January 8, 2013

పెద్దిరెడ్డికి ప్రజాదరణ లేదు..దొంతి లెక్కలోకి రాడు



కార్యకర్తలు కొం చెం కష్టపడితే నర్సంపేట స్థానం మళ్లీ మనదేనని టీడీపీ అధినేత నారా చం ద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం నెల్లికుదురు మండలం ఆకేరువాగు బ్రిడ్జి వద్ద తాను బస చేసిన ప్రాం తంలోనే నర్సంపేట నియోజకవర్గం సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో టీడీపీకి, టీఆర్ఎస్‌కు మధ్యనే పోటీ ఉంటుందన్నారు.

టీఆర్ఎస్ నాయకుడు పెద్ది సుదర్శన్‌రెడ్డికి నియోజకవర్గంలో అంత ప్రజాదరణ లేనందు వల్ల పెద్దగా భయపడాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే భూస్థాపితం అయింది. ఈ దృష్ట్యా ఆ పార్టీ నాయకుడు దొంతి మాధవ రెడ్డి లెక్కలోకే రాడని బాబు వ్యాఖ్యానించారు. సహకార సంఘాల ఎన్నికల్లో నియోజకవర్గం పరిధిలోని 13 ప్రాధమిక సహకార సంఘాలను మనమే కైవసం చేసుకోవాలని, డీసీసీ బీ చైర్మెన్ పదవిని కూడా దక్కించుకోవాలన్నారు. ఇందుకు నియోజకవర్గంలోని నాయకులు, క్యాడర్ కష్టపడాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా సినీ నటులను వినియోగించుకోవాలన్న ఒక నాయకుడి సూచనను చంద్రబాబు నాయుడు కొట్టిపారవేసారు. రాజకీయాల్లో చిరంజీవి ప్లాప్ అయిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

'సినీ నటులతోనేఏదో లాభం జరుగుతుందనుకోవడం పొరపాటు. అవసరాన్ని బట్టి వారిని వాడుకున్నా మనం కష్టపడితేనే ఫలితం ఉంటుంది..' అని చెప్పారు. అతి విశ్వాసం వద్దని ప్రతీ కార్యకర్తల సమన్వయంతో పని చేయాలని ఉద్భోదించారు. తెలంగాణ అం శంపై టీడీపీ స్పష్టమైన వైఖరితో ఉన్న విషయాన్ని ప్రజల్లోకి మరింత బ లంగా తీసుకువెళ్ళాలని కోరారు. పార్టీ ఇటీవల ప్రకటించిన బీసీ డిక్లరేషన్, ఎ మ్మార్పీఎస్ వర్గీరణ విషయాలను కూ డా ప్రచారంలోకి తీసుకువెళ్ళాని కోరా రు. నర్సంపేట నియోజకవర్గ ఎమ్మె ల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, మండల అధ్యక్షులు, కార్యదర్శులతోపాటు, నాయక లు బుర్రి తిరుపతి, చెన్నకేశవ రెడ్డి, ము రళి, యాకూబ్, వేముల ప్రకాశ్‌రావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.