December 29, 2012

బైండోవర్ మీకోసం..



 
జిల్లాలో తెలంగాణ ఉద్యమకారుల బైండోవర్ల పర్వం కొనసాగుతోంది. తెలుగుదేశం పార్టీ అధినే త చంద్రబాబునాయుడి పాదయాత్ర జిల్లాలో ప్రారంభం కావడానికి మూ డు రోజుల ముందు నుంచే నగరంలో, గ్రామాల్లో భయానక వాతావరణం నెలకొంది. తెలంగాణ వాదుల నుంచి బాబుకు నిరసనల సెగ తగల నివ్వకూడదన్న ఉద్దేశంతో పోలీసులు ముఖ్యమె ౖన ఉద్యమకారులను ముందస్తుగా అరె స్ట్ చేసి సంబంధిత తహసిల్దార్‌ల ముం దు బైండోవర్ చేస్తున్నారు. మంగళవా రం నాటికిసుమారు 200 మందికిపైగా టీఆర్ఎస్, జేఏసీ, బీజేపీ, సీపీఐలకు చెందిన తెలంగాణవాదులను అరెస్ట్ చే సిన పోలీసులు బుధవారం కూడా బైం డోవర్లను కొనసాగించారు.

జిల్లాలోని 8 పోలీస్‌స్టేషన్‌ల పరిదిలో గల 121 మంది ఉద్యమకారులను సంబంధిత తహసిల్దార్ల సమక్షంలో బైండోవర్ చే శారు. తమ అనుమతి లేకుండా ఎక్కడి కి వెళ్లరాదంటూ బైండోవర్ చేసిన వారి ని హుకుం జారీ చేస్తున్నారు. తెలంగా ణ రాష్ట్రం ఏర్పాటుపై అఖిల పక్ష సమా వేశంలో తెలుగుదేశం పార్టీ స్పష్టమైన వైఖరి వెల్లడించకుండా బాబును జిల్లా లో అడుగుపెట్టనీయబోమని వివిధ పార్టీల ఉద్యమకారులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాం గం కట్టుదిట్టమైన ముందస్తు భద్రతా ఏర్పాట్లను చేపట్టింది. దీంతో జిల్లా ప్రజల్లో ఎప్పుడు ఏం జరుగుతుందోన న్న ఆందోళన నెలకొంది. అటు పోలీస్ వర్గాలు, ఇటు తెలంగాణ ఉద్యమకారు లు పట్టుదలతో తమతమ ఏర్పాట్లలో ముందుకు సాగుతున్నారు.

పరకాల: చంద్రబాబు పాదయాత్ర చిట్యాల మండలం వెల్లంపల్లి గ్రామం లో ఈనెల 29నుంచి చంద్రబాబు యా త్ర ప్రారంభం అవుతుండటంతో తెలంగాణవాదులు నుంచి పాదయాత్రకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా పోలీసులు రెండు రోజులుగా టీఆర్ఎస్, బీ జేపీలకు చెందిన కార్యకర్తలు, నాయకులను అదుపులోకి తీసుకున్నారు. కా గా, బుధవారం పరకాల డివిజన్‌వ్యాప్తంగా 5మండలాల్లోని టీఆర్ఎస్, బీజే పీ ముఖ్య నాయకులను అరెస్టు చేసి ములుగు ఆర్డీవో మోతీలాల్ వద్ద హాజ రు పరిచారు. అరెస్టు అయిన వారిలో టీఆర్ఎస్ పరకాల మండల అధ్యక్ష, కా ర్యదర్శులు దగ్గు విజేందర్, దామెర మొగిలి, పట్టణ అధ్యక్షుడు బొచ్చు వినయ్‌తోపాటు జిల్లా నాయకులు ఉన్నా రు. అలాగే డివిజన్ వ్యాప్తంగా తెలంగాణ వాదుల అరెస్టులతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

డివిజన్ వ్యాప్తంగా 115మంది అరెస్టులు...: పరకాలలో టీఆర్ఎస్, బీజేపీలకు చెందిన 44మంది నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని ములుగు ఆర్డీవో మోతీలాల్ ఎదుట హాజరు పరిచారు. అంతేకాకుండా వీరిని ఈనెల 28,29 తేదీల్లో రేగొండ తహసీల్దార్ ముందు హాజరు కావాలని, 30వ తేదీ న ములుగు ఆర్డీవో ఎదుట హాజరు కా వాలని ఆర్డీవో ఆదేశించినట్లు టీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. అలాగే రేగొండ మండలంలో 12మంది టీఆర్ఎస్ నాయకులను, మొగుళ్లపల్లి మండలంలోని వివిధ పార్టీల నేతలు, మాజీ మిలిటెంట్లను 25మందిని, శాయంపే ట మండలంలో 8 మంది టీఆర్ఎస్ నాయకులను ములుగు ఆర్డీవో మోతీలాల్ ఎదుట బైండోవర్ చేశారు. అలా గే చిట్యాల మండలంలోని వెలిశాల, చ ల్లగరిగ గ్రామానికి చెందిన 16 మంది మావోయిస్టు సానుబూతిపరులను, 10 మంది టీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్టు చేసి స్థానిక తహసీల్దార్ ఎదుట హాజరుపరిచారు. డివిజన్ వ్యాప్తంగా 115 మంది తెలంగాణవాదులను అదుపులోకి తీసుకోవడం పట్ల తెలంగాణవాదులు మండిపడుతున్నారు.