June 29, 2013

దేవుడల్లే చంద్రబాబు సాయపడ్డారు


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చొరవతో డెహ్రాడూన్ నుంచి ప్రత్యేక విమానం హైదరాబాద్‌కు, అక్కడ నుంచి కేశినేని నాని తన ట్రావెల్ బస్సుల ద్వారా ఇప్పటి వరకు మొత్తం 125 మందిని క్షేమంగా చేర్చారు. గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో బయలు దేరిన బస్సు లో ఎక్కిన యాత్రికులను చంద్రబాబు నాయుడు, కేశినేని నాని అప్యాయంగా పలకరించారు. ప్రతి ఒక్కరిని పలకరించి, వారికి భోజనాలు ఏర్పాటు చేసి ఆరోగ్యంగా ఉందా అంటూ పలకరించి పంపించడం విశేషం. శుక్రవారం ఉదయం విజయవాడలో దిగిన యాత్రికులు అందరు కూడా ముక్త కంఠంతో చంద్రబాబు నాయుడును, కేశినేని నానిలకు కృతజ్ఞతలు తెలిపారు.

యాత్రికులకు ఉమా, గద్దె స్వాగతం
విజయవాడకు చెందిన 16 మంది, గుడివాడకు చెందిన 22 మంది, గుంటూరుకు చెందిన ముగ్గురు మొత్తం 41 మంది శుక్రవారం ఉదయం బస్సులో వచ్చారు. వీరికి ఎమ్మెల్యే దేవినేని ఉమా, మాజీ ఎంపీ గద్దె, మాజీ కార్పోరేటర్ ఎరుబోతు రమణ, చెన్నుపాటి గాంధీ, వీరంకి డాంగేకుమార్, రవీంద్ర వర్మ, కొట్టేటి హనుమంతరావు తదితరులు స్వాగతం పలికారు. యాత్రికులు వారి వారి స్వస్థలాలకు చేరేందుకు సహకరించారు. గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన రంగమ్మ, సిహెచ్ వెంకటలక్ష్మి, శాఖమూరి రుక్మిణి వచ్చారు. వీరిలో చాలామంది గంగోత్రి వద్ద ఏడురోజులు అన్నపానీయాలు లేకుండా గడిపారు. అక్కడి భయానక సంఘటన మనసును కలిచివేస్తున్నదని చాలా మంది వాపోయారు, శివరావు, సూర్యకుమారి, విజయలక్ష్మి, రత్తమ్మ, మొత్తం విజయవా డకు చెందిన 16 మంది వచ్చారు.