March 11, 2013

చంద్రబాబు నిజమైన లీడర్

(ఒంగోలు కార్పొరేషన్):దేశంలో దొంగలు పడ్డారు... నేటి భారతం... వంటి సినిమాలతో నేటి పరిస్థితులను మహానుభావుడు టి.కృష్ణ ఆనాడే చెప్పారు..ఆయన దర్శకత్వంలో ఈతరం పిక్చర్స్ బ్యానర్‌లో నటించిన తర్వాత సినీ కేరీర్‌లో అనుకోని మార్పు, ఆదరణ, అభిమానం లభించింది. ప్రస్తుత రాజకీయాల్లో చంద్రబాబు నిజమైన లీడర్. తనకు రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన ప్రస్తుతం లేదని సినీ హీరో సుమన్ తెలిపారు. ఒంగోలులోని రైలు పేటలో శ్రీ నేతాజీ కళాశాల 7వ వార్షికో త్సవ వేడుకలకు వచ్చిన సుమన్ ఆంధ్ర జ్యోతితో ముచ్చటించారు.

ఒంగోలుతో అనుబంధం మరువలేనిది

అప్పటి వరకు ఆరు ఫైట్లు ఆరు పాట లతో బిజీ హీరోగా ఉన్నాను. ఆ సమయం లో రెండు ఫైట్లు, నాలుగు బ్యాగ్రౌండ్ పాటలతో సినిమా అన్నారు. ఆలోచించా ను. కానీ పెద్దవారు ఎమ్మెస్ రెడ్డి కృష్ణ గురించి గొప్పగా చెప్పటంతో ఒప్పేసు కున్నాను. ఆ తర్వాత తెలిసింది కృష్ణ సత్తా...ఒంగోలు గొప్పతనం. ఆ అనుబం ధం మరిచిపోలేనిది.

పైలట్ అవ్వాలనుకున్నా...


వాస్తవంగా కరాటే, మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందుతూ పైలట్ అవ్వాలని పదేపదే కలలు కన్నాను. కానీ చెన్నైలో కారు మెకానిక్, ప్రస్తుతం కిట్టు ట్రావెల్స్ కిట్టు నాకు మంచి మిత్రుడు. ఆయనకు సినిమాలపై మోజు...కానీ అవకాశాల్లేవ్. ఎందుకంటే మెకానిక్. అయితే తనను హీరోలా ఉన్నావంటూ పదే పదే ప్రోత్స హించాడు. అలా 48 గంటల్లోనే అవకాశం రావడం అంతా అదృష్టం.

అన్నమయ్యకు అవార్డు వస్తుందనుకున్నా...


కృష్ణుడు పాత్రకు ఎన్టీఆర్, రాముడు పాత్రకు ఏఎన్నార్, వేంకటేశ్వర స్వామి పాత్రకు సుమన్ ప్రస్తుతం ఇదీ ప్రేక్షకుల మనస్సులో భావన. అయితే కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం కల్పించిన అన్నమయ్య చిత్రం మరి చిపోలేని అనుభూతి అందరు మెచ్చినా అవార్డు రాకపోవడం బాధ కలిగించింది. అయితే ఆ బాధ కొద్ది రోజులే. అన్నయ్య చిత్రాన్ని అప్పటి భారత రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ స్వయంగా సీడీ తెప్పించి చూడటం. అంతే కాకుండా వెంకటేశ్వర స్వామి పాత్ర వేసిన నన్ను పక్కనే కూర్చో పెట్టుకుని సినిమా మూడుగంటలు చూశా రు. పాత్రలో నటనకు పదే పదే మెచ్చుకు న్నారు. అంతకన్నా ఆనందం ఏముంది.

చిన్న సినిమాలు బతకాలి

ప్రస్తుతం సినిమా థియేటర్లు నలుగు రు, ఐదుగురు చేతుల్లోనే ఉంది. అయితే ఆ విధానం మారాలి. చిన్న నిర్మాతలు బతకాలి. వారసత్వ నటన తప్పేమీ కాదు. నాడు వంద రోజులు సినిమా కోసం ఆశపడేవారు. ప్రస్తుతం వారం, ఒక రోజు, గంటలు...ఇలా మారింది పరిస్థితి. మొద టి వారంలోనే హిట్... ఫట్... టాక్...

త్వరలోనే 100వ చిత్రం

ఇప్పటి వరకు 99 చిత్రాలలో వివిధ పాత్రలు పోషించాను. అన్నింటిలోనూ సంతృప్తి మిగిలింది. త్వరలోనే 100వ చిత్రంలో నటించబోతున్నాను. ఆ చిత్రం మన దేశ నాయకులు స్వాతంత్య్రం కోసం చేసిన త్యాగాలు, మన దేశాన్ని కాపాడేం దుకు సైనికులు పడుతున్న పాట్లు వివరి స్తూ ఉండాలి. సామాన్యుడు చల్లగా ఉండలాంటే రైతన్న సంతోషంగా ఉండా లి. అందుకే ఓ చత్రపతి శివాజీ, రవీంద్ర నా«థ్ ఠాగూర్...ఇలా ఉండొచ్చు. అయితే ఫిల్మ్ డాక్యుమెంటరీ కాదు. కమర్షియల్ చిత్రమే..

చంద్రబాబు నిజమైన లీడర్...

ప్రస్తుతం రాజకీయ ఆలోచన లేదు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నిజమైన లీడర్. ఆ మాట ఆయనతోనే అప్పట్లో చెప్పాను. విజన్, రాష్ట్ర ప్రజల సంక్షేమం చంద్రబాబుతో సాధ్యమని పలుమార్లు చెప్పాను కూడా. కానీ అలా అనీ నేనేమీ రాజకీయాల్లో రావడం లేదు.