April 8, 2013

విద్యుత్ చార్జీల పెంపుపై టీడీపీ రాస్తారోకో

బెల్లంపల్లి : విద్యుత్ చార్జిల పెంపుకు వ్యతిరేకంగా టీడీపీ కాల్‌టెక్స్ ప్రధాన రహదారిపై గంట పాటు రాస్తారోకో నిర్వహించింది. టీడీపీ బెల్లంపల్లి నియోజకవర్గ ఇన్‌ఛార్జీ పాటి సుభద్ర ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి పాలన అవినీతి అక్రమాలతో సాగుతుందని విమర్శించారు.

విద్యుత్ ఛార్జీలు, సర్‌ఛార్జీలు పెంచి వేలాది కోట్లాది రూపాయల భారాన్ని పేద ప్రజలపై మోపారని టీడీపీ బెల్లంపల్లి నియోజకవర్గ ఇన్‌ఛార్జీ పాటి సుభద్ర అన్నారు. ఆదివారం టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు కొప్పుల లచ్చన్న, గెల్లి రాజలింగుల ఆధ్వర్యంలో పట్టణంలోని కాల్‌టెక్స్‌లో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నిత్యవసర సరుకుల ధరలను అరికట్టడంలో విఫలమైందని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యుత్ చార్జీలు పెంచారని విమర్శించారు. నాడు చంద్రబాబు పాలనలో 5129 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కాగా, రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం లేదని కొనియాడారు. ముఖ్యమంత్రి కిరణ్ పాలనలో రైతులకు 9 గంటలకు బదులు కేవలం 3 గంటలే విద్యుత్ సరఫరా చేయడంతో పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆమె ఆరోపించారు.

ప్రజలు చీకట్లో జీవించే పరిస్థితి వచ్చిందని టీడీపీ జిల్లా ఉపాద్యక్షులు కొప్పుల లచ్చన్న, గెల్లి రాజలింగు,ముర్కూరి చంద్రయ్య, సీనియర్ నాయకులు అడప పాపయ్య, జిలకర వాసు, జిల్లెల అశోక్‌గౌడ్, కొల్లూరి కిష్టయ్య, కాంపెల్లి రాజం పేర్కొన్నారు. అనంతరం పట్టణంలోని కాల్‌టెక్స్ ప్రధాన రహదారిపై గంట పాటు రాస్తారోకో నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ బెల్లంపల్లి మండల అద్యక్షుడు ఇప్ప రవి, నాయకులు మ ల్లయ్య, బలరాం, భాస్కర్, వేల్పులశంకర్, రవిగౌడ్, సోగాల సాగర్, నిచ్చకో ల్ల భాగ్యలక్ష్మీ, భగవాన్‌సింగ్, గీస రా జేశం, ఎస్‌కె ఇబ్రహీం, ఎస్‌కె వాజిద్‌పాల్గొ న్నారు.