March 10, 2013

స్వార్థపరుడిని కాను



ఏలూరు : 'నేను అధికారాన్ని అనుభవించినవాడినే. నేనేమీ స్వార్థపరుడిని కాను. మీ కష్టాలను చూసి ఒక కుటుంబంలో ఒక పెద్ద దిక్కుగా బాధపడుతున్నా. మీరు ఒక అవకాశమిస్తే మీ కష్టాలను, కన్నీళ్లను తుడిచేస్తా' అని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ప్రజల ముందు తన అభిమతాన్ని ఉంచారు. ఇప్పుడు ర్రాష్టంలో కరెంటుకు దిక్కులే దు. ఉపాధి లేదు. డ్వాక్రా మహిళలు ఇ బ్బందుల పాలవుతున్నారు. బెల్ట్‌షాపులతో కుటుంబాలు చితికిపోతున్నాయి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మీలో ఒకడిగా మీ కష్టాలను చూసే మొక్కవోని ధైర్యంతో పాదయాత్ర చేస్తున్నాన ని స్పష్టం చేశారు. తల్లికాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అంటూ కాంగ్రెస్‌ను, వై ఎ స్సార్‌సీపీని అభివర్ణిస్తూ వచ్చిన ఆయ న ఈ రెండు పార్టీలకు ఇంకో కొత్త పేరు పెట్టారు.

తల్లిపాము, పిల్లపాము గా దీనిని మార్పు చేశారు. పిల్లపాము కు విషం ఎక్కువ అంటూ జగన్ పా ర్టీని ఉద్దేశించి కామెంట్లు చేశారు. వ స్తున్నా మీకోసం పాదయాత్ర 160వ రోజైన ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో కొనసాగింది. ఆకివీడు నుంచి పెద్ద అమిరం వరకు 12 కిలోమీటర్లు సాగిన ఈ యాత్రలో చంద్రబాబు చలాకీగా వ్య వహరించారు. ఒడివడిగా అడుగులు వేశారు. అనేకచోట్ల తాను ప్రశ్నలు సం ధించి ప్రజల నుంచి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు. బెల్ట్‌షాపులు ఊరూరా పెట్టారు, మంచినీళ్లకు దిక్కులేదుగానీ మద్యం మాత్రం అన్నిచోట్లా దొరుకుతోందని దుయ్యబట్టారు. తాగి వచ్చి మీ భర్తలు ఎవరైనా కొడుతున్నారా అంటూ నేరుగానే మహిళలను ప్రశ్నించారు. ఇక కొడతం, గిడతం కుదురదు, బెల్ట్‌షాపులు రద్దు చేయిస్తా, మా ఆడపడుచులకు అండ గా ఉంటానంటూ తాను పెద్దన్నయ్య గా పాత్ర పోషించే ప్రయత్నం చేశారు. అర్జమూరులో కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు.

కాంగ్రెస్ కిరికిరి సీఎంల వల్లే ర్రాష్టం భ్రష్టుపట్టిందని, వాళ్లు కోట్లు సంపాదించుకుంటే కిందిస్థాయి జనం అప్పుల్లో మునిగిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరై నా అప్పు లేకుండా, కష్టాలు లేకుండా జీవితం గడుపుతున్నారా అంటూ ప్ర శ్నించి ఇలాంటివేమీ లేవని చేతులెత్తేవారు ఎవరైనా ఉన్నారా అంటూ బా బు ప్రశ్నించినప్పుడు కష్టాల్లో ఉన్నామనే పాదయాత్రలో పాల్గొన్న వారం తా చేతులెత్తి సంకేతాలిచ్చారు. ఇదీ ఈ ర్రాష్టపరిస్థితి. అందుకే మంచి భవిష్యత్ కోసం, అభివృద్ధి కోసం, సామాజిక న్యాయం కోసం నేను కట్టుబడి ఉన్నా, మాట తప్పేదే లేదని స్పష్టం చేశారు. ఇప్పటికీ ఊళ్లలో ఉన్న ఆడపడుచులకు చెవికి దిద్దులు లేవని, మంగళసూత్రాలకు కూడా నోచుకోలేని దుస్థితిలో ఉంటే గాలి జనార్ధనరెడ్డి లాంటివాళ్లు బంగారు పళ్లెం, బంగారు మంచం మీద కులాసా చేస్తున్నారని దుయ్యబట్టడం ద్వారా ప్రజలకు వారి అవినీతి చర్యలను వివరించారు.

ఎక్కడా తాగునీరు లేదు, సాగునీరు లేదు, కరెంటు లేదు, ఉండటానికి ఇల్లు లేదు, కనీసం తృప్తిగా తినడానికి తిండి లేదు, దీనికి కాంగ్రెస్సే కారణమని ఆరోపించారు. తొమ్మిదేళ్ల పరిపాలనలో ర్రాష్టానికి చేయాల్సిందంతా చేశాం. మంచి జీవితాన్ని గడిపేలా దూరదృష్టితో వ్యవహరించామని చె ప్పుకొచ్చారు. సామాజిక న్యాయం కో సం నేను చేయాల్సిందంతా చేస్తున్నా ను. ఈ విషయంలో అందరికీ తగు న్యాయం చేసేంత వరకు మడమ తిప్పను అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇక ఇప్పటిదాకా అన్నింటి మీదా పన్నులు వేశారు. ఇక మిగిలిందంటూ ఉంటే తలనీలాలే. వాటికి కూడా పన్ను వేస్తారు. మీరు కట్టలేదో ఉన్న తలనీలాలను కూడా పీక్కుపోయే దుర్మార్గ ప్రభుత్వం ఉందంటూ పన్నుల తీవ్రతను ఎత్తిచూపారు. ఇప్పుడు వంట గ్యాస్‌కి దిక్కు లేకుండాపోయింది. అప్పట్లో వ్యవసాయానికి పుష్కలంగా నీరు అందిస్తే ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేకుండాపోయిందని అన్నారు. ఎస్సీలకు న్యాయం చేయాలని వర్గీకరణకు మద్దతు ఇచ్చాం. బీసీలకు డిక్లరేషన్ ఇచ్చాం.

మైనార్టీలకు అసెంబ్లీ సీట్లలో వాటా ఇచ్చాను, ఇవన్నీ కూడా మీకోసమే అని హామీ ఇచ్చారు. ప్రజలు బ తుకు కోసం బంగారం తాకట్టు పెట్టుకుంటే వై. ఎస్ తనయులు బంగారు భూములను కూడబెట్టుకున్నారని, కో ట్లు దోచుకుతిన్నారని ఆరోపణలు గు ప్పించారు. ఇప్పుడు మీరంతా అప్పు ల్లో ఉన్నారు, రైతు పరిస్థితి బాగోలేదు. డ్వాక్రా మహిళలకు పావలాకే వడ్డీ అని ఉన్నదంతా ఊడ్చేసేలా డబ్బు వసూ లు చేస్తున్నారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే బ్యాంకుల్లో తీసుకున్న రుణాలన్నింటినీ మాఫీ చేస్తానని, వ్యవసాయం లాభసాటిగా ఉండేలా చూస్తాతిమని హామీ ఇచ్చారు.