించామన్నారు. గీత వృత్తికి పూర్వవైభవాన్ని తీసుకువస్తానని హామీ ఇచ్చారు.

సబ్ స్టేషన్ తండాలో..

సబ్ స్టేషన్ తండా వ ద్ద గిరిజనులు కుండి, దనిషీ, ధర్మాలు కరెంట్ సరఫరాపై బాబుకు ఫిర్యాదు చేశారు. రోజుకు రెం డు, మూడు గంటలకు మించి కరెంట్ సరఫరా ఉండడం లేదని, కరెంట్ లేకపోవడం వల్ల మో టార్లు నడవక వేసిన పంటలు దెబ్బతింటున్నాయని చెప్పారు. కరెంట్ సరఫరా కాపోయినా బిల్లులు మా త్రం వేలల్లో వస్తోందని తెలిపారు.

ఫోటోగ్రాఫర్‌గా సీతక్క..

పాదయాత్రలో ఏమ్మెల్యే సీతక్క కొద్ది సేపు ఫోటోగ్రాఫర్ అవతారం ఎత్తారు. పాదయాత్ర చేస్తున్న చంద్రబాబు నాయుడును వివిధ యాంగిళ్ళలో ఫోటోలు తీసారు. బాబు కూడా సహకరించారు. ఫోటోలకు పోజులిచ్చి నవ్వులు పూయించారు.

15 కిమీ నడక

పదో రోజు పాదయాత్రలో చంద్రబాబు మొ త్తం 15కిమీ దూరం నడిచారు. నర్సింహులపే ట మండలంలోని ఆకేరు వాగు బ్రిడ్జి వద్ద బస చేసిన ప్రాంతం నుంచి కొ మ్ములవంచతండా, సబ్‌స్టేషన్‌తండా, నర్సింహులపేట, రేకులతండా, అమర్‌సింగ్ తండా, పాం డ్యాతండా, బంకచంద్రతండా, వశ్రంతండాల మీదుగా పాదయాత్ర సాగించారు. వశ్రంతండా లో రాత్రి బస చేసారు.

పాదయాత్రలో డోర్నకల్ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్, టీడీపీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెలి దయాకర్‌రావు, రాజ్యసభ సభ్యురాలు గుం డు సుధారాణి, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, సీతక్క, రాష్ట్ర పారీ అధికార ప్రతినిధి వేం నరేందర్‌రెడ్డి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పాదయాత్ర సమన్వయకర్త గరికపాటి మోహన్‌రా వు, టీడీపీ జిల్లా ప్రచార కార్యదర్శి పుల్లూరి ఆశోక్‌కుమార్, కార్యాలయ కార్యదర్శి మార్గం సారం గం, కార్యాలయ సమన్వయ కార్యదర్శి రవి యాదవ్, నాయకులు బుర్రి తిరుపతి, కట్టా మనోజ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.