April 8, 2013

టీడీపీలో పదవుల కోసం పోటీ

మంచిర్యాల:తెలుగుదేశం పార్టీలో పదవుల కోసం పోరు ప్రారంభమైంది. నియోజకవర్గ ఇన్‌చార్జీల పదవుల కోసం నేతల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. దీం తో నియోజకవర్గ ఇన్‌చార్జీల ఎంపిక వ్యవహారం అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది. ఇన్‌చార్జీలుగా నియమించి న వారికే శాసనసభా ఎన్నికల్లో పార్టీ టికెట్లు ఇచ్చే అవకాశం ఉండడంతో ప లువురు నేతలు ఇన్‌చార్జి పదవుల కో సం పోటీ పడుతున్నారు.

జిల్లాలో ఎంపీ రాథోడ్ రమేష్, పార్టీ జిల్లా అధ్యక్షుడు గోడం నగేష్, సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే గోనె హన్మంతరావుతో ఆశావహులు మంతనాలు జ రుపుతూ ఇన్ చార్జి పదవి దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి ని యోజకవర్గాలకు చెందిన పార్టీ సమన్వయ కార్యకర్తల సమావేశాన్ని మం చిర్యాలలో ఏర్పాటు చేయగా, గ్రూపు తగాదాలు బహిర్గతమయ్యాయి. దీంతో మంచిర్యాల, చెన్నూర్, ఆసిఫాబాద్ ఇన్‌చార్జీల నియామకాన్ని వాయి దా వేశారు.

తెలుగుదేశం పార్టీ జిల్లా ఇన్‌చార్జీ మండవ వెంకటేశ్వర్‌రావుతో పాటు ఎంపీ రాథోడ్ రమేష్, జిల్లా అ ధ్యక్షుడు నగేష్ సమావేశాన్ని నిర్వహిం చి ఇన్‌చార్జీలను నియమించేందుకు ప్రయత్నించగా, మెజార్టీ నాయకులు కొందరి పేర్ల ను వ్యతిరేకించారు. దీం తో మూడు నియోజకవర్గాల ఇన్‌చార్జీల నియామకాన్ని వాయిదా వేశారు. కేవలం బెల్లంపల్లి ఇన్‌చార్జీగా డాక్టర్ పాటి సుభద్రను నియమించారు. ఒక వైపు స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండగా, పార్టీ అధిష్టానం నియోజకవర్గాల ఇన్ చార్జీల నియామకాల్లో జా ప్యం చేస్తున్నందు వల్ల నాయకులు, కా ర్యకర్తలు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు.

జిల్లాలోని తూర్పు ప్రాంతం లో తెలుగుదేశం పార్టీ గతంలో బలోపేతం గా ఉండగా, ఇటీవలి కాలంలో జరిగిన వలసల కారణంగా బలహీనపడింది. మంచిర్యాల నియోజకవర్గ ఇన్ చార్జీ పదవి కోసం టీడీపీకి చెందిన సీనియర్ నాయకులు నల్మాస్ కాంతయ్య, ఎం వినయ్‌ప్రకాష్‌రావు, బెల్లంకొండ మురళీధర్ రావు, కేవీ ప్రతాప్, కొండేటి సత్యం, డాక్టర్ రఘునందన్, జక్కుల రాజేశం, గాజుల ముకేష్‌గౌడ్ పోటీ ప డుతున్నారు. మాజీ ఎమ్మెల్యే గోనె హ న్మంతరావుకు సన్నిహితుడైన ముకేష్ గౌడ్‌ను ఇటీవల తెలుగు యువత జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. మొదటి నుంచి మంచిర్యాల నియోజకవర్గ ఇన్ చార్జి పదవిపై ఆశలు పెట్టుకుని, రా బోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సి ద్ధపడ్డ ముకేష్‌గౌడ్‌కు తెలుగు యువత జిల్లా అధ్యక్ష పదవిని కట్టబెట్టి ఆయన ఆశలపై నీళ్లు చల్లారు.

చెన్నూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి కోసం అందుగుల శ్రీనివాస్, సంజయ్‌కుమార్ తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఆసిఫాబాద్‌లో ఇన్ చార్జ్జి పదవి కోసం సీనియర్ నాయకు లు అరిగెల నాగేశ్వర్‌రావు, ఆత్రం భగవంతరావు పోటీ పడుతున్నారు.