April 8, 2013

'విద్యుత్ ఉద్యమం తీవ్రతరం చేస్తాం'

సామర్లకోట: అప్రకటిత విద్యుత్ కోతతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంన్న దృష్ట్యా ప్రజా సమీకరణతో విద్యుత్ ఉద్యమం తీవ్రతరం చేస్తామని టీడీపీ నాయకులు హెచ్చరించారు. పార్టీ సామర్లకోట కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరు సమావేశంలో పార్టీ నాయకులు అడబాల కుమార స్వామి, మన్యం చంద్రరావు, అలమండ చినఅప్పారావు, కంటే జగదీష్ మోహన్, కమ్మిలి సుబ్బారావు, బడుగు శ్రీకాంత్ మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీలు పెంపుదలను నిరసిస్తూ చేపట్టిన ప్రజల సంతకాల పత్రాలను పార్టీ జిల్లా కార్యవర్గానికి సోమవారం అందజేయనున్నట్లు చెప్పారు. రోజుకు కనీసం పది గంటలు కూడా విద్యుత్ సరఫరా చేయకపోవడం ప్రభుత్వ అసమర్ధతకు నిదర్శనమన్నారు.

ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఏజే చక్రవర్తి, జట్ల మో హన్, చుండ్రు బలరామ్, గొల్తి సత్యనారాయణ, చందలాడ రాంబా బు, తాతపూడి కృషవంశీ, తాతపూడి కృషబాబు, దారబాని సూరిబాబు, కరికం గోపాలం, సొసైటీ ఉపాధ్యక్షులు బావిశెట్టి చక్రం, బీబీ జాన్ పాల్గొన్నారు.