February 6, 2013

మీ కోసం పాదయాత్రకు అనూహ్య స్పందన

గుంటూరు : వస్తున్నా మీకోసం పాదయాత్రకు అనూహ్య స్పందన వచ్చిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంటకు జిల్లా పార్టీనాయకులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఆరోగ్యం సహకరించకపోయినా, గొంతునొప్పి భాధిస్తున్నప్పటికీ ప్రజలందిస్తున్న ఆదరాభిమానాలు ఉత్సాహం నింపుతున్నాయన్నారు. కానీ వారి కష్టాలు తనను బాగా కుంగదీసాయన్నారు. జిల్లాలో సొసైటీల్లో టీడీపీ ఆధిక్యత చాటటం శుభసూచికమన్నారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ టీడీపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

ప్రజలు, కార్యకర్తలు అండదండలతోనే తనకీ గుర్తింపు లభించదన్నారు. చివరి రక్తపు బొట్టు వరకు ప్రజలు, పార్టీ శ్రేణుల పక్షానే ఉండి పోరాడతానని స్పష్టం చేశారు. ప్రభుత్వంపై వ్యతిరేకత నివురుగప్పిన నిప్పులా ఉందన్నారు.టిడీపీ జిల్లా అధ్యక్షులు ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ పాదయాత్ర విజయవంతం కావటానికి కావల్సిన అన్నిరకాల చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పాదయాత్ర కొనసాగుతున్న అన్ని ప్రాంతాలను పరిశీలించి ముఖ్య నేతలతో అనేక దఫాలు సమావేశం ఏర్పాటయ్యామని తెలిపా రు. పాదయాత్ర ఎనిమిది నియోజక వర్గ పరిధిలో 150 కిలోమీటర్లు రూపొందించినట్లు తెలిపారు. జిల్లా ప్రజానీకం తమ రాకకోసం ఎదురుచూస్తుందని పుల్లారావు అన్నారు.

కార్యక్రమంలో నరసరావుపేట ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, ఎమ్మెల్యేలు యరపతినేని శ్రీనివాసరావు, కొమ్మాలపాటి శ్రీధర్, జివివి ఎస్ ఆర్ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే ముమ్మనేని వెంకటసుబ్బ య్య, పార్టీనాయకులు తెనాలి శ్రావణ్‌కుమార్, మన్నవ సు బ్బారావు, బోనబోయిన శ్రీనివాస్‌యాదవ్, యాగంటి దుర్గారావు, నిమ్మకాయల రాజనారాయణ, షేక్ లాల్ వజీర్, మా నుకొండ శివ ప్రసాద్; కోవెలమూడి రవీంద్ర (నాని), చిట్టాబత్తిన చిట్టిబాబు, తదితరులు పాల్గొన్నారు.