December 29, 2012

టీడీపీ ఆనందం..టీఆర్ఎస్ ఆగ్రహం



తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై అఖిలపక్ష సమావేశంలో తెలుగుదేశం పార్టీ మరోసారి స్పష్టమైన వైఖరి తెలిపిందంటూ పార్టీ నాయకులు శుక్రవారం సంబరాలు జరుపుకున్నారు. హన్మకొండలోని అంబేద్కర్ విగ్రహం సెంటర్ వద్ద బాణసంచా పేల్చి నినాదాలు చేశారు. అంతకుముందు టీ-టీడీపీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు గృహానికి చేరుకుని స్వీట్లు పంచి ఆనందాన్ని చాటుకున్నారు.

అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ ప్రతినిధులు తెలంగాణపై సానుకూల వైఖరి స్పష్టం చేయలేదని ఆరోపిస్తూ శుక్రవారం టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. పలుచోట్ల సోనియాగాంధీ, సుశీల్‌కుమార్ షిండే, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ అధినేత వైఎస్ జగన్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. బీజేపీ, సీపీఐలతో సహా వివిధ ప్రజాసంఘాలు, పీడీఎస్‌యు, టీఆర్ఎస్‌వీ తదితర విద్యార్థి సంఘాలు కూడా ఈ నిరసనల్లో పాలుపంచుకున్నాయి.

అఖిల పక్ష సమావేశం వేదికగా కాంగ్రెస్, టీడీపీ వైసీపీలు మరోసారి తెలంగాణ ప్రజల ను మోసం చేసినందుకు నిరసనగా శనివారం చేపట్టిన తెలంగాణ బంద్‌ను జిల్లాలో విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి, రాజకీయ, ప్ర జా సంఘాల జిల్లా జేఏసీ సంయుక్తం గా ప్రజలకు పిలుపునిచ్చాయి. తెలంగాణ ఏర్పాటుకు అడ్డంకిగా ఉన్న ఆ మూడు పార్టీలను బొందపెట్టాలని విజ్ఞప్తి చేశాయి. బంద్‌ను పూర్తి స్థాయి లో సఫలం చేయడానికి అన్ని వర్గాల జేఏసీలు నిమగ్నం కావాలని కోరాయి. తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అద్దం పట్టకుండా వ్యతిరేకంగా వ్యవహరించి న సోనియాగాంధీ, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబునాయుడు, జగన్, విజయలక్ష్మిల దిష్టిబొమ్మలను బంద్ సందర్భంగా దహనం చేయాలని కోరాయి.

హన్మకొండలోని టీఆర్ఎస్ కార్యాలయంలో శుక్రవారం ఆ పార్టీ జిల్లా కన్వీనర్ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, జేఏ సీ జిల్లా చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, ఉద్యోగ సంఘాల నాయకులు విలేకరులతో మాట్లాడారు. 'కాంగ్రెస్ మోసం చేసింది... టీడీపీ పాత సీసాలో కొత్త సా రా నింపింది... జగన్ పార్టీ సమైక్యతను చాటింది.' అంటూ విరుచుకుపడ్డారు. అఖిల పక్షంకు హాజరయ్యే నాయకుల్లో తెలంగాణ నుంచి సురేష్‌రెడ్డిని ఎంపిక చేయడంలోనే అధికార కాంగ్రెస్ కుట్ర దాగి ఉందని ఆరోపించారు. తెలంగా ణ ఉద్యమంలో ఏ మాత్రం పాత్ర లేని సురేష్‌రెడ్డిని ఎంపిక చేయడం వెనుక ప్రజల ఆకాంక్షను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పట్టించుకోలేదని విరుచుకుపడ్డారు.

గతంలో ఇచ్చిన లేఖనే సీల్డ్‌కవర్ ద్వారా మళ్లీ ఇచ్చిన టీడీపీ తెలంగాణ పట్ల పాత పాటనే పాడిందని విమర్శించారు. తెలంగాణ ఆకాంక్షను గౌరవిస్తామనే తియ్యటి మాటతో ఈ ప్రాంత ప్ర జలపై జగన్ పార్టీ విషం కక్కిందని తూర్పార పట్టారు. తెలంగాణ అంశం లో కేంద్రం తీసుకున్న నిర్ణయానికి క ట్టుబడి ఉంటామంటూ జగన్ పార్టీ ప్ర దినిధులు చెప్పడాన్ని తీవ్రంగా ఖండించారు.సమావేశంలో టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు రాజేష్‌కుమార్‌గౌడ్‌తోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

పలు వర్గాల మద్దతు...

బంద్‌కు సీపీఐ,బీజేపీ,కేయూ విద్యా ర్థి జాక్, నవ తెలంగాణ, టీజీఏ రాష్ట్ర అధ్యక్షుడు మర్రి యాదవరెడ్డి బంద్‌కు మద్దతు ప్రకటించారు. విద్యా, వ్యాపా ర సంస్థలు బంద్‌కు సహకరించాలని విజ్ఞప్తి చేశాయి. అదే విధంగా ఉద్యోగు లు బంద్‌లో భాగస్వాములవుతారని ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రకటించింది. అలాగే బంద్‌కు తెలంగాణ ఆటో సం ఘాలు మద్దతు ప్రకటించా యి. ఈ వి షయాన్ని జిల్లా వ్యాప్తంగా డ్రైవర్లు గ మనించి బంద్ జయప్రదం చేయడానికి సహకరించాలని తెలంగా ణ ఆటో డ్రైవర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు గుడిమల్ల రవికుమార్ విజ్ఞప్తి చేశారు.