January 8, 2013

దేశంకు నూతన జవసత్వాలు



 
'అన్నింటా అవినీతి, కుంభకోణాలు పెరిగిపోయాయి... కొంతమంది దోచుకోవడం, దాచుకోవడమే పనిగా పెట్టుకున్నారు.. రాష్ట్రంలో ఇప్పుడు రాబందుల పాలన సాగుతోంది...' అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. నర్సింహులపేట మండల పరిధిలోని పలు గ్రామాల మీదుగా ఆయన సోమవారం 10వ రోజు పాదయాత్ర నిర్వహించారు. నర్సింహులపేట మండల కేంద్రంలో నిర్వ హించిన బహిరంగసభ సభలో ప్రసంగించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన చేపట్టినప్పటి నుంచి ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి రాగానే ప్రజల కష్టాలను తీర్చుతామని హామీ ఇచ్చారు. పాదయాత్ర అనంతరం రాత్రి నాగారం క్రాస్ వద్ద బస చేశారు.


జిల్లాలో తెలుగు దేశం అధినేత నారా చంద్రబా బు నాయుడు ' వస్తున్నా.. మీ కోసం । పాదయాత్ర ఉత్కంఠ మధ్య మొద లై..... ప్రశాంత పరిస్థితుల్లో ముగుస్తోంది. ఊహించిన దానికన్నా మిన్న గా పాదయాత్ర విజయవంతం కావ డం పట్ల టీడీపీ తమ్ముళ్ళు సంతోషంగా ఉన్నారు. స్వల్ప సంఘటనలు మినహా పాదయాత్ర ప్రశాంతంగా ముగిసినందుకు నాయకులు హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నారు.

గత డిసెంబర్ 28న కరీంనగర్ జి ల్లా జమ్మికుంట మండలం నగరం గ్రా మం మీదుగా బాబు వరంగల్ జిల్లా లో అడుగుపెట్టారు. 29న వెల్లంపల్లి నుంచి పాదయాత్ర మొదలైంది. సోమవారం నాటికి 10వ రోజు పూర్తయింది. 6 నియోజకవర్గాలు 12 మండలాలు, 61 గ్రామాల మీదుగా 152.1 కిమీ సాగింది. మంగళవారం 11వ రోజు చంద్రబాబు డోర్నకల్ మండలం వశ్రంతండా నుంచి పాదయాత్ర మొదలు పె డతారు. పద గ్రామాల మీదుగా మరో 15 కిమీ బాబు నడుస్తారు. మరిపెడ మీదుగా ఖమ్మం జిల్లాలో అడుగుపెట్టడంతో పాదయాత్ర ముగుస్తుంది. దీని తో జిల్లాలో బాబు మొత్తం 71 గ్రామా ల మీదుగా 162.1 కిమీ బాబు పాదయాత్ర చేసినట్టవుతుంది.

హమ్మయ్య...

చంద్రబాబు యాత్రకు ముందు ఉ న్న ఉద్రిక్త పరిస్థితి ఆయన యాత్ర మొ దలైన తర్వాత లేదు. తెలంగాణపై టీడీ పీ వైఖరిని స్పష్టం చేయకపోతే అడ్డుకుంటాం... అని తెలంగాణవాదులు హెచ్చరిక ప్రకటనలు చేశారు. సరిగ్గా ఇదే సమయంలో ప్రత్యేక తెలంగాణపై ఢిల్లీలో అఖిపక్ష సమావేశం జరిగింది. ఆ సమావేశంలో టీడీపీ తెలంగాణ ప ట్ల సానుకూల వైఖరిని ప్రకటించింది. దీనితో అప్పటి వరకు ఉన్న ఉత్కంఠ తొలగిపోయింది. టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం పుట్టుకొచ్చింది.

వాస్తవంగా చంద్రబాబు 28వ తేదీననే జిల్లాలో అడుగుపెట్టాల్సి ఉం డింది. 28వ తేదీ నుంచి పాదయాత్ర మొదలు కావలసి ఉండింది. అఖిల పక్ష సమావేశం వల్లనే ఒక రోజు వాయిదా పడింది. ఇది తెలుగు తమ్ముళ్ళకు కలిసి వచ్చింది. నాయకులు, కార్యకర్తలు కూ డా ధీమాగా బాబు వెంట నడిచారు. చంద్రబాబు కూడా ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్నారు. పాదయాత్రలో గతంలో కన్నా మిన్నగా తె లంగాణ అంశంపై పార్టీ వైఖరిని మరిం త స్పష్టంగా విడమరిచి చెప్పే ప్రయ త్నం చేశారు. పనిలో పనిగా టీఆర్ఎస్ పార్టీని, ఆ పార్టీని తూర్పారబట్టారు. తెలంగాణపై పార్టీ స్పష్టతను వివిధ రూపాల్లో ప్రజల్లోకి మరింత బలంగా తీసుకుపోవాలని ఆదేశించారు.

స్పల్ప సంఘటనలు

పాదయాత్ర సందర్భంగా అక్కడక్క డ స్వల్ప సంఘటనలు చోటు చేసుకోకతప్పలేదు. తెలంగాణ ఉద్యమ ప్రభా వం కాస్త ఎక్కువగా ఉన్న పరకాల, నర్సంపేట నియోజవర్గాల పరిధిలో బాబు పాదయాత్రకు అడ్డంకులు ఎదురుకావచ్చునని అందరూ భావించారు. పరకాల నియోజకవర్గం పరిధిలో ఊహించినదానికన్నా భిన్నంగా పాదయాత్ర ప్రశాంతంగా సాగింది. సంగెం మండలం దస్రూనాయక్ తండా సం ఘటన మినహా. ఈ తండాలో తెలంగాణ విద్యార్ధి జాక్‌కు చెందిన ముగ్గురు విద్యార్థులు పాదయాత్రలో కోడిగుడ్లు విసిరేసారు.

నర్సంపేట నియోజకవర్గం పరిధిలోకి వచ్చిన తర్వాత దుగ్గొండి మండ లం గిర్నిబావి బహిరంగ సభలో కూ డా స్వల్పగలాట జరిగింది. ఒకరిద్దరు తెలంగాణవాదులు అడ్డుకునేందుకు విఫలయత్నం చేశారు. ఇంతకు మించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగ లేదు. పాదయాత్ర ప్రశాంతంగా ముగుస్తున్నందుకు టీడీపీ నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పోలీసు అధికారులు ఉపిరి పీల్చుకుంటున్నారు.

రికార్డులు

మిగతా జిల్లాలో కన్నా వరంగల్‌లో చంద్రబాబు పాదయాత్రకు విశేష ప్రా ధాన్యత లభించింది. కొన్ని విశిష్టతలు కూడా సమకూరాయి. తెలంగాణపై అఖిల పక్ష సమావేశం జరిగిన మరుస టి రోజు నుంచే జిల్లాలో పాదయాత్ర మొదలవడం ఓ ప్రత్యేకత. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాదయాత్ర రికార్డును బద్ద లు కొట్టడం మరో ప్రత్యేకత. 53 ఏళ్ళ వయసులో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 68 రో జుల్లో 1468 కి.మీ. పాదయాత్ర చేయ గా, 63 ఏళ్ళ వయసులో చంద్రబాబు 1480 కి.మీ. నడిచి ఆ రికార్డును బద్ద లు చేశారు. గుర్తుగా ఆ మార్కు దాటి న సంగెం మండలం పల్లారుగూడలో ఒక శిలాపలకాన్ని అవిష్కరించారు. మ రో విశిష్టత కూడా చేకూరింది. బాబు పాదయాత్ర చేపట్టి మంగళవారంతో 99 రోజులు పూర్తవుతోంది. ఈ జిల్లా లో మీదుగానే ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించి బుధవారం100వ రోజు పాదయాత్రకు శ్రీకారం చుడతారు.

పెరిగిన ఉత్సాహం

చంద్రబాబు పాదయాత్రతో జిల్లా లో తెలుగు తమ్ముళ్ళలో ఉత్సాహం పెరిగింది. తెలంగాణపై స్పష్టమైన వైఖరితో పాదయాత్ర సాగినందు వల్ల వారి లో కొత్త స్పూర్తి చోటు చేసుకున్నది. ఇన్నాళ్ళు తెలంగాణ విషయంలో భ య పడుతూ తిరిగిన శ్రేణులు ఇప్పుడు ధైర్యంగా ప్రజలను కలిసేందుకు ఈ పాదయాత్ర తోడ్పడనున్నది. పాదయా త్ర ప్రభావం పార్టీ శ్రేణులు, ప్రధానం గా ప్రజలపై స్పష్టమైన ప్రభావం చూ పుతుందని నాయకులు చెబుతున్నారు. వచ్చేది దాదాపుగా ఎన్నికల సంవత్సర మే అయినందు వల్ల పార్టీని ఇప్పటి నుంచే సమాయత్తం చేసేందుకు, పాదయాత్ర కొత్త వూపునిచ్చిందంటున్నారు.

రాబోయే స్థానిక సంస్ధల ఎన్నికలపై పాదయాత్ర ప్రభావం ఉండపోదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఆరా..

చంద్రబాబు పాదయాత్రపై కాంగ్రె స్,టీఆర్ఎస్ పార్టీలు ఆరా తీస్తున్నా యి. పాదయాత్రకు జనం నుంచి వస్తు న్న స్పందన, దాని ప్రభావంపై అంచనాలు వేయడంలో ఆ పార్టీల నేతలు ప్రస్తుతం తలమునకలై ఉన్నారు.దీని ప్రభావం వచ్చే స్థానిక సంస్థల ఎన్నిక ల్లో ఏ మేరకు ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు బాబు తమ ప్ర భుత్వంపై చేసిన విమర్శలను తిప్పికొట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. తెలంగాణా అంశంపై తమ వైఖరి స్పష్టం, సానుకూలమని బాబు పదే పదే చేస్తు న్న ప్రకటనలను ప్రజలు ఏ మేరకు వి శ్వసిస్తున్నారో టీఆర్ఎస్ నాయకులు ఆ రా తీస్తున్నారు. పాదయాత్రపై తాము అనుసరిస్తున్నది వ్యూహాత్మక మౌనమ ని ఆ పార్టీ నాయకులు చెబుతున్నా వాస్తవంగా వారిదిప్పుడు ఎటూ పాలుపోని స్థితేనని టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.