April 8, 2013

రేపటి బంద్‌ను విజయవంతం చేయాలి: టీడీపీ

చిత్తూరు టౌన్: రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీలను పెంచడాన్ని నిరశిస్తూ టీడీపీ ఆధ్వర్యంలో 9వ తేదీన నిర్వహించనున్న రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు జంగాలపల్లె శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి గౌనివారి శ్రీనివాసులు, అధికార ప్రతినిధి వి.సురేంద్ర కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో ప్రజలకు పిలుపు నిచ్చారు. రాష్ట్ర ప్రజలపై రూ.6,500 కోట్ల విద్యుత్ చార్జీల అదనపు భారాన్ని మోపిన ప్రభుత్వం కేవలం రూ.840 కోట్లు మాత్రమే తగ్గిస్తామని ప్రకటించడం ఎంత వరకు న్యాయమని వారు ప్రశ్నించారు.

మొక్కుబడిగా 200 యూనిట్ల వరకు ధరను పెంచలేదని, 200 యూనిట్లు దాటితేనే చార్జీలు పెంచామని సీఎం ప్రకటించడం హాస్యాస్పదంగా వుందన్నారు. విద్యుత్ చార్జీల పెంపుపై ప్రభుత్వ తీరును నిరశిస్తూ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు 9వ తేదీన నిర్వహించనున్న రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయడానికి అన్ని వర్గాల ప్రజలు, వ్యాపారులు, విద్యా సంస్థల యాజమాన్యాలు సహకరించాలని వారు కోరారు.