March 11, 2013

ప్రజలపై పెట్రో వాతలు

భీమవరం/భీమవరం అర్బన్/పాలకోడేరు : చంద్రబాబు నాయుడు స్వయంగా పెట్రోల్ ఫిస్టన్ పట్టుకుని బైకులకు పెట్రోల్ పంపింగ్ చేస్తే రెండు లీటర్లు ఫ్రీ.. ఆశ్చర్యపోకండి ఇదంతే. భీమవరం పట్టణంలో సోమవారం రాత్రి పాదయాత్ర నిర్వహించిన చంద్రబాబు పద్మాలయ థియేటర్ పక్కన ఉన్న పెట్రోల్ బంకులోకి వెళ్ళారు. ఇంతలో సూర్యనారాయణ అనే వ్యక్తి బైకుతో వచ్చాడు. బాబు పెట్రోల్ ధరలు ఎలా పెరుగుతున్నాయంటూ ప్రశ్నించారు. నెలకోసారి పెంచుతున్నారు సార్.. చాలా దారుణంగా ఉంది అం టూ బదులిచ్చారు. ఈ ప్రభుత్వం పెట్రోల్ ధరలతో మోత మోగిస్తూ ప్రజలకు వాతలు పెడుతోందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. అతనికి పెట్రోల్ కొట్టారు. తదుపరి అతనికి కొట్టిన రెండు లీటర్ల పెట్రోల్‌కు చంద్రబాబు బిల్లు కట్టారు. ఇదీ చంద్రబాబు పెట్రోల్ కథ.

విద్యుత్ కోతతో ఉపాధి కరువు..చంద్రబాబు వద్ద మెకానిక్ గోపీ ఆవేదన

జువ్వలపాలెం రోడ్డులో నడుస్తున్న చంద్రబాబు ఆ సమీపంలో ఉన్న మెకానిక్ షెడ్‌లోకి వెళ్ళారు. పనులు ఎలా ఉన్నాయంటూ మెకానిక్ గోపీని ప్రశ్నించారు. కరెంట్ లేక ఎటువంటి పనులు చేసుకోలేకపోతున్నామంటూ ఆ మెకానిక్ వాపోయాడు. ఈ విద్యుత్ కోత వల్ల ఒక్కొసారి ఆదాయం కూడా ఉండడం లేదంటూ చెప్పాడు. మెకానిక్ చేసే పనుల్లో వచ్చే ఆదాయం గురించి చంద్రబాబు ప్రశ్నించారు. ఇబ్బందులతో కూడి ఉందంటూ ఆ మెకానిక్ బదులిచ్చాడు. షెడ్‌లో పరికరాలను చంద్రబాబు పరిశీలించారు.

బాల అల్లూరితో చంద్రబాబు..

అడ్డవంతెన ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు వేషం వేసిన చిన్నారిని చంద్రబాబు ఎత్తుకున్నారు. సీతారామరాజు వేషంలో ఆ బాలుడిని వారు కుటుంబ సభ్యులు తీసుకురాగా చంద్రబాబు ఆసక్తిగా ఎత్తుకున్నారు. అంతకు ముందే చంద్రబాబు తన ఉపన్యాసంలో అల్లూరి సీతారామరాజు స్ఫూర్తి పొం దాలంటూ విద్యార్థులకు పిలుపునిచ్చారు. తరువాత పాదయాత్ర సాగిస్తుండగా అల్లూరి వేషధారణలో చిన్నారి కన్పించగా అప్యాయం గా ఎత్తుకుని ముద్దాడారు.