February 6, 2013

అవినీతి అంతానికి కదిలిన విద్యార్థి లోకం


తమ్ముళ్లూ... రాజకీయ చైతన్యానికి మారుపేరు బెజవాడ... రాష్ట్రాన్ని, దేశాన్ని పట్టి పీడిస్తున్న అవినీతి మహమ్మారిని తరిమి కొట్టాల్సిన సమయం ఆసన్నమైంది...అదీ ఇక్కడి నుంచే ప్రారంభం కావాలి...మీ విద్యార్థులతోనే ప్రారంభం కావాలి...అంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నగరంలో పలుచోట్ల చేసిన ప్రసంగానికి విద్యార్థి లోకం స్పందించింది. శనివారం నుంచి మూడు రోజుల పాటు నగరంలో పాదయాత్ర చేస్తూ యువతను ఉద్దేశించి చేసిన ప్రసంగాలకు అనూహ్య స్పందన లభించిందని చెప్పవచ్చు. తూర్పు నియోజకవర్గంలోని పటమటలంకలో బసచేసిన చంద్రబాబును కలిసేందుకు మంగళవారం వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పెద్దయెత్తున తరలివచ్చారు. అక్కడకు వచ్చిన విజయ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విద్యార్థులను 'ఆంధ్రజ్యోతి' పలకరించగా, అవినీతి అంతానికి తమ వంతు పోరాటం చేస్తామని, చంద్రబాబు పిలుపుతో ఎస్ఎంఎస్‌ల పోరాటానికి ఈ రోజు నుంచే శ్రీకారం చుడతామని స్పష్టం చేశారు.

దేశం, రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య, పేదరికం పెరగడానికి లక్షలాది కోట్ల రూపాయల ప్రజాధనం ప్రజాప్రతినిధుల ముసుగులో అవినీతి పరులు దండుకోవడమే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నేటి నుంచే అవినీతిపై పోరాటం అవినీతిపై చంద్రబాబు చేసిన ప్ర సంగం ఎంతగానో ఆలోచింపచేసింది. నేటి నుంచే నా వంతుగా అవినీతిపై పోరాటం సలుపుతాను. ఈ విషయంలో నా మిత్రులు, బంధువులకు కూడా ఎస్ఎంఎస్‌లు పంపిస్తాను - సుమలత ఆంధ్రా అన్నా హజారే చంద్రబాబు అవినీతి ప్రక్షాళనకు న్యూఢిల్లీలో అన్నా హజారే చేపట్టిన ఉ ద్యమం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అన్నా హజారే స్పూ ర్తితో రా ష్ట్రంలో చంద్రబాబు పోరాటం చేసి యువత దృష్టిలో ఆంధ్రా అన్నా హజారేగా మారారు.

చంద్రబాబు స్పూర్తితో ఆయన ఇచ్చిన పిలుపుతో అవినీతిపై పోరాటానికి ముందుకు కదులుతాం - సుధారాణి బాబు పాలనలోనే మహిళలకు రక్షణ చంద్రబాబు పాలనలో మహిళలు, విద్యార్థినులకు పూర్తి రక్షణ ఉండేది. నేడు ఆ పరిస్థితి కనబడటం లేదు. అర్థరాత్రి కూ డా మహిళలు తిరగాలని గాంధీమహాత్ముడు కలలుగంటే నేడు పట్టపగలే ఆ పరిస్థితి లేదు. విద్యార్థినులు, యువతులు బయటకు రావాలంటేనే గుండెలరచేత పెట్టుకొనే పరిస్థితి దాపురించింది.

అవినీతి అంతంతో పాటు మహిళలకు రక్షణ చంద్రబాబుతోనే సాధ్యమవుతుంది. - స్రవంతి విద్యార్థులంతా స్పందిస్తున్నారు అవినీతిని అంతం చేయాలన్న చంద్రబాబు పిలుపు విద్యార్థి లోకా న్ని ఆలోచింపచేస్తోంది. నా స్నేహితులు అందరం దీని గురించే మాట్లాడుకుంటున్నాం. సమయం దొరికినప్పుడల్లా ఎస్ఎంఎస్‌ల ద్వారా అవినీతిపై యుద్ధం చేయడానికి సిద్ధంగా వున్నాం. 2014 ఎన్నికలలో చంద్రబాబు విద్యార్థులకు కూడా సీట్లు కేటాయిస్తే చాలా బాగుంటుంది

- రత్నకుమారి