June 29, 2013

అప్పనంగా వేల ఎకరాలు కట్టబెట్టారు


నెల్లూరు జిల్లాలో థర్మల్‌ విద్యుత్‌ సంస్థలకు వైఎస్‌, రోశయ్య హయాంలో వేల ఎకరాల భూములను అప్పనంగా కట్టబెట్టారని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు. నవయుగ, మీనాక్షి, కెనాటో, సింహపురి సంస్థలకు ఎకరా భూమి కేవలం 80 వేల రూపాయలు అంతకంటే కారు చౌక ధరకే కేటాయించారన్నారు. అదే సుబ్బారామిరెడ్డికి చెందిన గాయత్రి సంస్థకు మాత్రం ఎకరా భూమి ఎనిమిదిన్నర లక్షల చొప్పున వసూలు చేశారన్నారు. శుక్రవారం ఎన్టీఆర్‌ట్రస్టుభవన్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేపీఐఎల్‌కు 4700 ఎకరాల భూమిని వైఎస్‌ హయాంలో నోటి మాటగా కేటాయిస్తే, సాక్షి పత్రిక బుకాయిస్తోందని విమర్శించారు.

రెండు ఎకరాల భూమి కంటే ఎక్కువ కేటాయిం పులకు మంత్రివర్గ అమోదం తప్పనిసరన్నారు. కేపీఐఎల్‌కు కేటా యించిన భూముల్లో నుండి 100 ఎకరాలు తనఖా పెట్టి 800 వందల కోట్ల రూపాయల రుణాన్ని తీసుకున్నారన్నారు. అందులో నుండి 400 కోట్ల రూపాయలు జగన్‌కు ముడు పుల రూపంలో చెల్లించారని ఆరోపించారు. క్విడ్‌ప్రొకో పద్దతి లో హిమూర్జ ప్రాజెక్టు ద్వారా మరో 200 కోట్ల రూపాయల విలువ చేసే వాటాలను వైఎస్‌ భారతికి కేటాయించారన్నారు. లక్ష కోట్ల రూపా యలు దోచుకున్న జగన్‌ కుటుంబం ఉత్తరాఖండ్‌ బాధితులకు ఒక్క రూపాయ సహాయం చేసేందుకు ముందుకు రాలేదని విమర్శించారు.