December 29, 2012

పూర్వవైభవం కోసం తహతహ



తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబా బు నాయుడు జిల్లాలో ప్రజా సమస్యలపైన, ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలను చైతన్యవంతులను చేసే ప్రయత్నంగా మూడు విడతలుగా యాత్రలు సాగించారు. వీటిలో 'రైతు పోరుబాట' పేరుతో చేపట్టింది పాదయాత్ర కా గా అంతకు ముందు బస్సుయాత్ర సాగించారు. గుండ్లవాగు ప్రాజెక్టు కింద నిర్వాసితులైనవారిని ఆదుకోవాలని సీతక్క చేపట్టిన పాదయాత్రకు సంఘీభావంగా గుండ్లవాగును సందర్శించి రైతులతో మమేకం అయ్యారు. ఇప్పుడు తాజా గా ప్రజా సమస్యలను తెలుసుకునేందు కు, వారికి భరోసా ఇచ్చేందుకు పాదయాత్రతో ప్రజ ల ముందుకు వస్తున్నారు.

రైతు పోరు యాత్ర...: ఈ సంవత్సరం జనవరిలో చంద్రబాబు జిల్లాలో చేపట్టిన 'రైతు పోరు' యాత్ర కూడా తెలంగాణవాదుల తీవ్ర ప్రతిఘటనల మధ్య ఉద్రిక్తంగా సాగింది. టీడీపీ జిల్లా నాయకులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని యాత్ర విజయవం తం అయ్యేట్టు చేశారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు బాబు ఈ యా త్ర చేపట్టారు. తెలంగాణ ఉద్యమం ఉదృతంగా సాగుతున్న పరిస్థితుల మధ్య బాబు చేపట్టిన ఈ యాత్రకు తెలంగాణవాదులు, ముఖ్యంగా టీఆర్ఎస్ శ్రేణుల నుంచి సహజంగానే వ్యతిరేకత వ్యక్తం అయింది. తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించకుండా జిల్లాలో అడుగుపెడితే అడ్డుకుంటామని హెచ్చరికలు చేశారు. వీటిని జిల్లా టీడీపీ నాయకులు సవాల్‌గా తీసుకున్నా రు. బాబు యాత్రను సక్సెస్ చేసే దిశగా నడుం బిగించారు. దీనితో రెండు పార్టీల శ్రేణులు మోహరించాయి.

యాత్రపై యుద్ధమేగాలు అలముకున్నాయి.

బాబు రాకకు ముందే ఎక్కడికక్కడ పోలీసులు తెలంగాణవాదులను అరెస్టు చేయడంతో ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి. జనవరి 6న బాబు హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన జనగామలోని పెంబర్తి మీదుగా జిల్లాలో ప్రవేశించారు. అక్కడి నుంచి కాన్వాయిగా కొడకండ్ల మండ లం పరిధిలోని లక్ష్మక్కపల్లికి చేరుకున్నారు. అక్కడి నుంచి బాబు పోరుబాట మొదలైంది. 14 కిలోమీటర్లు యాత్ర సాగింది. పాలకుర్తిలో సాయంత్రం బహిరంగ సభతో ముగిసింది. పోరుబాటలో పాల్గొనేందుకు బాబు వస్తుండ గా జనగామ పట్టణంలో కాన్వాయిపై తెలంగాణవాదులు రాళ్ళు రువ్వారు. అలోగానే బాబు కాన్వాయి ముందుకు వెళ్ళిపోవడంతో ఎవరికి పెద్దగా ఏమీ కాలేదు.

సీతక్క పాదయాత్రకు...: గోవిందరావుపేట మండలం కర్లపల్లి వద్ద భారీ వర్షానికి తెగిపోయిన గుండ్లవాగు ప్రాజెక్టు ను పునరుద్దరించాలని కోరుతూ ఎమ్మెల్యే సీత క్క చేపట్టిన పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు జిల్లాకు వచ్చారు. గుండ్లవాగును సం దర్శించారు. సుమారు రూ.12 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు భారీ వర్షాలకు తెగిపోయిం ది. దీనికి మరమ్మతులు చేయడంలో ప్రభుత్వం జాప్యానికి పాల్పడింది. ఇందుకు నిరసనగా 2007 అక్టోబర్ మొదటి వారంలో సీతక్క గుం డ్లవాగు నుంచి కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రకు మద్దతుగా అక్టోబ ర్ 9న బాబు స్వయంగా గుండ్లవాగును సందర్శించారు. అక్కడి పరిస్థితిని తెలుసుకున్నారు. గుండ్ల తెగిపోవడం వల్ల భూములు, పంటలు నష్టపోయిన రైతులను కలుసుకున్నారు. వారిని పరామార్శించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. గుండ్లవాగు మర్మత్తులు వెంటనే చేపట్టాలని, నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

మీ కోసం బస్సు యాత్ర..: చంద్రబాబు 'మీ కోసం..జనచైతన్యం' పేరు తో జిల్లాలో రెండు విడతలుగా యాత్ర చేపట్టా రు. ఇది పూర్తిగా బస్సు యాత్ర. ప్రత్యేక తెలంగాణ కోరుతూ టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయడంతో వచ్చి న ఉపఎన్నికల నేపధ్యంగా ఆ యాత్ర సాగింది. మొదటి విడతగా 2008 మే 7, 8 తేదీలో సాగిం ది. రెండవ విడతగా మే 16,17 తేదీల్లో ఈ యా త్ర సాగింది. ఈ యాత్ర సందర్భంగా కూడా బాబు మార్గమధ్యలో బాబు పలుచోట్ల ఆగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించారు. ముఖ్యంగా రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రత్యేకంగా పరిశీలించారు. యాత్ర సం దర్భంగా బాబుకు పలుచోట్ల తెలంగాణవాదం బలంగానే వినిపించింది.

మల్లయ్య తెలం'గానం': రాయపర్తి వద్ద పొలంలో పనిచేసుకుంటున్న పణికర మల్లయ్యను పలకరించగా తమ సమస్య లు పరిష్కారం కావాలంటే తెలంగాణ రావ డం ఒక్కటే పరిష్కారంగా కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం విశేషం. బాబు రోడ్ షో సందర్భంగా పలుచోట్ల తెలంగాణవాదుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. డోర్నకల్‌లో బహిరంగ సభ ఏర్పాటుపై వివాదం చోటుచేసుకున్నది. కాంగ్రెస్ శ్రేణుల నుంచి అడ్డంకులను అధిగమించి టీడీపీ నాయకులు బాబు యాత్రను విజయవంతం చేశారు. కరీంనగర్ జిల్లాలో ప్రవేశించే ముందు యాత్రను విజయవంతం చేసినందుకు బాబు జిల్లా నేతలను ప్రశంసించారు.

29 నుంచి 'వస్తున్నా..మీకోసం': తాజాగా వస్తున్నా... మీ కోసం యాత్రలో భాగంగా చంద్రబాబు మరో విడత యాత్రను ఈనెల 29 నుంచి జిల్లాలో చేయబోతున్నారు. మీ కోసం జనచైతన్య యాత్ర ప్రధానంగా ఎన్నికల నేపధ్యంగా సాగగా ఇది మాత్రం ప్రధానం గా ప్రజల సమస్యలపై దృష్టి సారించి చేపట్టిన యాత్ర. ఆరు నియోజకవర్గాలు, 12 మండలా లు, 65 గ్రామాల గుండా మొత్తం 156 కిమీ మేరకు బాబు ఈ సుదీర్ఘయాత్ర చేయనున్నారు.

2004 ఎన్నికల ముందు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చేపట్టిన పాదయాత్రకు మించి ధీటుగా బాబు ఈ యాత్రను సాగిస్తున్నారు. మారిన రాజకీయ పరిస్థితుల నేపధ్యంలో, ప్రధానంగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమ వాతావరణంలో సవాళ్ళు, ప్రతిసవాళ్ళ మధ్య సాహసోపేతంగా జరగనున్న ఈ పాదయాత్రపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. ప్రత్యేక తెలంగాణ అంశంపై ఈనెల 28న అఖిల పక్ష సమావేశం జరిగిన మరుసటి రోజు నుంచే జిల్లాలో బాబు పాదయాత్ర మొదలవుతుంది. సమావేశంలో తెలంగాణపై టీడీపీ వెల్లడించే సానుకూలవైఖరిపై ఆధారపడి బాబుయాత్ర సజావుగా ముందుకు సాగడం ఉంటుంది.