January 8, 2013

కాంగ్రెస్ గజదొంగల పార్టీ



 
ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన 'వస్తున్నా మీ కోసం' పాదయాత్ర సాయంత్రం 3 గంటలకు ఎర్రబెల్లి గూ డెం శివారు నుంచి ప్రారంభమైంది. గ్రామానికి చేరుకోగానే చంద్రబాబు రజకుడు మచ్చ సోమయ్య ఇంటికి వెళ్లారు. దుస్తులను ఇస్త్రీ చేశారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అ నంతరం బహిరంగ సభలో పాల్గొన్నారు.


పంటలపై ఆరా..

గ్రామ శివారులో నాట్లు వేస్తున్న కూలీల వద్దకు వెళ్లి పంటల దిగుబడి ఎలా వుంది.. ఖర్చులు ఏ విధంగా ఉన్నాయని అడిగి తెలుసు కున్నారు. ఎరువుల ధరలు పూర్తిగా పెరిగిపోయాయని గిట్టుబాటు ధరలు రావడంలేదని, కరువు నష్ట పరిహారం అందడం లేదని రైతులు రామ్మూర్తి, మునిప్రసాద్ వివరించారు. అనంతరం ఆయన వారిని ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్ అసమర్థ ప్రభుత్వ హయాంలో ఎరువుల ధరలు డీఏపీ రూ. 420 నుంచి రూ. 1300, పోటాష్ బస్తా రూ. 200 నుంచి రూ.1000 వరకు చేరుకుందన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు అం దడం లేదన్నారు.

పత్తి రైతులతో సంభాషణ

తిమ్మ తండా వద్ద పత్తి చేనును సందర్శించారు. అక్కడున్న పత్తి రైతులతో సంభాషించారు. పత్తికి కనీస మద్ధతు ధర లభించడం లేదన్నారు. వేసిన పంటలకు కనీసం పెట్టుబడి రాని దయనీయమైన దుస్థితి నెలకొందన్నారు. టీడీపీ హయాంలో క్రమశిక్షణాయుతంగా పరిపాలన నిర్వహించి రాష్ట్ర తలసరి ఆదాయాన్ని పెంచడంతో పాటు ప్రజా సమస్యలు తీర్చామన్నారు.

కాచికల్‌లో..కాంగ్రెస్‌పై..

అనంతరం నెల్లికుదురు మండలం కాచికల్ గ్రామానికి చేరుకున్నారు. ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్ గజదొంగలు పందికొక్కుల్లా ప్రజల సొమ్మును కాజేస్తూ ప్రజలపై పన్నుల భారం మోపుతున్నారన్నారు. ప్రభు త్వం ప్రవేశపెట్టిన పథకాల్లో ఈజీఎస్, ఇందిరమ్మ పంట నష్ట పరిహారం అర్హులకు అందకుం డా కాంగ్రెస్ దొంగలే మింగుతున్నారన్నారు.

రూ.3 వేల కోట్లు వెనక్కి..

కాంగ్రెస్ పాలనలో గ్రామీణ స్వపరిపాలన వ్యవస్థ పూర్తిగా కుంటుపడే దశకు చేరుకుందన్నారు. సకాలంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం చేతకాకపోవడంతో కేంద్రం నుం చి వచ్చే రూ. 3వేల కోట్ల వెనక్కి వెళ్లిపోయాయన్నారు.

మందు ఫుల్లు.. నీరు నిల్లు..

గ్రామాల్లో మంచినీరు డ్రైయినేజీలు అంతర్గత రోడ్లు నిర్మాణం లేక ప్రజలు సమస్యల వలయంలో చిక్కుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో గ్రామాల్లో తాగడానికి మందు పుష్కలంగా దొరుకుందని గొంతు తడుపుకోవడానికి తాగునీరు దొరకడం లేదన్నారు.

టీఆర్ఎస్ పనికి మాలిన పార్టీ

తెలంగాణ ప్రజల మనోభావాలను గుర్తించి 2008లో ప్రణబ్ ముఖర్జీ కమిటీకి, 2012 అఖిల పక్ష సమావేశంలో అనుకూల నిర్ణయం వెల్లడించడంతో అన్ని పార్టీలు టీడీపీ నిర్ణయా న్ని స్వాగతిస్తున్నాయన్నారు. టీఆర్ఎస్ అనవసర రాద్ధాంతం చేస్తుందన్నారు. అది కుటుంబ పార్టీగా మారిందన్నారు. లాలుచీ రాజకీయాలు చేస్తూ డబ్బులు సంపాదించుకోవడమే లక్ష్యం గా పెట్టుకుందన్నారు.

ఉపాధి, లేకుంటే భృతి

రాష్ట్రంలో చదువుకున్న నిరుద్యోగులైన యువతీ, యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడం, అవసరమైతే విద్యార్హత ప్రకారం నెలవారి భృతి చెల్లిస్తామని చంద్ర బాబు హామీ ఇచ్చారు.

సామాజిక న్యాయం

టీడీపీ హయాంలోనే సామాజిక న్యాయం కొనసాగుతుందన్నారు. వంద అసెంబ్లీ సీట్లను బీసీలకు కేటాయించామన్నారు. నిజామాబాబాద్ జిల్లాలో బాన్సువాడ జనరల్ సీట్‌ను ఎస్టీ కులానికి చెందిన వారికి ఇన్‌చార్జీగా బాధ్యతలు అప్పగించడం జరిగిందన్నారు. ఎస్టీ దేవాలయాల్లోని పూజారులకు గౌరవ వేతనం చెల్లించడం జరుగుతుందన్నారు.

పన్నులు మోపడం కాంగ్రెస్‌కే చెల్లు

ప్రజలు నమ్మి కాంగ్రెస్‌కు అధికారం కట్టపెడి తే రోజుకో రూపంలో ప్రజలపై పన్నుల భారం మోపుతున్నారన్నారు.

సంచిలో డబ్బులు.. జోలెలో వస్తువులు

సంచిలో డబ్బులు పెట్టుకుని నిత్యావసర వస్తువుల ధరలను కొనుగోలు చేస్తే జోలేలో వస్తువులుపెట్టుకోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. నేడు కొత్తగా విద్యుత్ చా ర్జీలు, రిజిస్ట్రేషన్ల ఫీజులు, వాహనాల ఫీజులు పెంచుతూ ప్రజల నడ్డీ విరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అందుకోసమే ఈ యాత్ర

తాను అధికార దాహం కోసం పాదయాత్ర చేయడం లేదని పేదల సమస్యలు తెలుసుకొని వారికి మనోధైర్యం కల్పించడానికి వస్తున్నానని తెలిపారు. అవినీతి అసమర్థ రాక్షస కాంగ్రెస్ పాలనను అంతమొందించడానికి ప్రజలు ముం దుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో టీ టీడీపీ కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎంపీ గుండు సుధారాణి, మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డి, ములు గు ఎమ్మెల్యే సీతక్క, బొజ్జపల్లి రాజయ్య, టీడీ పీ జిల్లా అధ్యక్షుడు ఎడబోయిన బస్వారెడ్డి, నా యకులు జాటోతు నెహ్రూ నాయక్, పాల్వయి రామ్మోహన్‌రెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు.