December 29, 2012

తెలంగాణపైన స్పష్టంగా ఉన్నాం



 
పరకాల: 'తెలంగాణపై స్పష్టమైన వైఖరిని వెల్లడించాం.. టీడీపీ ఏనాడూ తెలంగాణకు వ్యతిరేకం కాదు.. 2008 లో ప్రణబ్‌ముఖర్జీకి ఇచ్చిన లేఖలో తె లంగాణకు అనుకూలంగా పేర్కొ న్నాం.. త్వరగా తెలంగాణ అంశాన్ని పరిష్కరించాలని కేంద్రాన్ని కోరాం.. ఇ వి జీర్ణించుకోలేక కేసీఆర్ చేస్తున్న విమర్శలకు ధీటుగా సమాధానం ఇవ్వాలి..' అని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. జిల్లాలోని చి ట్యాల మండలం వెల్లంపల్లి గ్రామానికి శుక్రవారం రాత్రి 'వస్తున్న మీకోసం' పాదయాత్ర చేరుకుంది. ఈ సందర్భం గా ప్రజలు, అభిమానులు పెద్దఎత్తున కరీంనగర్, వరంగల్ జిల్లాల సరిహద్దు ప్రాంతానికి తరలివెళ్లి ఘనస్వాగతం పలికారు. అనంతరం పార్టీ నాయకుల తో ప్రత్యేకంగా బస్సులో ఏర్పాటు చేసి న సమావేశంలో బాబు చర్చించారు.

సమావేశంలో ఏం జరిగింది..

పార్టీ నాయకుల ద్వారా అందిన సమాచారం ప్రకారం వివరాలిలా ఉ న్నాయి. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణపై స్పష్టమైన వైఖరిని వెల్లడించ డం జరిగిందని, దీనిని తట్టుకోలేకనే కేసీఆర్ టీడీపీపైన విమర్శలు చేస్తున్నారని చంద్రబాబునాయుడు పేర్కొన్నా రు. 2008లో ప్రణబ్‌ముఖర్జీకి తెలంగా ణకు అనుకూలంగా ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నామని తెలిపారు. అయితే తెలంగాణలో తమ ఉనికి ఎక్కడ కోల్పోతామోననే భయం తో కేసీఆర్ టీడీపీపైన విమర్శలు చేస్తున్నారని, దీనికి ధీటుగా టీడీపీ శ్రేణులు సమాధానం ఇవ్వాలన్నారు.

టీడీపీ వైఖరిపై అన్నిపార్టీలు హర్షిస్తున్నాయని, ఇతర పార్టీల ఎంపీలు సైతం టీడీపీ వైఖరి బాగుందని చెప్ప డం నిదర్శనమని బాబు పేర్కొన్నట్లు తెలిసింది. కేసీఆర్ టీడీపీపైన చేస్తున్న విమర్శలకు ధీటుగా సమాధానం ఇవ్వాలన్నారు.

కాంగ్రెస్‌పార్టీయే తన వైఖరిని వెల్లడించకుండా సమస్య నాన్చుతుందని పేర్కొన్నారు. కాగా, పార్టీ బలోపేతాని కి నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలన్నారు. ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు చేస్తున్న పాదయాత్రకు అనూహ్య స్పందన లభిస్తుందని, ప్రజాసమస్యలను దగ్గరుండి తెలుసుకునే అవకాశం లభిస్తుందని బాబు పేర్కొన్నట్లు తెలిసింది.

ఆదివారం నుంచి ప్రతిరోజు ఒక నియోజకవర్గానికి సంబంధించి రివ్యూ నిర్వహించనున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. ఉదయం లేదా లంచ్ సమయంలో ఈ రివ్యూ ఉంటుందని, ని యోజవర్గానికి సంబంధించిన పార్టీ పరిస్థితులు, ఇతర అంశాలపైన చర్చించేందుకు నాయకులు సిద్ధంగా ఉండాలని బాబు సూచించారు. నియోజకవర్గ ఇన్‌చార్జిలతోపాటు సమన్వయ కమిటీ సభ్యులు హాజరు కావాలని బా బు సూచించినట్లు తెలిసింది.

ఈ సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్‌రెడ్డి, సీతక్క, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎ.బస్వారెడ్డి, పరకాల, భూపాలపల్లి, వర్ధన్నపేట నియోజకవర్గ ఇన్‌చార్జిలు చల్లా ధర్మారెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, ఈగ మల్లేశం, నాయకులు పూజారి సుదర్శన్‌గౌడ్, దొనికెల మల్ల య్య తదితరులు పాల్గొన్నారు.