March 11, 2013

అధికారంలోకి వస్తే... రుణాలు మాఫీ


ఇంద్రవెల్లి : వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాగానే రైతుల రుణమాపీ చేయనున్నట్లు ఆదిలాబాద్ ఎంపీ రాథోడ్ రమేష్ అన్నారు. ఆదివారం మండలంలోని దొడంద, డోం గ్రగాం, కేస్లాపూర్ తదితర గ్రామాల్లో పర్యటించి ఆ పార్టీ జెండాను ఆ విష్కరించారు. ప్రజల సమస్యలను తెలుసుకోనేందుకు చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో అవినీతి రాజ్యమేలిందన్నారు.

ఎరువుల, విత్తనాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని అన్నారు. పంటకు గిట్టుబాటు ధర కల్పించడం లేదన్నారు. ఘాట్ రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. డోంగర్ గాంలో రూ. 15 లక్షతో బ్రిడ్జి నిర్మాణం చేపట్టేందుకు హామీ ఇచ్చారు. గోండుగూడలో శివాలయ నిర్మాణానికి రూ. 50 వేలు అందిస్తానన్నారు. కార్యక్రమంలో దిలిప్ మోరె, నాయకులు కనక తుకారాం, ఆడేధన్‌లాల్, మసూ ద్, భారత్ బామ్నే, విజయ్‌కుమార్, రోహిదాస్, ఇందుబాయి పాల్గొన్నారు.