December 29, 2012

మీరు 'వస్తున్నా'రని ఈ లేఖ




అయ్యా..చంద్రబాబు గారూ..

మీరు గత 84 రోజులుగా బాబు యాత్ర చేస్తున్నారు. దాదాపు 1400 కి. మీ ప్రయాణం సాగించారు. పాదయా త్ర సందర్భంగా ప్రజలు ఎదుర్కొంటు న్న ప్రధాన సమస్యలను ప్రత్యక్షంగా చూస్తున్నారు. ప్రజల ఇబ్బందులను తీర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతున్నారు. రాష్ట్ర వ్యా ప్తంగా ఉన్న సమస్యలే మా జిల్లాలో నూ ఉన్నాయి. ఇతర జిల్లాలో కన్నా ఇక్కడ ఎక్కువున్నాయి. 70 శాతం మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు.

జిల్లా పారిశ్రామికంగా పూర్తిగా వెనుకబడింది. భారీ పరిశ్రమలేవి లే వు. ఉన్న ఒకే ఒక్క ఆజంజాహి మిల్లు మూత పడింది. విద్యాపరంగా కాస్త ముందడుగు వేసినా ఆ మేరకు ఉపాధి అవకాశాలు లేవు. అభివృద్ధి పరంగా జిల్లా ఆమడ దూరంలో ఉంది. శంకుస్థాపనలన్నీ శిలాపలకాలే పరిమితం అయ్యాయి. కొత్త ప్రాజెక్టులు రావడం లేదు. పైగా ఉన్నవి చేజారి పోతున్నా యి. తొమ్మిదిన్నరేళ్లు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని ఏలిన మీకు మా జిల్లా సమస్యలు తెలియనివి కావు. ఇక్కడ శనివారం నుంచి 11 రోజుల పాటు మీ రు పాదయ్రాత చేస్తున్న సందర్భంగా మీ దృష్టికి మరోసారి తీసుకువచ్చే ప్రయత్నం ఇది. ఈ సమస్యలపై మీరు గళమెత్తాలని, పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని మా విన్నపం..

నత్తనడకగా దేవాదుల

రూ.6 వేల కోట్ల అంచ నా వ్యయంతో చేపట్టిన చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం నత్తనడకగా సాగుతోంది. 2004 ఎన్నికలకు ముందు ఈ పథకానికి శంకుస్థాపన చేసింది మీరే. ప్రాజెక్టు మొదటి దశ పనులు 2006లో పూర్తయ్యాయి. రెండవ దశ పనులు దాదాపు పూర్తికావచ్చా యి. మూడవ దశ పనులు కూడా మొదలయ్యాయి. అయితే ఇప్పటి వర కు చుక్క నీరు రైతుల పొలాలను తడపడ లేదు.

మొదలుకాని కంతనపల్లి

శ్రీరాంసాగర్, దేవాదుల కింద ఉన్న 13 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించేందుకు దోహదపడే కంతనపల్లి ప్రాజెక్టు పనులు ఇప్పటి వరకు మొద లే కాలేదు. 2009 ఎన్నికలకు ముందు ఫిబ్రవరి 19న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆఘమేఘాల మీద కంతనపల్లి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. రూ.10,409 కోట్ల అంచ నా వ్యయంతో నిర్మించతలపెట్టిన ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం ఇప్పటి వరకు నిధులే కేటాయించ లేదు.

పారిశ్రామికాభివృద్ధి శూన్యం

జిల్లా పారిశ్రామికంగా పూర్తిగా వెనుకడింది. 50 ఏళ్ళ కాలంలో ఏ ఒక్క భారీ పరిశ్రమ స్థాపన జరగలేదు. కొత్త ప్రాజెక్టు రాలేదు. ఆజంజాహి మిల్లు కనుమరుగై పోయింది. కనుమరుగైన మిల్లు స్థానే కొత్త పరిశ్రమ స్థాపన జరగలేదు. రోడ్డున పడ్డ కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధిని ప్రభు త్వం కల్పించలేదు. ఉపాధి కోల్పోయి న కార్మికులకు పునరావాస కల్పన కిం ద కనీసం ఇళ్ళ స్థలాలను కూడా కేటాయించలేదు.

అపెరల్ పార్క్ శిలాఫలకానికే పరిమితం

అజంజాహి మిల్లు మూతపడడంతో రోడ్డున పడ్డ కార్మికులకు ప్రత్యామ్నా య ఉపాధి కల్పనకు 2003లో మీరు శంకుస్థాపన చేసిన అపెరల్ పార్క్ ఇప్పటికీ శిలాఫలకానికే పరిమితం అయింది. పార్క్ ఏర్పాటుకు విద్యుత్ శాఖ తప్ప అన్ని విభాగాలు అనుమతులు ఇచ్చాయి. ఫలితంగా పార్క్ పనులు మొదలు కావడం లేదు.

అతీగతీ లేని ఐటీ పార్క్

విద్యావంతులైన నిరుద్యోగులకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ఏర్పాటు చేయతలపెట్టిన ఐటీ పార్క్ అతీగతీ లేదు. హైదరాబాద్-వరంగల్ రహదారిపై రాంపూర్ వద్ద ఈ పార్క్ కోసం కంటితుడుపుగా స్థలం అయితే కేటాయించారు. పార్క్ పూర్తి స్వరూపాన్ని సంతరించుకునే దిశగా ఎలాంటి కృషి జరగలేదు.కోటి రూపాయలను వెచ్చిం చి పార్క్ స్థలం చుట్టూ ప్రహరీగోడనైతే నిర్మించారు కానీ ఇందులో ఐటీ పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం ఎలాంటి చొరవ తీసుకోలేదు.

వ్యాగన్ ఫ్యాక్టరీకి స్థలం కరువు

కాజీపేట పట్టణ శివార్లలో వ్యాగన్ వర్క్‌షాపు పరిస్థితి అయోమయంగా మారింది. ఈ వర్క్‌షాపునకు అవసరమైన స్థలం కేటాయింపులో తీవ్ర జా ప్యం జరుగుతోంది. రెండు సంవత్సరా ల క్రితం కేంద్ర రైల్వే బడ్జెట్‌లో వ్యాగన్ వర్క్‌షాపు మంజూరైంది. స్థలం కేటాయింపు పూర్తయితే ఈ పాటికే వర్క్‌షా పు పనులు మొదలై ఉండేది. ఈ దిశగా ప్రభుత్వం ఎలాంటి చొరవ తీసుకోవ డం లేదు. జాప్యం జరిగితే ఇది కూడా చేజారి పోయే ప్రమాదం ఉంది.

సంక్షోభంలో వ్యవసాయం

జిల్లాలో వ్యవసాయం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. గిట్టుబాటు ధర లభించక అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో పత్తికి గిట్టుబాటు ధర లభించ డం లేదు. సీసీఐ, మార్కెట్ అధికారు లు కుమ్మక్కుకావడంతో క్వింటాల్ పత్తి కి రైతు రూ.900 మేరకు నష్టపోతున్నా డు. సీసీఐ అధికారులు రైతుల ఎదుటే దళారీల నుంచి పత్తిని ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు.

విద్యుత్ కోతలతో ఇక్కట్లు

విద్యుత్ కోతలతో జిల్లాలో అన్ని రంగాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వ్యవసాయానికి 7 గంటలపాటు నిరంతరాయంగా విద్యు త్‌సరఫరాచేస్తున్నట్టు ప్రభుత్వం గొప్ప లు చెప్పుకుంటున్నా ఆచరణలో అది ఎక్కడా అమలు కావడం లేదు. అయి దు గంటలకు మించి సరఫరా కావడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. కరెంట్ సరఫరాలో అంతరాయాల వల్ల చేతికొచ్చిన పంటలకు నీరందక ఎండిపోతున్నాయి.

సీట్లు కోల్పోయిన కేఎంసీ

రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీన వైఖరి వల్ల కాకతీయ మెడికల్ కాలేజీ అదనంగా రావలసిన 50 సీట్లను కోల్పోయింది. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ నిర్దేశిత ప్రమాణాల మేరకు కాలేజీలో సౌకర్యా లు లేవన్న కారణంతో ప్రస్తుత విద్యా సంవత్సరానికి ఈ సీట్లు రాకుండా పోయాయి. తెలంగాణలోని నాలుగు జిల్లాలకు ఏకైక పెద్ద ఆస్పత్రి అయిన వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది.