July 8, 2013

పంచాయతీ ఎన్నికలే కీలకం

గ్రామ పంచాయతీలపై పసుపు జెండాలు రెపరెపలాడాలి
టీఆర్‌ఎస్‌ వసూల్‌ రాజా పార్టీ
2014 ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీతో గెలుస్తాం
ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రాంతీయ సదస్సులో చంద్రబాబు నాయుడు

రానున్న పంచాయతీ ఎన్నికలే అత్యంత కీలకం. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ బలపర్చిన అభ్యర్థులను మెజార్టీతో గెలిపించాలి. పట్టుదలతో ఉన్నాం. సంకల్పం నెరవేరే వరకు కదం తొక్కుదాం. సైకిలు జోరుకు అడ్డుపడితే తొక్కించి మరీ ముందు కు సాగాలని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆదివారం కాజీపేట బిషప్‌ బెరెట్టా మైదానం లోని కాకతీయ ప్రాంగణంలో జరిగిన వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాల ఉత్తర తెలంగాణ ప్రాంతీయ సదస్సులో చంద్రబాబు మాట్లాడారు. ఈ యేడాదంతా ఎన్ని కల కాలమని, ఆయుధం మీ వద్దనే ఉందని, ఉత్సాహంతో ముందుకు సాగుతూ తెదేపా బలోపేతానికి ప్రతీ కార్యకర్త కృషి చేయాల్సిన అవస రం ఉందన్నారు.

ఉద్యమాన్ని అడ్డుపెట్టుకు ని వసూల్‌ రాజా పార్టీగా టీఆర్‌ఎస్‌ మారిందన్నారు. ఉద్యమం ముసుగులో టిక్కెట్లు అమ్ము కుంటున్నారని అన్నారు. ఇక పిల్ల కాంగ్రెస్‌కు (వైఎస్సార్‌సీపీ) ఓట్లేస్తే బెయిల్‌ కోసం తాకట్టు పెడతారని విమర్శించారు. సామాజిక న్యాయం పేరుతో పుట్టిన పార్టీ కాంగ్రెస్‌లో కలిసి పోయిందని, పిల్ల కాంగ్రెస్‌ కూడా కాంగ్రెస్‌లో కలిసిపోయే పార్టీయేనని చంద్రబాబు అన్నారు. కాంగ్రెస్‌ సార్టీ గ్రామీణ స్థాయి నాయకత్వాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని అన్నారు. 73, 74 అధికరణల ప్రకారం స్థానిక సంస్థలకు సకాలంలోఎన్నికలు నిర్వహించాలనే నిబంధనలు కాలరాసి స్థానిక సంస్థలను పూర్తిగా విస్మరించి నిర్వీర్యం చేశారని అన్నారు.

ఈ ప్రభుత్వానికి ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచన లేదని, కోర్టు మొట్టికాయలు వేస్తే ఈ ప్రభుత్వాలకు జ్ఞానోదయం కలగదని విమర్శించారు. వీరి నిర్వాకం వల్ల రూ. 4వేల కోట్లు మురిగి పోయాయని అన్నారు. తెదేపా హయంలో స్థానిక సంస్థలను బలోపేతం చేశామని అన్నారు. 94లో 8వేల కోట్ల బడ్జెట్‌ ఉండగా, 2004లో రూ. 25వేల కోట్లు బడ్జెట్‌తో మంచి పరిపాలన అందించామన్నారు. ప్రస్థుత బడ్జెట్‌ రూ. 1.65 లక్షల కోట్ల బడ్జెట్‌ ఉన్నా ఏ ఒక్క అభివృద్ధి జరగలేదని, ఆ డబ్బంతా కాంగ్రెస్‌ పందికొక్కుల్లా మెక్కారని ఆరోపించారు. కాంగ్రెస్‌ దొంగాటకం, దోబూచులాట ఆడుతోందన్నారు. 9 ఏళ్ల కాంగ్రెస్‌ ప్రభుత్వ కాలంలో అన్ని విధాలుగా రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారని అన్నారు. గ్రామ పంచాయతీలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయని అన్నారు.

రాష్ట్రంలో పాలన పూర్తిగా స్తంభించి పోయిందన్నారు. ఎరువు లు, విత్తనాల ధరలు పెరిగి పోయాయన్నారు. సబ్సిడీలు పూర్తిగా తగ్గించేశారని అన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయని అన్నారు. అమ్మహస్తం పథకం అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని, అమ్మహస్తం మొండిహస్తంగా మారిందని ఎద్దేవా చేశారు. ఆహార భద్రత అంటూ ఓట్ల భద్రత కోసం హడావుడిగా చట్టం తీసుకొస్తున్నారని అన్నారు. 100 రోజుల్లో ధరలు తగ్గిస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ ధరలు తగ్గించపోగా ధరలు పెంచి పేదలు జీవనం సాగించలేని స్థితికి తీసుకొ చ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. దీపం పథకాన్ని ఆర్పేశారని అన్నారు. తెదేపా అధికారంలోకి వస్తేనే మళ్లిd దీపం వెలుగుతుందన్నా రు. బంగారుతల్లి అంటూ గతంలో తమ ప్రభుత్వం అమలు చేసిన బాలిక సంరక్షణ పథకాన్ని గొప్పగా చెప్పుకుంటున్నారని అన్నారు. అన్ని పథకాలు తమవేన్నా రు. వాటి పేర్లు మార్చి గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు.

తెలంగాణకు అనుకూలం..

తెలంగాణకు అనుకూలమని అనుకూలమని చంద్రబా బు నాయుడు స్పష్టం చేశారు. తెలంగాణ కోసం అసువులు బాసిన అమరుల కుటుంబాలను తాము అధికారంలోకి వస్తే అన్ని విధాలుగా ఆదుకుం టామని అన్నారు. తెెలంగాణ ఉద్య మం లో పాల్గొన్న వారిపై ఉన్న పోలీస్‌ కేసులను ఎత్తివేస్తామ ని తెలిపా రు. అమరుల వీరుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం వచ్చేలా చూస్తామని బాబు అన్నారు. తెదేపా ప్రభుత్వ హయాంలోనే తెలంగాణలో అభివృద్ధి జరిగిందని అన్నారు. గోదావరి జలాలను వరంగల్‌ జిల్లాకు రప్పించిన ఘనత తమ పార్టీకే దక్కుతుందని అన్నారు. ఎంజీఎం ఆసుపత్రిని నిమ్స్‌ తరహాలో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిగా మార్చుతామన్నా రు. ఈ ప్రాంతీయ సదస్సులో ఎంపీలు నామ నాగేశ్వరరావు, రమేశ్‌ రాథోడ్‌, గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశరెడ్డి, సత్యవతిరాథోడ్‌ తదితరులు పాల్గొన్నారు.