December 29, 2012

బాబూ మా గోడు విను




(పరకాల)

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పాదయాత్ర చేయబోయే పల్లెలు సమస్యలతో సతమతమవుతున్నాయి. బాబు యాత్రతోనైనా తమ సమస్యలు ప్రభుత్వం దృష్టికి వెళతాయని ప్రజలు ఆశిస్తున్నారు. శనివారం బాబు యత్ర సాగే ఆరు గ్రామాల్లో నెలకొన్న సమస్యలు ఇలా వున్నాయి...

వెల్లంపల్లిలో...

* ఫ్లోరైడ్ నీటితో ప్రజలు అవస్థలు పడుతున్నారు.

* 350 కుటుంబాలు ఉన్న తాగునీరు లేక తండ్లాడుతున్నాయి.

* అంతర్గత రోడ్లు అధ్వానంగా ఉన్నాయి.

దుబ్యాలలో...

* దుబ్యాల నుంచి కరీంనగర్ జిల్లా వావిలాల వరకు రోడ్డు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు.

* రెండు గ్రామాల మధ్య హైలెవల్ వంతెన ఏర్పాటు కలగానే మిగిలిపోయింది.

* దుబ్యాల నుంచి గుమ్మడవెల్లి, గోపాలపూర్, ఆకినపల్లి గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేదు.

* ఆకినపల్లి-దుబ్యాల మధ్య వాగుపై హైలెవల్ వంతెన ఏళ్ల తరబడి ఎదురుచూస్తోంది.

రాఘవరెడ్డిపేటలో....

* మొగుళ్లపల్లి మండలం రాఘవరెడ్డిపేట-చిట్యాల మండలం టేకుమట్ల మధ్య హైలెవల్ వంతెనకు నిధులు మంజూరైనా పనులు ప్రారంభంకాలేదు.

* వర్షాకాలంలో వాగు ఉధృతికి ప్రజ లు ఇబ్బందులు పడుతున్నారు.

* అంతర్గత రోడ్లు అధ్వానంగా ఉన్నాయి.

* నీలం తుఫాన్, కరెంట్ కోతల వల్ల పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారు.

టేకుమట్లలో...

* టేకుమట్ల గ్రామ నడిబొడ్డున ఉన్న చెరువు మురికినీరుతో కలుషితం కావడంతో వ్యాధులు ప్రబలుతున్నాయి.

* 162 చేనేత కుటుంబాలు ఉపాధి లేక పస్తులుంటున్నాయి.

* ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందక చేనేత కుటుంబాలు వీధిన పడుతున్నాయి.

అంకుషాపురంలో...

* ఫ్లోరైడ్ వాటర్‌తో ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు.

* చలివాగు నుంచి లిఫ్ట్ ద్వారా తాగునీరు అందించాలని ప్రజలు ఏళ్ల తరబడి చేస్తున్న డిమాండ్ నెరవేరడం లేదు.

* ఆర్టీసీ బస్సు అంటే ఈ గ్రామ ప్రజలకు తెలియదు.

* రోడ్లు అధ్వానంగా ఉండటంతో కాలినడక కూడా కష్టమే.

సుబ్బక్కపల్లిలో...


* తాగునీటికి ప్రజలు ప్రతి కాలంలోనూ తల్లడిల్లాల్సిందే.

* ఫ్లోరైడ్ వాటర్‌తో ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు.